సబ్ ఫీచర్

ప్రణాళికే ప్రథమ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయి. పరీక్షలు వస్తున్నాయంటేనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆందోళన మొదలవుతుంది. మార్చి అంటే ప్రతి విద్యార్థికీ గుబులే.. ఎందుకంటే చదవడం ఒక ఎత్తయితే సక్రమంగా పరీక్ష రాయడం మరో ఎత్తు. చదివిన అంశాలను పరీక్షలో బాగా రాయాలంటే సాధన అవసరం. ఎందుకంటే ఏడాదిపాటు కష్టపడి చదివిన చదువుకు ఫలితాన్ని ఇచ్చేది, ఉన్నత చదువులకు సాగనంపేది పరీక్షలే.. కాలం చాలా విలువైనది. అందుకే బద్ధకాన్ని, వాయిదాతత్త్వాన్ని వీడి చదువు పైనే దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేది 24 గంటలే.. ఉన్న సమయాన్ని ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకుని ముందుకు సాగేవారే అంతిమ విజేతలుగా నిలుస్తారు. టీవీ, మొబైల్, ఆడియో ప్లేయర్లకు దూరంగా ఉండాలి. స్మార్ట్ఫోన్, ల్యాప్‌టాప్‌లకు అలవాటు పడిన విద్యార్థులు చదువుపై ఏకాగ్రత చూపలేదు. పరీక్షల్లో జ్ఞాపకశక్తికి ప్రాముఖ్యం ఎక్కువ. దాన్ని పెంచుకోవడానికి ధ్యానం ఒక మార్గం. విద్యార్థులకు భయమే మొదటి శత్రువు. భయపడితే వచ్చిన సమాధానాలు కూడా రాయలేం.. కాబట్టి ముందుగా భయాన్ని వీడాలి. ఆత్మవిశ్వాసమే లక్ష్యసాధనకు ప్రధాన ఆయుధం. పరీక్షల ప్రిపరేషన్‌లో పునశ్చరణ గొప్ప ఆయుధం లాంటిది. మార్చి నెల విద్యార్థుల ప్రతిభను చాటుకునే పరీక్షా మాసం కూడా ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ శ్రేణులు తప్పకుండా లభిస్తాయి. పరీక్షల గురించి ఆందోళన చెందడం వల్ల ఫలితం చెందుతుందే తప్ప ప్రయోజనం ఉండదుకానీ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. చదవాల్సిన అంశాలను వాయిదా వేయకూడదు. విజరుూభవ!
-

కె. రామ్మోహనరావు