సబ్ ఫీచర్

ఆచార్యదేవో భవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువుకు మన సమాజంలో ఆచార్య దేవోభవ అని ఉన్నత స్థానం ఇచ్చి గౌరవిస్తున్నాము. దేశ ప్రగతికి మూలస్తంభాలు వారు. తమవద్ద చదువుకొనే విద్యార్థులకు మంచి విద్యాబోధన చేసి వారిలో జ్ఞానజ్యోతులు వెలిగించి, మానవతా విలువలు నేర్పి దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపించటానికి తమ వృత్తిని తపస్సుగా చేస్తారు.ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఈ వృత్తిలోకి వచ్చిన వారికి నిరాశ, నిస్పృహలే మిగులుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంటు స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్కో తరగతికి దాదాపు 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ఒకరే అన్ని సబ్జెక్ట్స్ చెప్పాల్సి వస్తుంది. నేటి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా ఇద్దరి పిల్లలనే సంరక్షించుకునే ఓపిక లేక క్రష్‌లోనో లేక ప్లేస్కూల్‌లోనో వేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. అలాంటిది 40 మంది విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచి, విద్యాబోధన చెయ్యటం ఒక్క ఉపాధ్యాయుడికి చాలా కష్టం. అందరు విద్యార్థులకు ఒకే విధమైన తెలివితేటలు ఉండవు. ఏ ఒక్కరికైనా తక్కువ మార్కులువస్తే ఆ ఉపాధ్యాయుడిని బాధ్యుని చేసి నిందిస్తున్నది ప్రభుత్వ యంత్రాంగం. మందబుద్ధిగల వారికి ఎక్కువ శ్రద్ధతీసుకొని బెదిరించి, చదువు చెబుదామంటే చేతిలో బెత్తం లేకుండా విద్యార్థిని ఏమాత్రం బాధపెట్టకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన చెయ్యాలి అని ప్రభుత్వ అధికారులనుండి ఉత్తర్వులు ఉన్నాయి.
ఎవరైనా ఉపాధ్యాయుడు అనాలోచితంగా దండిస్తే దానిని మీడియావారు ప్రాపగాండా చేసి, ఆ ఉపాధ్యాయుడిని కోర్టుకుఈడ్చి కష్టాలు పెట్టి వారి వ్యాపారాన్ని పెంచుకొంటున్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు కుమ్మక్కై కొన్ని సందర్భాల్లో భారీ మొత్తంలో జరిమానాలు కూడా ఉపాధ్యాయులనుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రభుత్వంవారు తమ పరిపాలనా సౌలభ్యంకొరకు ప్రభుత్వ ఉపాధ్యాయులను అన్ని రకాల పనులకు వినియోగించుకొంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాఠశాలలో విద్యాబోధన చేసే అవకాశమే కలగడం లేదు. మన చిన్నప్పుడు ఉపాధ్యాయులు మనలను గోడకుర్చీ వేయించి, గుంజిళ్ళు తీయించారు. అయినా ఇప్పటికీ ఆ గురువులు కలిస్తే మనస్ఫూర్తిగా వారికి నమస్కారం చేస్తాము. కారణం వారు విధించిన దండనతో మనం బాగా చదువుకొని బాగుపడాలి అనే తపన ఉన్నది కాని మరొక దురుద్దేశం లేదు. అందుకే ఆరోజులలో గురు, శిష్యుల సంబంధం ఎంతో పవిత్రంగా ఉండేది. కాని ఈరోజులలో ‘బెల్ అండ్ బిల్’గా తయారయింది. స్కూల్ గంటకొట్టగానే విద్యార్థి ఇంటికిపోతాడు. నెలరోజులు కాగానే ఉపాధ్యాయునికి జీతం జేబులోకి వస్తుంది.ప్రభుత్వం సమాజంలోని పిల్లలకొఱకు ఎన్నోరకాల పథకాల ద్వారా స్కూల్స్‌ను, హాస్టల్స్‌ను ప్రారంభించి ఉచిత విద్యాబోధనను ఏర్పాటుచేస్తున్నది. ఈ పథకాల క్రింద వందల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చుచేస్తున్నది. కాని ఎవ్వరూ సరిగ్గా ఈ అవకాశాలను వినియోగించుకోవడం లేదు.
ఈమధ్య కొన్ని వార్తలు వింటున్నాం. గవర్నమెంటు హాస్టల్‌లో పెళ్ళికాని 9వ తరగతి చదువుతున్న ఆడపిల్ల ప్రసవించింది. ఫలానా గవర్నమెంట్ స్కూల్‌లో చదివే 10వ తరగతి అమ్మాయిలు వారి ఉపాధ్యాయులతో పట్నంలోని లాడ్జిలో పోలీసులకు దొరికారు. ఇలాంటి వార్తలవల్ల తమ పిల్లలు గవర్నమెంటు స్కూల్స్‌లో చెడిపోతారు అదే కార్పొరేట్ స్కూల్స్‌లో బాగా చదువుతారు అని భ్రమపడి లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ స్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. ఇంజనీర్లో, కలెక్టర్లో కావాలి అని కలలుకని తలకుమించిన భారం పిల్లల నెత్తినిపెట్టి రాత్రీ పగలు చదివిస్తున్నారు. ప్రయివేట్ స్కూల్స్‌లో వారు పెట్టే బాధలు తట్టుకోలేక చదివింది అర్ధంకాక డిప్రెషన్ ఆవహించి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు అనె్నంపునె్నం తెలియని విద్యార్థులు. పై రెండు సంఘటనలకు పూర్తిగా బాధ్యత తల్లిదండ్రులదే. తమ పిల్లలు చదువుకొంటున్న విద్యాసంస్థలకు తరచుగా వెళ్ళి తమ పిల్లల బాగోగులు సమీక్షించి రావాలి. అప్పుడు ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశం రాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు దగ్గరలోవున్న ప్రభుత్వ పాఠశాలల్లో లేక వసతి గృహాలలో చేర్పించి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులతో స్నేహభావంతో ఉండి మంచి సలహాలు ఇస్తూ తమ పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలువేయాలి.

- జన్నాభట్ల లక్ష్మికామేశ్వరి