సబ్ ఫీచర్

వాయిదా అభివృద్ధికి ఆటంకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవన విధానం వేగంగా మారిన ఈ రోజుల్లో ప్రతి పనిని ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతేనే మనసు స్థిమితంగా ఉంటుంది. ఎప్పటి పనిని అప్పుడే చేయాలి. వాయిదా వెయ్యకూడదు. వాయిదా వేసుకుంటూ పోతే బద్ధకం పెరగడమే కాదు అన్నిట్లోనూ వెనకబడతాము. అందుకే పూర్వకాలంలో అన్నారు ‘రేపటి పనిని ఈ రోజే చెయ్యి, ఈ రోజు పనిని ఇప్పుడే చేయి’ అని. పనులు ఎంత త్వరతిగతిన పూర్తిచేస్తేఅంత త్వరగా అభివృద్ధి చెందుతాము అన్నదాంట్లో సంశయం లేదు.
ఏ పనిచేయాలన్నా ఉసూరుమంటూ ప్రారంభిస్తే అది ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. దాంతో ఎవరైనాసరే మరింత నిరుత్సాహానికి గురై బద్ధకం మొదలవుతుంది. ‘తర్వాత చేద్దాంలే’ అనే భావనతో పనులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంటాయి. పనులు వాయిదా పడితే ఇంకేముంది? జీవితంలో ఉల్లాసం తగ్గి నిర్వేదం మొదవుతుంది.
కొందరు ఎంతో ముఖ్యమైన పనులను కూడా సకాలంలో పూర్తిచేయరు. తరచూ వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేయడంవల్ల ముందు ముందు ఎంతో నష్టపోతారు. బద్ధకానికి దీనికీ వున్న తేడా, బద్ధకస్తులకు పనిచేయడానికి ఇష్టం ఉండదు, వాయిదా వేసేవారు పనులు సకాలంలో పూర్తిచెయ్యరు.
ఒక పని ప్రారంభించడానికి కొన్ని ఆటంకాలుంటాయి. ఇంగ్లీషులో ‘రోడ్ బ్లాక్స్’ అంటారు. ఇవి శారీరికం కావచ్చు. మానసికం కావచ్చు. మనం రోజును ఎలా ప్రారంభిస్తామో దాని ప్రభావం మిగతా దినచర్యపైన తప్పనిసరిగా ఉంటుంది. అలారం పెట్టుకుని అది మోగగానే లేస్తామా? దానిని కాసేపు ఆపుతూ బద్ధకంగా మరో పది నిమిషాలు పొడిగిస్తాం. నిద్ర లేవటం అలా బద్ధకంగా మొదలుపెడితే అది రోజంతా ప్రతి పనిని కాసేపు ఆపుతూ పోతుంది. అందుకే సాధ్యమైనంత తొందరగా పడుకుని ఉదయం లేవగానే మనసులో హుషారు పువ్వు విచ్చుకున్నట్లు విచ్చుకోవాలి. రోజంతా ఎలా గడుపుతామో దానికి తగినట్లు టైమ్ సెట్ చేసుకుంటూ పోవాలి. సాయంత్రం ఆరు గంటలకు సినిమా హాల్లో ఉండాలనుకుంటే ఉదయం నుంచి ప్రతి పని పర్‌ఫెక్ట్‌గా నిమిషం తేడా లేకుండా పరిగెత్తుతూ పూర్తిచేయాలి. ఆ సమయంలో అలసట, నీరసం, విసుగు అసలు ఉండకూడదు. సమయాన్ని వాడుకోవడం మనకు తెలియాలి అంతే!
చేసేది ఏదో సూటిగా ఎన్ని కష్టాలు రానీ నష్టాలు రానీ అన్నట్లుగా ఏదైనా సరే చేయాలి అనుకున్నపుడు వెంటనే చేసేయాలి. అందులో ఆలస్యం అసలు పనికిరాదు. రేపు చేద్దాం, మాపు చేద్దాం అంటూ కాలయాపన కుదరదు. అలా చేస్తే అసలు విషయానికి అన్యాయమే జరుగుతుంది.
మీ ఆలోచన మంచిదైనపుడు మీకంతా మంచే జరుగుతుంది. ఇక మీనమేషాలు లెక్కపెట్టవలసిన అవసరమే ఉండదు. వారం, వర్జ్యం చూడనవసరం లేదు. వీరు రావాలి, వారురావాలి అంటూ ఎవరికోసం వేచి చూడనవసరం లేదు. అయ్యవారు వచ్చేదాకా అమామాస్య ఆగదు కదా. మీరు చేయాలనుకున్న పని వెంటనే చేయలేకపోయినపుడు ఆ తర్వాత చేసినా వృధానే అవ్వవచ్చు. దానివలన మిగిలేది వ్యధే.
దీనికి పలు రకాల కారణాలను చెప్పుకోవచ్చు. అవి ఏమిటీ అంటే ఆకర్షణలు, పని తప్పించుకోవడం, సరిగా చెయ్యలేననే భయం, శక్తికి మించిన లక్ష్యం పెట్టుకోవడం, క్రమశిక్షణ లేకపోవడం, ఊహల్లో జీవించడం, బాధ్యత తెలియకపోవడం, బద్దకం, వ్యక్తిగత సమస్యలు, సమయం విలువ తెలియకపోవడం, మానసిక ఒత్తిడి, బలహీనతలు, చెడు అలవాట్లు మరి దీనివలన ఎన్నో నష్టాలు వున్నాయి. పనిని వాయిదా వేస్తూ పోతే మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేము.. బద్ధకం ఎక్కువై ఏ పని చెయ్యబుద్ధి కాదు.. మరి దీనివలన ఎన్నో కోల్పోతాము. మంచి ఉద్యోగం రాదు, అనుకున్న లక్ష్యం సాధించలేరు, భవిష్యత్తులో మానసికంగా కృంగిపోతారు. ఇంటా బయటా గౌరవం పోగొట్టుకుంటారు.
జీవితం అశాంతిగా ఉంటుంది. డబ్బు నష్టపోతారు, విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటారు, మంచి ఉద్యోగం రాదు.
చేయాలనుకున్నది
సకాలంలో మీరు చేయలేకపోయాక మీరు ఎన్ని అనుకున్నా ప్రయోజనం శూన్యం. రేపు అన్నమాటను మీ డిక్షనరీలోంచి తీసేయండి. ఏమనుకున్నా, ఎన్ని అనుకున్నా ఇవ్వాళే చేయండి. ఈ రోజు అనుకున్నది ఇపుడు తక్షణమే చేయండి. ‘వాయిదా అన్నదే వద్దు.. ఇపుడన్నదే ముద్దు’ అనే వాక్యాన్ని మీ మనసులో బాగా ముద్రించుకోండి. వాయిదావల్ల జరిగే అనర్థాలను గుర్తుకు తెచ్చుకుని ఈ క్షణం నుండి అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడూ కార్యోన్ముఖులుగానే ఉండండి.
మిమ్మల్ని మీరు ఎప్పుడూ బిజీగా ఉంచుకోండి. ఆ బిజీ షెడ్యూల్‌లో మీ ప్రాధాన్యతలను గుర్తించండి. ఏదో ఒక పని ఇవాళ చేసాం కదా, మరొకటి తర్వాత చేద్దాం అనుకోకండి. తర్వాత, రేపు అన్నవి బద్ధకానికి పర్యాయ పదాలు అని తెలుసుకోండి. చేయాలనుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా చేసుకుంటూ వెళ్లండి. ఆ తరువాత అన్ని విషయాలూ మీకు సానుకూలంగానే ఉంటాయి.
మరి వాయిదా పద్ధతిని పెంచుకుంటూ పోతే అన్నిట్లో నష్టపోతాం. దీని పరిష్కార మార్గం ఏమిటి? జీవితం విలువ అర్థం చేసుకోండి. పనులు వాయిదా వల్ల కలిగే నష్టాలను ప్రతిరోజూ గుర్తుచేసుకోండి. తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను గుర్తించండి. చేయవలసిన పనులను ఒకచోట రాసుకొని అన్నీ పూర్తిచేసేవరకు పేపరు మీతోనే ఉంచుకోండి. మొదట ముఖ్యమైన పనులను వెంటనే చేయడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా అన్ని పనులు సకాలంలో పూర్తిచెయ్యండి.

- పుష్యమీ సాగర్