సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనే ఆదర్శం, నేనే స్ఫూర్తి...
‘పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్’.- ఈ పనులన్నీ మీలాగే నేను చేస్తూ వుంటాను. అదంతా నాకోసం కాదు. మీకోసమే! మీ విశ్వాసాన్ని చూరగొని, మీ ప్రేమను పొంది, మిమ్మల్ని దివ్యత్వం దిశగా నడిపించాలని నా ఆకాంక్ష. నన్ను చూస్తూ. నా మాటలు వింటూ, మీలో వొకడిగా నన్ను భావిస్తూ, మీరంతా సత్యానే్వషకులు కండి!
అయితే మీతోబాటు తింటూ, మాట్లాడుతూ, మీమధ్య తిరుగుతూ వుంటే నేనుకూడా సామాన్య మానవుడనని కొందరు అపార్థంచేసికొంటున్నారు. ఇది చాల తప్పు. నేను మీలాగా తింటున్నాను. మాట్లాడుతున్నాను. కలసిమెలసి వుంటున్నాను. నిజమే. కాని, అదంతా నా మాయ. ఏ క్షణాన్నైనా నా దైవత్వాన్ని నేను చూపగలను. ఆ క్షణంకోసం నీవు తయారుగా వుండాలి. దైవత్వం మానవ రూపంలో వచ్చినప్పుడు, దానిని దర్శించాలంటే నీ కన్నులకు కప్పిన మాయను తొలగించుకోవాలి.
అందుకు భక్తీ, ప్రపత్తీ అవసరం. భక్తుడు ప్రసన్నుడైతే దేవుడు ప్రసన్నుడౌతాడు.
నేనన్ని చోట్లా అన్ని కాలాల్లోనూ వున్నాను. అన్నిటా నా యిచ్ఛే ప్రవర్తిల్లుతూ వుంటుంది. మీ అంతరాంతరాలలో ఏముందో నాడూ, నేడూ, ఏనాడూ నాకెరుకే. మీ అత్యంత రహస్యం అనుకున్నవి నాకు బట్టబయలే! నేను సర్వాంతర్యామిని, సర్వ శక్తిమంతుణ్ణి. సర్వజ్ఞుడిని. అయినా నా శక్తులు చాపల్యంకోసం, ప్రదర్శనకోసం కాదు. మీరేం చేయాలో, ఏంచేయకూడదో నానుండి తెలుసుకోండి! నేను ఆదర్శం! నేనే స్ఫూర్తి! నా జీవితమే నా సందేశం!
సాకార దైవం
స్వామి సైన్యములో మంచి ధీరులైన, సుశిక్షితులైన యోధులుగా మారి సేవా సమరంలో జయభేరి మ్రోగించండి. దైవం సగుణ సాకారంలో వచ్చినప్పుడు దానిని తెలుసుకొని పూజించే మీరే ధన్యులు. రామకృష్ణాది అవతార సమయంలో బ్రతికియుండినను అవతార రహస్యాన్ని తెలుసుకోలేక, వారిని పూజించుకొనకుండానే ఎందరో తమ జీవితాలను గడిపివేశారు. వాళ్ళకన్నా మీరెంతో అదృష్టవంతులు. భగవంతుడనే భావంతో దర్శన స్పర్శన సంభాషణావకాశములను పోగొట్టుకొనకుండా స్వామిని పూజిస్తారే, అది మీ భాగ్య విశేషమే.

ఉత్తిష్ఠత, జాగ్రత
ప్రతి వ్యక్తీ అంకితభావంతో తనవంతు పని తాను నెరవేరుస్తూ, పోతే అంతా జ్యోతిర్మయం అవుతుంది. ‘నేను వెలుగును చూడను’ అని నీ హృదయ నేత్రాలను మూసుక్కూర్చుంటుంటే అంధకారం ఎలా తొలగిపోతుంది? ‘‘నేను మాత్రం హాయిగా కూర్చుంటాను. ఓ అవతారమూర్తీ, నీవే ఎలాగోలా నాదగ్గరకు శాంతీ, సంతోషం, అన్నీ తీసుకురా’’అంటే కుదురుతుందా? నిన్ను తట్టి మేలుకొలపటానికి, దారి చూపటానికి, వెలుగివ్వటానికి సాయి వచ్చాడు. భగవాన్ ప్రేమ సందేశం విను! తెలుసుకో! ఆశా విశ్వాసాలతో ఆయన బోధించింది ఆచరించు! తరించు!
అంతటా సాయి
నీ జీవితాన్ని పూలబాట చేసికుంటావో, ముళ్లబాట చేసికొంటావో అది నీ చేతిలోనే వుంది. అందరిలోను ఉన్న సాయిని గుర్తించు. అంతా మృదువుగా, సాఫీగా, హాయిగా, మధురంగా సాగిపోతుంది. సాయి నీ హృదయంలో ప్రేమధారగా వుంటాడు. నీవు కలసే వారందరిలోనూ ప్రేమధార నింపుతాడు. సాయిని నీవెట్లు అభిమానిస్తావో. అందరినీ సాయి రూపంగా భావించి అలాగే అభిమానించు.
బాబా ఆహారం
నాకు ఆహారం ఎంత అవసరమో అంతే తీసుకుంటాను. రాత్రిపూట అన్నం తినను. నిప్పుపైన కాల్చిన చిన్న చపాతిని మాత్రం తింటాను. తీపి అనేది నేను పుట్టినప్పటినుండి ముట్టలేదు. శరీరానికి ప్రొటీన్స్ కావాలి. విటమిన్స్ కావాలి. కాని స్వామి ఏదీ భుజించడం లేదే! ఈ విటమిన్లు ఎలా వస్తాయి? అని డాక్టర్లు అనుకుంటారు. నాకు ఆనందమే పెద్ద విటమిన్. పెద్ద ప్రొటిన్. ఆనందం లేని వానికే ఈ విటమిన్స్. ఈ కాల్షియం. ఈ ప్రొటీన్స్ ఉండాలి. కాని నేనెప్పుడూ ఆనందంగానే ఉంటాను.
అన్నీ మీ కోసమే
నాకోసం నేను ఒకటి కూడా చేయటం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా కూడానూ సత్యము ఇదే. ఇన్ని కోట్లు పెట్టి హాస్పటల్ కట్టించాము. ఎవరికోసం? నా కోసమా? ఇన్ని కోట్లు పెట్టి యూనివర్సిటీ నిర్మించాము. ఎవరికోసం? నాకోసమా! ఒక పెద్ద హాల్ మీకోసమై నిర్మించాము. చాలదేమోనని మరో పెద్దహాల్ మీకోసమై నిర్మించాము. అన్నీ మీకోసమే కదా!
సాయి కోరేది
నాలో ఏ కోశానా స్వార్థం లేదు. నేనేం చేసినా అది అందరికోసమే. అందరి బాగుకోసమే. అందరి సుఖశాంతులకోసమే. నేను చేసిన పనుల్లో ఏ వొక్కటీ నాకోసం, నా సుఖంకోసం చేసింది లేదు. కోరిక అనేది నా తత్వానికి విరుద్ధం. సాయికి కోరికంటూ వుంటే అది ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అన్నది ఒక్కటే!

ఇంకా ఉంది