సబ్ ఫీచర్

కూల్ కూల్ కర్టెన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరికొద్ది రోజుల్లో వేసవికాలం వచ్చినట్లే. మండే ఎండలు మనల్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఇంట్లో ఏసీ, కూలర్లు ఉంటే కొంత ఉపశమనం. కాని మధ్యతరగతి, సామాన్యులు ఈ ఎండవేడిని తట్టుకోలేక కిటీకలన్నీ మూసేసుకుని చల్లదనం కోసం కొబ్బరి పీచు వట్టివేళ్లు వేలాడదీసుకుంటారు. దీంతోపాటు ఇంట్లో మనం కిటికీలకు, డోర్లకు వాడే కర్టెన్లు చల్లగా, హాయినిచ్చేవిగా ఉంటే ఎంతో మంచిది. అలాంటి కర్టెన్లను ఎంపికచేసుకోవాలని ఉబలాడపడుతుంటాం. మండే ఎండల్లో కూడా ఇల్లు అద్భుతంగా, సేదతీర్చే విధంగా ఉండాలంటే అందమైన, ఆకర్షణీయమైన కర్టెన్లను ఎంపికచేసుకోండి. వేడిగాలులు వీస్తాయి కాబట్టి ఇంట్లోకి చల్లని గాలి వచ్చేలా తేలికైన కర్టెన్లను ఎంపికచేసుకుంటే మంచిది. అందుకు తగ్గట్టుగా సరైన రంగుల కర్టెన్లు ఎంపిక చేసుకుంటే ఇల్లు ప్రకాశవంతంగా ఉంటుంది. అదే లివింగ్ రూమ్ అయితే మాత్రం పూర్తి డిజైన్లు ఉన్న తేలికపాటి రంగులు ఎంపికచేసుకుంటే బాగుంటుంది. ఏ గదికి ఎలాంటి రంగు కర్టెన్ అయితే బాగుంటుందో తెలుసుకుందాం.
పూల కర్టెన్లు: ఇల్లు సహజమైన ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉండాలంటే పూల డిజైన్లు ఉన్న కర్టెన్లు ఎంపిక చేసుకుని తేలికగా, అందంగా ఉండేటట్లు చూసుకుంటే మంచిది.
కుచ్చుల కర్టెన్లు: ఫ్యాషన్ రంగంలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న కుచ్చుల కర్టెన్లు లివింగ్ రూమ్‌కు శోభను చేకూరుస్తాయి. ఒంటరి మహిళలు ఉండే ఇంటికి ఇవి బాగుంటాయ.
ప్రింట్ కర్టెన్లు: తెలివైన ఎంపిక కానప్పటికీ వేసవిలో ముదురు రంగు ప్రింట్లు ఉన్న కర్టెన్లు ఉపయోగించుకుంటే ఎంతో మంచిది. ముదురు రంగులు గదిని చీకటిగా ఉండేటట్లు చేస్తాయి. కాని ముదురు రంగుల్లో ప్రకాశవంతమైన డిజైన్లు ఉండేటట్లు ఎంపికచేసుకుంటే గది రూపురేఖలు మారిపోతాయి.
ఎర్రటి కర్టెన్లు: చాలామంది ఎర్ర కర్టెన్లు ఇష్టపడరు. కాని వేసవికాలంలో మీ ఇంటికి కొత్త అందాలు చేకూరాలంటే ఇవి లివింగ్ రూమ్ కిటికీలకు ఎంపికచేసుకుంటే మరింత శోభాయమానంగా ఉంటాయి. ఇంద్రధనస్సు రంగులు గల కర్టెన్లు ఇష్టపడేవారైతే వాటిని కూడా లివింగ్ రూమ్‌కు ఎంపికేచేసుకున్నా గది మొత్తం చల్లగా ఉండేటట్లు చేస్తుంది. లేత గోధుమ రంగు కర్టెన్లు సాదాసీదాగా కనిపించినా గదిని ప్రశాంతంగా, అందంగా తీర్చిదిద్దుతుంది. వేసవిలో తాజా చల్లదనం కావాలనుకుంటే నిమ్మరంగు కర్టెన్లు మీకు సరైనవి. అన్నింటికంటే స్వచ్ఛమైన తెల్లని కర్టెన్లు కిటీకీలకు వేసుకుంటే కొద్దిరోజులకే మాసిపోయే అవకాశం ఉన్నప్పటికీ గదిని విద్యుత్ దీపాల వెలుగులో కాంతివంతం చేస్తాయి. పసుపు రంగు కర్టెన్లపై చెక్స్ ప్రింట్లు ఉన్న కర్టెన్లు కూడా ప్రత్యేక శోభను చేకూరుస్తాయి. నీలిరంగు షేడ్లు ఉన్న కర్టెన్లు పచ్చటి ప్రకృతిలో మమేకమైన భ్రాంతిని కలుగజేస్తాయి. పోల్కా చుక్కలున్న కర్టెన్లు గోడలకు తెల్ల పెయింట్ వేసినట్లయితే అద్భుతంగా ఉంటాయి. చారలు డిజైన్ వున్న కర్టెన్లు వేసవికి సరైన ఎంపిక అని చెప్పవచ్చు. గది సొగసును పెంచుతాయి. తెల్లని లేసులున్న కర్టెన్లు వేసవిలో ఇంటిని చల్లగా మారుస్తాయి. *