సబ్ ఫీచర్

కార్మికుల దోపిడికి అంతం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులు వెట్టిచాకిరీకి గురవుతున్నారు. కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. చాలీచాలని వేతనాలు ఇచ్చి కాంట్రాక్టర్లు అక్రమ ఆర్జనకు పాల్పడుతున్నారు. ట్రాన్స్‌కోలో ‘ప్రైవేట్’గా నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2వేల మంది కాంట్రాక్టర్లు శ్రమదోపిడీ యదేచ్ఛగా చేస్తున్నారు.
లేబర్ చట్టం ప్రకారం ఈ కార్మికులు పిఎఫ్, ఇపిఎఫ్ చెల్లించాలి. కొన్నిసార్లు డ్యూటీ సమయంలో ప్రమాదానికి గురైతే ఎలాంటి పరిహారం రాక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ప్రతి జిల్లాలోను 20వరకు ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాలను ఏర్పాటుచేశారు. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ కాలిన వెంటనే ఈ మరమ్మత్తు కేంద్రాలకు తరలిస్తారు. సిద్ధంగాఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్ళి పంటను కాపాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కేంద్రాలను నేరుగా ట్రాన్స్‌కో నిర్వహిస్తుంది. మరికొన్ని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇక్కడనుంచే అవినీతి, దోపిడికి అంకురార్పణ జరిగింది. ఒక్కో కేంద్రంలో 9మంది దాకా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. హెచ్ వైండర్, ఎల్‌వి వైండర్, అసెంబ్లీ వైండర్, ఇద్దరు హెల్పర్లు, ఒక టెస్టర్ విధులు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా శ్రమచేస్తుంటారు. నెలరోజులు పనిచేస్తే వీరికి గిట్టేది 3వేల నుంచి 4వేలు మాత్రమే. కేంద్రాలకు వచ్చే ట్రాన్స్‌ఫార్మర్ల లోడింగ్, అన్‌లోడింగ్ చేసినందుకు ట్రాన్స్‌కో సంస్థ కాని ఆ డబ్బులు కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్లే దిగమింగుతున్నారు.
ఏనాటికైనా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారనే ఆశతో కాంట్రాక్టర్ల వెట్టిచాకిరిని భరిస్తూ వస్తున్నారు. ప్రతినెల చెల్లించాల్సిన పిఎఫ్, ఈపిఎఫ్, ఇఎస్‌ఐ సొమ్మును కాంట్రాక్టర్లు జమచేయటం లేదు. దీంతో కార్మికులకు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు గాయాలైతే ఇబ్బందులు తప్పటం లేదు. కాంట్రాక్టర్లది తప్పయతే కార్మికులు శిక్ష అనుభవిస్తున్నారు. ఇఎస్‌ఐ చెల్లించినట్లు ఐతే ప్రమాదం జరిగినపుడు అయ్యే ఖర్చు సదరు సంస్థ భరిస్తుంది. లేకపోతే కార్మికుల జీవితాలు అంధకారమే. ప్రభుత్వం చేసిన కార్మిక చట్టాలు కఠినంగా అమలుచేయటం లేదు. రెక్కలు ముక్కలుచేసుకొని ఎండలో, వానలో 10 గంటలపాటు అలుపెరగకుండా కష్టపడుతున్న కార్మికులు అన్నిరకాలుగా దోపిడికి గురవుతున్నారు.
కార్మికులకు జరుగుతున్న కష్టనష్టాల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునర్ విచారణచేసి, నష్టపడకుండా చూడాలి. పిఎఫ్, జిపిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించని వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంతగా రోజుకు పనె్నండు గంటల పాటు శ్రమిస్తున్న కార్మికులను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదు. కాంట్రాక్టర్లు ఎంతసేపూ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తు న్నారు తప్ప కార్మికుల సంక్షేమం పట్టడం లేదు. కార్మికులు క్షేమంగా ఉంటేనే కదా..వారికి లాభాలు వచ్చేది? మరి ఇంత కష్టాన్ని కూడా ఓర్చు కొని కార్మికులు పనిచేస్తున్నారంటే ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోతాయా? అన్న ఆశతో మాత్రమే. కాని వారి పరిస్థితి చూస్తుంటే మంచి రోజులు వచ్చేలా కనిపించడం లేదు. శ్రమకు తగ్గ ఫలితం అందక నానా తీవ్రస్థాయలో శ్రమదోపిడీకి గురవుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వీరి శ్రమను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి. వీరి ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యాలి. నిపుణులైన ఈ పనివారి సేవలను సద్వినియోగం చేసుకోవడమే కాదు, వారి శ్రమను గుర్తించి తగిన వేతన సదుపాయం కల్పించాలి. ఇతర రకాల భద్రతను కూడా కల్పించాలి.

- రావుల రాజేశం