సబ్ ఫీచర్

సర్వశిక్షా అభియాన్‌లో సమన్వయ లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న సెక్టోరల్ అధికారుల మధ్య సమన్వయ లోపం కొన్ని పాఠశాలలకు శాపంగా మారింది. ప్రతి యేటా పాఠశాలల నిర్వహణకోసం సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇచ్చే పాఠశాలల గ్రాంటు వివరాలను సక్రమంగా పంపని కారణంగా లక్షల రూపాయల గ్రాంటును ఆయా పాఠశాలలు కోల్పోవాల్సి వస్తున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో 2015-2016 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పాఠశాల నిర్వహణ గ్రాంటు కింద జిల్లాలోని 2927 పాఠశాలలకు 2 కోట్ల 8 లక్షల 30వేల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులు ఆయా పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమఅయ్యాయి. గత ఏడాది 2కోట్ల 11 లక్షల రూపాయల గ్రాంటును విడుదల చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు పాఠశాలల్లో తరగతి గదుల సంఖ్య పెరిగినప్పటికీ ఆమేరకు మంజూరైన నిధులు విడుదలకాలేదు.
సెక్టోరల్ అధికారులు తప్పుడు నివేదికలను పంపడంవల్లనే తక్కువ నిధులు వస్తున్నాయని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సర్వశిక్షా అభియాన్ ద్వారా పాఠశాలల నిర్వహణకోసం గ్రాంటును విడుదల చేస్తున్నది. మూడు తరగతి గదులున్న పాఠశాలలకు 5వేల రూపాయలు, అంతకంటే ఎక్కువ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు 10వేల రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జూన్, జూలై మాసంలోనే పాఠశాలల నిర్వహణ గ్రాంటును విడుదల చేయాల్సి ఉంది. అయితే డైస్‌డేటా పూర్తిచేసిన తర్వాతనే గ్రాంటు ఇవ్వాలని అధికారులు భావించారు. ఆమేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నవంబర్ నెలాఖరు నాటికే డైస్‌డేటాలో విద్యార్థుల వివరాలతోపాటు ఆయా పాఠశాల వివరాలను నమోదుచేశారు. అయితే ప్రధానోపాధ్యాయులు నమోదుచేసిన ప్రకారం తుది డేటాలేకపోవడంతో సవరణకు అవకాశం ఇచ్చారు. ఆమేరకు ప్రధానోపాధ్యాయులు సవరించగా, వాటిని పరిగణనలోకి తీసుకుని సర్వశిక్షా అభియాన్ సెక్టోరల్ అధికారులు యధావిథిగా ఉన్నతాధికారులకు పంపించారు. ఆమేరకు పాఠశాలల విధులు మంజూరయ్యాయి. తమ పాఠశాలల్లో గదుల సంఖ్యనుబట్టి నిధులు మంజూరుకావాల్సి ఉండగా కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎస్‌ఎస్‌ఏ అధికారులకు వివరించినా కూడా వారు పట్టించుకోవడం లేదు.
దీంతో జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలలు సుమారు 30 లక్షల రూపాయలు నిర్వహణ గ్రాంటును కోల్పోవాల్సి వచ్చిందని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. జిల్లాల్లోని పలు మండలాల్లో పాఠశాలలకు గదులున్నమేరకు నిధులు మంజూరుకాకపోవడం గమనార్హం. దీనికంతటికీ కారణం సర్వశిక్షా అభియాన్ సెక్టోరల్ అధికారులు సి.ఎం.ఓ, ఏ.ఎం.ఓ, జీ.సి.డీ., ఏఎల్‌ఎస్‌సీఓ, ఏఎన్‌ఓ, ప్లానింగ్ కో-ఆర్డినేటర్‌ల మధ్య సమన్వయం లోపించిన కారణంగానే ఆయా పాఠశాలలకు నిబంధనల ప్రకారం రావాల్సిన గ్రాంటును కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తున్నది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి పోస్టు నాలుగు మాసాలుగా ఖాళీగా ఉంటున్నది. పది రోజుల క్రితంవరకు అదనపు జాయింట్ కలెక్టర్ అదనపు బాధ్యతలు నిర్వహించగా, ప్రస్తుతం జిల్లా విద్యాధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెక్టోరల్ అధికారులు కార్యాలయానికి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళాలో తెలియని పరిస్థితి. పొద్దంతా రాని కొందరు అధికారులు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు కార్యాలయంలో విధులను నిర్వహిస్తున్నారు. ఇలా వారిమధ్య సమన్వయం లేని కారణంగా పాఠశాలలకు అన్యాయం జరుగుతున్నది. ఇకనైనా ఈ పరిస్థితులను చక్కదిద్దవల్సిన అవసరం ఉంది.

- గుండు రమణయ్య