సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్ఫూర్తిగా కర్తవ్యపాలన
అర్జునుడు కృష్ణునికి ప్రసన్నుడు. శరణాగతి పొందినవాడే! ఆయన ‘యుద్ధం చేయి!’అంటే అర్జునుడు తప్పక ఆయన ఆదేశాన్ని పాటించేవాడు. మరి గీతను ఎందుకు బోధించాల్సి వచ్చింది? తన ఆజ్ఞవల్ల కాక, అర్జునుడు మనస్ఫూర్తిగా తన ధర్మాన్ని నిర్వర్తించాలన్నది కృష్ణుని అభిప్రాయం. అందుకే అర్జునుని సంశయాలన్నిటికీ ఆయన సమాధానాలిచ్చాడు. విషాదాన్ని పోగొట్టి, కర్తవ్యాన్ని బోధించాడు.
మీరేవిధంగా నడచుకోవాలని సాయి కోరుకుంటారో దానిని గురించి సాయి కూడ వివరంగా చెబుతుంటారు. మీరు బాగా అవగాహన చేసుకొని, మనస్ఫూర్తిగా మీ కర్తవ్యాన్ని ఆచరించాలనే సాయి కోరిక!
కర్మ ధర్మానుసారిణి
కైకేయి తన భర్తను రెండు వరాలు కోరింది. రాముని పదు నాలుగేళ్లు వనవాసానికి పంపటం; భరతుని పట్ట్భాషేకం. అప్పుడు లక్ష్మణుడు అంగీకరించలేదు. ఇటువంటి అన్యాయానికి తలవొగ్గరాదన్నాడు. బాణపు దెబ్బతో కైక సంగతి తేలుస్తానన్నాడు. రాముడు తమ్ముని వారించాడు. బాణం గొప్పకాదు. ప్రేమబాణం ముందది నిలువలేదు. ‘్ధర్మం కర్మను నడిపించాలి! అని ప్రబోధించాడు, రాముడు. ధర్మానికి తలొగ్గటమే భగవంతుని పట్ల ప్రపత్తి. అప్పుడే జయమూ. కీర్తీ లభిస్తాయి.
జగన్నాటక సూత్రధారి
స్టేజి ఎక్కి దీపాలముందు తైతక్కలాడే బొమ్మలు మీరు. డైరక్టరు వేరే వున్నాడు. ఆయనకు ఈ నాటకాన్ని ఎలా నడిపించాలో తెలుసు. ఎవరి పాత్ర వాళ్లకు యిస్తాడు. ఏం చేయాలో చెబుతాడు. నీవెప్పుడు రంగప్రవేశం చేయాలో, ఎప్పుడు నిష్క్రమించాలో చెబుతాడు. నీవు కేవలం కీలుబొమ్మవి. నిన్ను నడిపే కీలుదారాలు ఆయన చేతిలోనే వున్నాయి. ఆయనను దర్శించాలంటే నీవు ఆయన యిష్టసఖుడిగా మెలగాలి. బంధువుగా వుండాలి. కేవలం ప్రేక్షకుడుగా వుంటే ఆయనను కలుసుకోటం కుదరదు. ప్రేమ, అంకితభావంతో సేవ- వీటిద్వారానే ఆయన స్నేహాన్నీ, బంధుత్వాన్నీ సంపాదించుకోగలవు.
స్నేహం తీరు
స్నేహం ఎలా వుండాలి? స్నేహితులు కనురెప్పలా కనిపెట్టి వుండాలి. కాలిజోళ్లలా కాపాడుతూ వుండాలి. నీకు తోడునీడగా నిలచి వుండాలి. నీతోపాటు కష్టసుఖాలను పంచుకోవాలి. స్నేహం, అహంకారం ఒక ఒరలో యిమడలేవు. మిత్రుల మధ్య అరమరికలు ఉంటాయా? స్నేహితులు పాలు, నీళ్లలా కలసిపోవాలి. ఈ సంగతే యింకాస్త వివరంగా చూడండి! నీళ్లూ, పాలూ కలిపి పొయ్యిమీద పెడతారు. కాగినకొద్దీ నీరు ఆవిరై వెళ్లిపోతుంది. మిత్రుని వియోగాన్ని భరించలేని పాలు సలసలా కాగి, పొంగి వస్తాయి. అప్పుడు కాసిని నీళ్లు పాలపై చిలుకరిస్తారు. పాలకు పాత మిత్రుడు (నీరు) తిరిగి వచ్చాడని ఆనందం కలుగుతుంది. మామూలు స్థితికి వచ్చేస్తాయి. పాలూ, నీరూ కూడ వియోగాన్ని సహించలేవు. నిజమైన మైత్రి అంతే!
నీకు నిజమైన మిత్రుడెవరు? భగవానే!
దిగజారుడు యోగం
ఒకడొక గ్రామమునకు వచ్చి, ‘నేను యోగమున పరిపూర్ణుడను’ అని చెప్పుకోగా, ప్రజలాతని యోగశక్తిని చూడగోరిరి. అతడొక ఏటి ఇసుకలో లోతుగా గుంత తీయించి అందు పరుండగా జనులా గుంతను పూడ్చివేసిరి. తరువాత కొన్ని దినములకాతడు లేచివచ్చి తనను చూచుటకు వచ్చిన వారినందరినీ ధన సహాయంకొరకు దేబిరించెను. అంతకంటే పరిహాస భాజనమైన అధఃపతన ముండునా? అతడు సాధించిన యోగవిద్యకు ప్రయోజనమదేనా? అట్టి నీచ దశకు దిగజారకుండా నీవు జాగరూకుడవై వుండాలి.
మనసే దీపం
గదిలో దీపం పెట్టి నలువైపుల కిటికీలు తెరిస్తే అటూఇటూ గాలికొట్టి అది రెపరెపలాడుతుంది. దీపం నిలచి వెలగాలంటే కిటికీలు మూసివేయాలి. భగవత్సాక్షాత్కారమనే లక్ష్యంతో ఏకాగ్రంగా వెలగవలసిన దీపం మనస్సు ఇంద్రియాలు కిటికీలు, బాహ్యప్రపంచం మీదికి ప్రసరించే ఇంద్రియాలకు, దైవప్రాప్తి అనే లక్ష్యంవల్ల కలిగే అంతరంగిక మాధుర్యం ఏమితెలుస్తుంది?
భారమైన కర్మ
కర్మ భారంగా కనిపించరాదు. నీ సాధనకు దోహదకారిగా వుండే ఏ కర్మా నీకు భారంగా వుండజాలదు. అంతరాత్మకు విరుద్ధంగా చేసే కర్మే భారమవుతుంది. ఎప్పుడో ఒకనాడు నీవు ‘నేనింతవరకూ సాధించిందేమిటి? అంతా వృథాప్రయాస’అనుకుంటావు. అలా కాకూడదనుకుంటే నీ మనస్సు భగవదర్పితం చేయి. ఎలా కావాలంటే అలా నడిపిస్తాడాయన.
శరభంగుడు
రాముడు వనవాసం చేసినప్పుడు శరభంగుడనే మహర్షి ఆయనను దర్శించాడు. ‘్భగవాన్’ నిన్ను కనులారా దర్శించాలనీ, నోరారా నీతో సంభాషించాలనీ, నీకు నమస్కరించాలనీ, నేనిన్నాళ్ళూ ఎదురు చూస్తున్నాను. నీవు ఈనాడు నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఇంక నాకీ శరీరంతో ఏం పని? అని రామునితో చెప్పి శరభంగుడు చితిపేర్చుకొని ఆనందంగా ఆత్మాహుతి చేసికొన్నాడు. ఆహా! ఎంతటి ప్రపత్తి!
పవిత్ర గ్రంథాలు
రాముడు ధర్మావతారం. ఆయన కథ రామాయణం వేద సమానం. మహాభారతానికి పంచమవేదం అని పేరు. భగవద్గీత అద్భుతమైన దేవుని ప్రభావాన్నీ, ప్రశస్తిని కీర్తిస్తూ అంతర్యామిగా ఆయనను వర్ణిస్తున్నది. మానవుని ఉన్నత పథానికి తీసుకొనిపోయి బంధాలునుండి విముక్తి చేయటంలో అదికూడ వేదాలవలె సమర్థవంతమే. ఈ పవిత్ర గ్రంథాలన్నీ మనకు మార్గదర్శకాలు.
ఇంకా ఉంది