సబ్ ఫీచర్

ప్రజాస్వామ్యం అపహాస్యమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులుగా సామాన్య ఓటర్ల ప్రజాధికార పాలనా వ్యవస్థ లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉన్నత రాజ్యాంగ నిర్దేశిత పవిత్ర సూత్రాల ప్రాతిపదికపై కొనసాగుతోంది. సుదీర్ఘంగా దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన భారత జాతీయ కాంగ్రెస్‌కు, ప్రత్యామ్నాయ రాజకీయ పాలనా శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు యుపీఏ, ఎన్‌డీఏ సంకీర్ణ కూటమిల సారథ్యం కేంద్రంలో, రాష్ట్రంలోని చట్ట సభలలో పాలనాధికార కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుండటం ప్రస్తుత రాజకీయ పరిణామల పెను మార్పుగా స్పష్టమవుతోంది. అసెంబ్లీలయినా, పార్లమెంటు అయినా ఎన్నికలలో అధికార పార్టీగా అందలం అధిష్ఠించటానికి, మెజారిటీ సంఖ్యా బలం ప్రధానం కావటంతో, ఏకైక పెద్ద అధికార పక్షంగా అవతరించటానికి మెజారిటీ కోసం వలలు వేయటం ఎన్నికల ఫలితాల పర్యవసానాలను బట్టి రాజకీయ క్రీడగా పరిణమిస్తోంది. అధికారం కైవసం చేసుకొనే తాపత్రయంలో, ఏ అడ్డదారైనా దొడ్డదారిగా ప్రజల్ని నమ్మించే అనైతికత, రాజమార్గమైంది. అసెంబ్లీ ఎన్నికలలో బొటాబొటి మెజారిటీ వచ్చినపుడు, అధికారాన్ని ఇతరులకు దక్కకుండా చేయటానికి, రాష్టప్రతి ప్రతినిధులుగా గవర్నర్‌లు మితిమీరి వ్యవహరిస్తున్న ఉదంతాలు స్పష్టమవుతున్నాయి. గోడ దూకి వచ్చే ఫిరాయింపుల జాడ్యానికి, అన్ని రాజకీయ పార్టీలు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి. ప్రత్యర్థి పక్షాన్ని చావుదెబ్బ కొట్టడానికి పలు రాష్ట్రాలలో సభాపతులు అతి విధేయతతో వ్యవహరిస్తూ, నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. ఫిరాయింపుల నిషేధ చట్టం లొసుగుల ఆధారంగా, ఆఖరి నిమిషంలో గోడ దూకే గెలుపు గుర్రాలకు స్వాగత సంరంభ ప్రలోభాలు స్వేచ్ఛగా కొనసాగుతున్నాయి. సామూహిక గోడ దూకుళ్ల కారణంగా ప్రతిపక్ష పార్టీలు నిర్వీ ర్యం అవుతున్నాయి. మళ్లీ తామే అధికార పీఠంపై కూర్చోటానికి ప్రతిపక్షాలను పూర్తిగా అసెంబ్లీలో తల ఎత్తకుండా చేసే రాజకీయ క్రీడ కొనసాగుతోంది.
ఓటరును అవమానించే ఫిరాయింపులు
నిష్పక్షపాతం, పారదర్శకత, స్వయం పాలనాధికారంతో నిర్ణయాలు తీసుకోవలసిన స్పీకర్‌లు కొందరు తమ పదవుల ఔన్నత్యాన్ని కాపాడలేక పోతున్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి, గవర్నర్లు కొందరు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్షంగా ఓటర్లతో సంబంధం లేకుండా, అధికార పార్టీ దయా దాక్షిణ్యాలపై నెగ్గుకొస్తున్న మేధావులు చెలాయిస్తున్న విధి నిర్వహణలపై దేశ ప్రజకు గౌరవం క్రమేపీ సన్నగిల్లుతోంది. రాజకీయాలకు అతీంగా, ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగమైన రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య నైతికతా విలువలను పరిరక్షించటంలో, ఢిల్లీ పెద్దలు గతి తప్పి దారి తప్పుతున్నారు. కుటిల మేధస్సు చాణక్య నీతి అవుతోంది.
‘చట్టసభ గౌరవ ప్రతిపత్తి, స్వేచ్ఛకు స్పీకర్ ప్రతినిధి’
చట్టసభలు, జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాతినిధ్యం కాబట్టి స్పీకర్ అన్ని వేళలా అసాధారణ సామర్థ్యం, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిత్వం కలిగి ఉండాలి’ అన్నారు నవ భారత నిర్మాత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1948 మార్చి నెలలో. తాము ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీతో పెనవేసుకొన్న అనుబంధం కారణంగా కీలక రాజ్యాంగ పదవులలో వున్న కొందరు గవర్నర్లు, స్పీకర్‌లు గోడదూకుడు అనైతిక పోకడలకు కళ్లెం వేయకుండా, ఫిరాయింపుదారులపై అనర్హత వేటు అంశంపై సహేతుక సమయంలో ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. తాజా నేపథ్యంలో మణిపూర్ సభాపతిని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం అనర్హత పిటీషన్ల పరిష్కారం కోసం స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. 1993లో గోవా శాసన సభాపతి ఫిరాయింపుదారులతో జతకట్టి తానే ముఖ్యమంత్రి కిరీటం అలంకరించుకోవటం వింత పరిణామం. ఫిరాయింపులపై నిర్ణయాధికారం సభాపతి అధీనం కావటంతో, అధికారం చేజిక్కించుకోవటమే పరమావధిగా భావించే ఢిల్లీ పెద్దలు ఇష్టారాజ్యానికి పావులు కదుపుతున్నారు. తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబంగ, జమ్మూ కాశ్మీర్, బీహార్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో గవర్నర్, స్పీకర్‌లు కీలకంగా వివాదాస్పద సంక్షోభాలు చెలరేగాయి.
సుప్రీం ఆదేశం శిరోధార్యం
గవర్నర్లు, కేంద్రంలోని అధికార పార్టీకి పావులుగా ఏకపక్ష పక్షపాత నిర్ణయాలతో రాజకీయ సంక్షోభం సృష్టించటం భారత ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థకు కొత్త కాదు. 1984లో గవర్నర్ రామ్‌లాల్, 1988లో పి.వెంకటసుబ్బయ్య, 1994లో భాను ప్రతాప్‌సింగ్, 1996లో కృష్ణపాల్ సింగ్, 1998లో రమేష్ భండారీ, 2005లో సయ్యద్ సిబ్తెరజీ, 2016లో కె.కె.పౌల్, 2016లో జె.పి.రాజ్‌కోవా, 2017లో మృదులా సిన్హా, నజ్తాహెప్తుల్లా, కేసరినాథ్ త్రిపాఠీ, 2019లో వజూభాయ్ వాలా, ఆయా రాష్ట్రాలలో కేంద్రాధికారం చెప్పుచేతలలో వ్యవహరించి అవకాశవాదాన్ని ప్రోత్సహించిన దృషాంతాలున్నాయి. ఇటువంటి అవ్యవస్థలో వ్యక్తిగతంగా స్పీకర్‌లను తప్పుపట్టడం, నిందించడం వారి పట్ల అగౌరవం వ్యక్తీకరించటం భావ్యం కాకపోగా, సంక్షోభం కూడా పరిష్కారం కాదు. చట్టసభలలో అత్యున్నత అథారిటీగా మెజారిటీ సభ్యుల అభీష్టంపై ఆధారపడి ఉండటం కారణంగా స్పీకర్ నియామకం, పదవీ కాలం దృష్ట్యా పక్షపాత అనుమాన ఆరోపణలకు ఆస్కారం వుండనే వుంది. స్పీకర్ చట్టసభల సమగ్ర ప్రతినిధిగా తటస్థంగా వ్యవహరించగల విధానాల చట్టబద్ధతకు పార్లమెంటు, సుప్రీం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాన్ని, సూచనలను చిత్తశుద్ధితో అమలుపరిచి స్పీకర్ వ్యవస్థను పటిష్ఠపరచటం ప్రస్తుత కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ టిక్కెట్‌పై విజయం సాధించిన 20 మంది శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుపై, ఎటువంటి చర్య తీసుకోనందున 2017 అక్టోబర్ 25న వైఎస్‌ఆర్‌సీ లెజిస్లేచర్ పార్టీ స్పీకర్‌పై నిరసన ప్రకటిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి సుమారు రెండేళ్లు తరువాత మళ్లీ 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది భారత ప్రజాస్వామ్య ఘన విజయం గోడ దూకుళ్లకు చెంప పెట్టుగా అనుసరించాలి.

-జయసూర్య