సబ్ ఫీచర్

దీ‘పాల’ పుంతలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైటింగ్‌ల్లోను కొత్త కొత్త కానె్సప్ట్‌లు వచ్చాయి. కృత్రిమమైన లైటింగ్ ఇంటిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మంచి లైటింగ్ వల్ల మూడ్ కూడా బాగుంటుంది. కృత్రిమ లైటింగ్ కూడా సహజసిద్ధమైన లైటింగ్ అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. పగటిపూట కరెంట్ లైట్లు పెద్ద అవసరం లేకున్నా చీకటి పడ్డాక దాని అవసరం కచ్చితంగా ఉంటుంది. మార్కెట్లో లభిస్తున్న కొత్త కొత్త లైట్ ఫిటింగ్‌లు మన ఇంటికి మరింత శోభనిస్తాయి.
ఒకే విధమైన రంగులైట్లతో బోర్ కొడుతుంది. ఇంద్రధనుస్సులోని రంగులను ఇంట్లోనే సాధ్యమవుతున్నాయి. మార్కెట్లో కావల్సిన ఆకారాల్లో.. కావల్సిన రంగుల్లో.. కావల్సిన సైజుల్లో.. పద్ధతుల్లో దొరుకుతున్నాయి. అందుకు తగ్గ విధంగానే ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. ఇప్పుడు చాలామంది లైటింగ్ ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. ఇంట్లో లైటింగ్ అందంగా ఉండటంతో పాటు ఇంటీరియర్స్ కూడా చక్కగా అమరిపోవాలనుకుంటున్నారు.
మెరుగైన లైటింగ్ కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన పని లేదు. కావాల్సిందల్లా సృజనాత్మకత. ఒకప్పుడు ఆధునిక లైటింగ్ వ్యవస్థను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. అద్భుతమైన డిజైన్లలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. లైటింగ్ అన్నది వెలుతురు కోసమే అనే రోజులు పోయాయి. ఇది కూడా గృహాలంకరణలో భాగమైపోయింది. ముఖ్యంగా షాండ్లియర్, ఫ్లోర్, వాల్, సీలింగ్ ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఇంటి వాతావరణం...ఇంటీరియర్స్... మన మనసుపై ప్రభావం చూపుతాయి. ఆహ్లాదకరమైన అనుభూతినందించే రంగులు కావాలంటే అనువైన లైటింగ్ తప్పనిసరి. ఇంటికి లైటింగ్ సరిగా లేకుంటే.. అది కళావిహీనంగా ఉంటుంది. ఇంట్లోని ప్రతి గదికీ ఓ ప్రాధాన్యముంటుంది. దానికి తగ్గట్టే లైటింగ్ ఉండాలి.
షాండ్లియర్స్ హోదా:
షాండ్లియర్స్‌కు నగరంలో డిమాండ్ అధికంగా ఉంది. ఇప్పటికీ ఇంట్లో అందమైన షాండ్లియర్ ఉండాలనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. రూమ్ పరిధి, సీలింగ్ హైట్‌ను బట్టే షాండ్లియర్‌ను ఎంచుకోవాలి. షాండ్లియర్‌ను గది మధ్యలో పెట్టుకోవడం ఫెంగ్‌షుయి ప్రకారం ఎంతో మంచిది. ఇది పాజిటివ్ లైట్‌ను అందిస్తుంది. స్వరోస్కీ కంపెనీ డైమండ్స్‌తో రూపొందించిన షాండ్లియర్స్‌తో పాటు... ప్లాస్టిక్, లెడ్ ఆక్సైడ్ క్రిస్టల్, పోర్సిలిన్, లెడ్ ఫ్రీ క్రిస్టల్‌తో తయారైనవి కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.
వివిధ రంగుల విద్యుత్ దీపాలతో గది ఆకర్షణీయంగా తయారవుతుంది. బెడ్ రూం, స్టడీ రూంలలో కూడా డ్రాప్ లైట్‌లను వినియోగించుకోవచ్చు. చదువుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది. కిచెన్‌లలో మనకు నచ్చిన విద్యుత్ బల్బులు వాడుకోవచ్చు. అయితే లైటింగ్ సిస్టమ్‌లో రంగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముదురు రంగు ఫర్నిచర్ తేలికపాటి రంగులు గల గోడలపై లైటింగ్ ప్రసరిస్తే ఆ గది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. గదిలో ఉన్న గోడల రంగు ప్రముఖ పాత్ర వహిస్తాయి. గోడపై వాల్‌పేపర్ లేదా మెటాలిక్ పెయింట్ వాడినా ఆ ప్రాంతంలో డెకోరెటివ్ వాల్ లైట్‌ను వాడితే ఆ గదికి మరింత శోభనిస్తుంది.
ప్రతి గదిలోనూ ఏదో ఒక ప్రాంతం ఫోకస్ పాయింట్‌లా ఉండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశంలో మీ అభిరుచికి తగినట్లు ప్రత్యేకమైన శిల్పాలు, చిన్న పిల్లల బొమ్మలు, లైటింగ్ టేబుల్స్, షాండ్లియర్, ఫ్లవర్ పాటిస్ లాంటివి అమర్చుకోవాలి.
గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. గది రంగును రిఫ్లెక్ట్ చేసే విధంగా బల్బులను అమర్చుకోవాలి. లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దాని మీద, రంగురంగుల డిజైన్లలో ఉండే బేసిన్‌లో నీళ్లు పోసి దానిపై రంగురంగుల అందమైన పూలను అమర్చితే సహజసిద్ధంగా ప్రకృతి తలపించినట్టు అవుతుంది.
డ్రాయింగ్‌రూమ్‌లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ఫ్లవర్‌వాజ్‌లు అమర్చండి.
గృహాలంకరణలో షాండ్లియర్స్ ప్రధానమైనవి. వాటిని తళతళలాడుతూ ఉంచాలంటే శుభ్రం చేయాల్సిందే. క్రిస్టల్ షాండ్లియర్స్ త్వరగా దుమ్ము పేరుకుంటాయి. కనుక తరచుగా శుభ్రం చేయవలసి వస్తుంది. ఒక ఫెదర్ డస్టర్ లేదా కాటన్ గుడ్డ తీసుకుని వాటిని శుభ్రం చేయాలి. షాండ్లియర్స్ సరైన వెలుగు నివ్వకపోతే, లేదా క్ట్రిస్టల్స్ దుమ్ముగా ఉంటే, అవి శుభ్రపరిచే సమయమని గ్రహించాలి.
షాండ్లియర్స్‌ను చల్లగా ఉన్నపుడే ఎల్లప్పుడూ శుభ్రపరచండి. శుభ్రపరచే ముందు ప్లగ్‌ను సాకెట్ నుండి వేరు చేయండి. ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి. కాటన్ గుడ్డ లేదా పేపర్ టవల్ లేదా ఇతర దుమ్ము దులిపే గుడ్టలు క్రిస్టల్స్ తుడిచేందుకు ఉపయోగించవచ్చు.
క్రిస్టల్స్‌పై శుభ్రపరిచే సొల్యూషన్లు స్ప్రే చేయటం లేదా డిష్ వాషర్‌లో వాటిని పడేయటం చేయరాదు. లైటు బల్బులను ముందుగా తీసి పక్కన పెట్టండి. మెత్తటి గ్లోవ్స్ చేతికి వేసుకొని లేదా గుడ్డతో శుభ్రం చేయండి. గుడ్డకు క్లీనర్ వేసి దానితో తుడవవచ్చు. అంతే కానీ నేరుగా క్రిస్టల్స్‌పై ఎట్టి క్లీనర్ పడరాదు.
లైటు స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ల్యాంప్ షేడ్ తీయకండి. అది వేడిగా ఉంటే బల్బు పగలటమే కాక, గాయాలయ్యే ప్రమాదం ఉంది. ల్యాంప్ షేడ్ తీసే ముందు దానికి ఉన్న వైర్లు డిస్ కనెక్ట్ చేయండి. లేకుంటే షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే ప్రమాదముంది. ల్యాంప్ షేడ్‌ను తడిచేతులతో పట్టుకోకండి. నీరు విద్యుత్‌ను ప్రవహింపజేస్తుంది.
షాండ్లియర్స్ భాగాలు విడతీసే ముందు దానికి ఒక ఫోటో తీస్తే ఫిట్ చేయటానికి ఆ ఫోటో ఉపయోగపడగలదు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి