సబ్ ఫీచర్

నీటి కష్టాలు షురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో వేసవి తాపం మొదలైంది. జనం తాగునీటికి అల్లాడుతున్నారు. బిందె నీటి కోసం మైళ్లు నడక. అడుగంటిన భూగర్భ జలాలు.. నదులన్నీ ఎడారులుగా మారాయి. పాపం ప్రజలు కలుషిత నీటినే సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇంకా మార్చి రాకుండానే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్రలో నీటిఎద్దడి ప్రస్తుతానికే తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలోనే 11 మండలాల్లో నీటి ఎద్దడి 424 గ్రామాలకు వుందంటే తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
గ్రామాల్లో మంచినీటి సౌకర్యంకోసం నిర్మించిన పథకాలకు పర్యవేక్షణ లేక మూలపడ్డాయి. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే కంచిలి, కవిటి, రణస్థలం, సంతబొమ్మాళి, పొందూరు, బత్తిలి, భామిని, సీతంపేట మండలాల్లో నీటి సమస్య బాగా వుంది. సుమారు 400 గ్రామాలు నీటి ఎద్దడికి గురవుతున్నాయి. ఈ ఎద్దడిని తట్టుకోవడానికి అంచనావేసి టాంకర్ల ద్వారా సరఫరాకు సౌకర్యం కల్పించాలి. బావుల్లో కూడా నీరు అడుగంటిపోతోంది. పొలాల్లో బోరుబావులలో నీరు అడుగంటిపోతోంది. కూలిపనికి వెళ్లే వారైతే కూలీ మానుకుని నీటికోసం పడిగాపులు కాసే పరిస్థితి వుందంటే అతిశయోక్తికాదు. గోదారి తగ్గడంతో కోస్తాలోనే నీటికొరత వుందంటే రానున్న మేనెలలో నీటి సమస్య ఎలావుంటుందో అర్ధంచేసుకోవచ్చు.
ఇకపోతే విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఏజెన్సీ మండలం గుమ్మలక్ష్మీపురంలో చాలా గిరిజన గ్రామాల్లో వాగులు, చెలమల బురదనీరే శరణ్యం. గిరిజన ఆవాసాల్లో నీటి సమస్య తీవ్రంగా వుంటోంది. ఈ నీటి సమస్య శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు గిరిజన ప్రాంతాలవారు ఊటబావులు, చెలమలు, కుంటల్లోని నీటినే తాగాల్సి వచ్చి అనారోగ్యం పాలవుతున్నారనడంలో సందేహం లేదు. ఇలా నీటి తీవ్రతను పరిశీలిస్తే నవ్యాంధ్రలో 13 జిల్లాల్లో సుమారు 10 జిల్లాలకు ఈ నీటి సమస్య పెనుభూతంలా మారింది.
నీటి సమస్యను ఆధారంగాచేసుకుని ఇప్పటివరకు నగరాలకే పరిమితమైన నీటి వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది. 20 లీటర్ల నీటిని (మినరల్) 30 రూపాయలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. కలుషిత నీటిని వాడడంవల్ల వాంతులు, నీళ్ల విరేచనాలు, కామెర్లు, జ్వరాలు ఉదర సమస్యలతో ప్రజలు అస్వస్తల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి నీటిఎద్దడిని ప్రభుత్వం ముందుగానే గ్రహించి బావుల్లోని నీటిలో క్లోరినేషన్ చేయించాలి. మరుగునపడ్డ పథకాలను ప్రారంభించాలి. మరమ్మతుకు నోచుకోని బోరులను, పైపులైన్లు మరమ్మతుకు పూర్తిగా సౌకర్యాలులేని రక్షిత మంచినీటి పథకాలు పెట్టాలి. రానున్న వేసవిని దృష్టిలోపెట్టుకుని ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందిస్తూ ప్రజల ఆరోగ్యంతోపాటుగా మంచినీటి సమస్యను తీర్చాలి.

- మహ్మద్ రఫీ