సబ్ ఫీచర్

ఒత్తిడి తగ్గించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో పరీక్షలను శాసించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
మనం మనసులో ఏది మనోసిద్ధితో అనుకుంటే అది సాధించే సత్తా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే ఒక్కసారిగా మన మనసును కొంత వెనక్కి తీసుకుని వెళ్లండి. జెండా పండుగ రోజు నిర్వహించిన ఆటల పోటీలల్లో, తరగతిలో మంచి మార్కులు సాధించడం, ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులను అందుకోవడం- ఇలాంటివెన్నో ఆనందకరమైన సంతోషాన్నిచ్చే సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటే పరీక్షల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించవచ్చు. చిన్నప్పటినుండి నేను ఎన్నో సాధించాను, ఈ పరీక్షల్లో కూడా విజయబావుటా ఎగురవేస్తాను అని అనుకోవాలి, ఖచ్చితంగా సాధిస్తారు.
అర్థం చేసుకుని చదవాలి
ఎంత చదివామన్నది కాదు, ఎంతమేరకు అర్థం చేసుకుని చదివామన్నది ముఖ్యం. పుస్తకాలు ముందేసుకుని బట్టీకొట్టి చదివేదానికన్నా చదివేది ఎంతైనా సరే అర్థం చేసుకుని చదవడంవల్లనే బాగా గుర్తుంటుంది. చదివినది పర్మినెంట్‌గా మెమరీలోకి వెళ్తుందని గుర్తించాలి. చదివేటప్పుడు చదువుతున్న విషయాన్ని ఒక్కొక్కదానికి కనెక్టు చేసుకుంటూ మనసులో ఆ విషయాలను ముద్రించుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ వస్తుందో ఇంటర్‌లింక్ ఏర్పాటుచేసుకుంటూ చదివితే బాగా గుర్తు ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
ముఖ్యమైన పాయింట్స్
పుస్తకం చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉంటే వెంటనే ఒక నోటు పుస్తకంలో రాసుకోవాలి. ఈ పాయింట్స్ రివిజన్ చేసుకునే సమయంలో చాలా బాగా ఉపయోగపడతాయి. జవాబులను మన సొంత వాక్యాలలోకి అర్థం చేసుకుంటూ చదివితే చాలా సులభంగా పరీక్ష సమయంలో గుర్తుతెచ్చుకోవడానికి వీలుగా వుంటుంది. జవాబులు చదివిన తర్వాత ఒక్కసారి అద్దం ముందు నిల్చుని తనకు తానుగా మననం చేసుకోవాలి. వీలైతే ఒక్కసారి రాసినట్లయితే బాగా గుర్తుండే అవకాశం వుంటుంది.
సందేహాల నివృత్తి
తరగతి గదిలో టీచర్ పాఠం చెప్పినంతసేపు అర్థం అయినట్లుగానే వుంటుంది. పుస్తకం తీసి చదవడానికి కూర్చున్నపుడే లెక్కలేనన్ని డౌట్స్ వస్తాయి. వీలైనంత మేరకు మీకు మీరుగా ప్రయత్నం చేయండి. అప్పటికీ తీరకపోతే ఆ డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని టీచర్ దగ్గరకు సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇక కొంతమంది విద్యార్థులు సందేహాలను అడగడాని భయపడి అడగకపోవడంవల్ల ఆ డౌట్స్ అలాగే ఉండి నష్టపోతారు.
నిద్ర మరియు పోషకాహారం
పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి లోనై ఆహారం, నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోకపోతే పరీక్షల సమయంలో నీరసం ఏర్పడుతుంది. శారీరక శక్తి తక్కువవుతుంది. నిద్రకు ఖచ్చితంగా 6 గంటల పాటు సమయాన్ని కేటాయించాలి. సరైన నిద్ర తీసుకున్నపుడే బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేయడానికి అవకాశం వుంటుంది.
సహాయకారిగా ఉండాలి
పిల్లలకు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలి. పిల్లలు చదవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నపుడు ఇతర పనులలో వారికి సహాయకారిగా ఉండాలి. పిల్లలు చదువుకునే గదిని శుభ్రంగా ఉంచడం చేయాలి. వారి ఆలోచనలు మరలకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొంటే ఏకాగ్రతతో చదివే అవకాశం వుంటుంది.
పరీక్షల సమయంలో పిల్లలతో గడపడానికి, వారితో మాట్లాడడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. పరీక్షలవల్ల పిల్లల్లో కలిగే భయాందోళనలను, వారి మానసిక స్థితిని గమనిస్తూ తగిన విధంగా గైడ్ చేస్తూ ఉండాలి. పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నావంటూ పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండాలి. వారిలో మానసిక ధైర్యం పెరిగే అవకాశం వుంటుంది.

-అట్ల శ్రీనివాస్‌రెడ్డి