సబ్ ఫీచర్

బీజేపీ జనసేన కూటమి.. బలమైన ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రాజకీయంగా ఒక ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. 2019 ఎన్నికల ముందు కలిసి పోటీ చేయడానికి అవకాశం ఉన్న కలవని బీజేపీ జనసేన లు కలసి కూటమిగా ఏర్పడటానికి నిర్ణయించుకున్నాయి. త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కలసి ప్రస్థానాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాయి. 2019లోనే కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా ఇరు పార్టీలకు గణనీయంగా లాభం జరిగి ఉండేది. ఇప్పటికైనా నా ఈ రెండు రాజకీయ పార్టీలు కలవటానికి నిర్ణయించుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభిలషణీయమైన పరిణామం.
ఆ రోజు ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సునీల్ దేవధర్ కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ వర్గ రాజకీయాలకు అతీతంగా అవినీతి రహిత రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి ఈ కూటమి పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రేరేపిత మత మార్పిడి విధానాన్ని కూడా పేర్కొంటూ అటువంటి కార్యక్రమాలు పూర్తిగా తాము వ్యతిరేకిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్‌ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలతో ఎటువంటి అవగాహన పొత్తు ఉండదని స్పష్టమైన ప్రకటన చేశారు.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ అధికారం కేవలం కొన్ని వర్గాల చేతిలోనే కేంద్రీ కృతమైంది. కేంద్ర ప్రభుత్వంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఉంటే విధంగాను తనను బలపరిచే బలమైన భూస్వామిక నాయకత్వాన్ని రాష్ట్ర రాజకీయాలలో జవహర్‌లాల్ నెహ్రూ గారు ప్రోత్సహిం చారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు రాజకీయ అధికారం అంతా ఒక వర్గం చేతిలో గుత్త్ధాపత్యంగా ఉండిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో దీనిలో సమూలమైన మార్పు వచ్చినా రాజకీయ అధికారం అన్ని వర్గాలు భాగస్వాములు కాకుండా ఒక వర్గం చేతిలో కాక రెండు వర్గాల చేతుల్లోకి పోయింది. రాష్ట్ర రాజకీయాల్లో అధికారంలో నిర్మాణాత్మకంగా భాగస్వామ్యం కాలేకపోయిన చాలా వర్గాలలో ఈ అసంతృప్తి బలం ఉంది. ముఖ్యంగా జనాభా పరంగా ప్రాధాన్యం కలిగిన కాపు దళిత వర్గాలలో, రాజకీయంగా విస్మరించబడిన ఈ వర్గాల ఆకాంక్షలను ప్రయోజనాలను ప్రతిబింబించే విధంగా ఏర్పడే ప్రత్యామ్నాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అవకాశం ఎప్పటినుంచో ఉంది. ఈనాడు ఏర్పడిన ఈ కూటమి ఈ వర్గాల ప్రయోజనాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా తన విధానాలను రూపొందించుకుంటే రాజకీయంగా దీర్ఘకాలంలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది.
రెండు ప్రధాన పార్టీలతో స్వల్పకాలిక ప్రయోజనాలకు ఆశించి ఎటువంటి పొత్తులు లేకుండా ఎదగగలిగిననాడే ఈ కూటమికి దీర్ఘకాలంలో మనగలిగిన శక్తి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో వివిధ సందర్భాల్లో తమ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పొత్తులు కూడా పెట్టుకొని పూర్తిగా కనుమరుగైన రాజకీయ పార్టీలు కమ్యూనిస్టులు. 50వ దశకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఒక బలమైన శక్తి. రాజ్యాధికారం చేపట్టడానికి చాలా దగ్గరగా ఉన్నారు. కానీ ఆపైన జరిగిన పరిణామాలలో క్రమక్రమంగా బలమైన రాజకీయ శక్తులతో పొత్తులు పెట్టుకుంటూ తమ ఉనికిని పూర్తిగా కోల్పోయారు. స్వల్పకాలిక ప్రయోజనాలకు ఆశించి ఈ కూటమి కూడా అటువంటి తప్పిదం చేయకుండా స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. సునీల్ దేవధర్ గారు రెండు ప్రధాన రాజకీయ పార్టీలతో ఎటువంటి పొత్తు ఉండదని చెప్పటం మంచి పరిణామం.
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద సవాలు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సహాయానికి పొందుపరచబడిన రాయితీల అమలులో వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవడం. 2019 ఎన్నికలకు ముందు ఈ అంశాలలో భారతీయ జనతా పార్టీని మోడీ ప్రభుత్వాన్ని ఒక దోషిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నిలబెట్టడంలో చంద్రబాబునాయుడు గారు వారి అనుకూల మీడియా ఉన్నవి, లేనివి సృష్టించి సఫలీకృతులయ్యారు. నిజాలను ప్రజలకు తెలియజేసి కేంద్రం ఇచ్చిన, ఇవ్వబోతున్న సహాయాన్ని ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా భారతీయ జనతా పార్టీకి ఉంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి. ఈ అంశాలు ప్రజలు మరిచిపోయారు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఈ అంశాలను ఎంత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోగలరు అనే దానిమీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు బీజేపీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.
ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం ఎదగటానికి అవసరమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై బలహీనపడింది. ఈ పార్టీ తమ ఆర్థిక వనరులన్నింటినీ అమరావతి ప్రాంతంలోనే కేంద్రీకరించినట్లు ఉన్నారు కాబట్టి జగన్మోహన్‌రెడ్డిగారు రాజధానిని తరలించడంలో సఫలీకృతులు అయితే, ఆర్థికంగా కూడా పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓటింగ్ వచ్చిన దీనిలో అధిక భాగం ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాలను స్కీముల ద్వారా పంచడం వల్ల వచ్చిన ఓటింగ్ శాతం. తెలుగుదేశం పార్టీ ప్రధాన బలం ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వెనుకబడిన తరగతుల ఓటర్లు నాయకత్వం. ఆ పార్టీలోని వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని భారతీయ జనతాపార్టీ ఆకర్షింప గలిగితే పార్టీ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి.
ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్న వైయస్సార్సీపీ పార్టీ పాలన ప్రజారంజకంగా సాగటం లేదు. అమలు చేయటానికి కష్టతరమైన అలవిగాని హామీలను ఎన్నికల సమయంలో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం వీటి అమలుకు కావలసిన ఆర్థిక వనరులను గురించి సరైన ప్రణాళిక రూపొందించుకున్నట్లు లేదు. నిధుల లేమితో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం రాష్ట్రంలో ఈనాడు నెలకొని ఉన్నది. చాలా నిర్ణయాలు ఏకపక్షంగా పర్యవసానాల అవగాహన లేకుం డా తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ప్రజాదరణను నిలబెట్టుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
2019లో జరిగిన ఎన్నికలలో జనసేనకు 6.78 శాతం ఓట్లు భారతీయ జనతా పార్టీకి 84% ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ సరళిపై ఆధారపడి ఈ రెండు పార్టీల బలాబలాలు అంచనా వేయటం పొరపాటే అవుతుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఓటింగ్ సరళిని ప్రభావితం చేసింది. ఆయనను ఓడించటానికి అనువుగా ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు భావించటంతో ఇతర పార్టీల ఓటు బ్యాంకులు కూడా వైయస్సార్సీపికి తరలి పోవడం జరిగింది. చంద్రబాబునాయుడు గారు వారి అనుకూల మీడియా ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రావలసిన సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా పోవడానికి భారతీయ జనతా పార్టీ కారణమని అసత్యాలతో ప్రచారం చేసి భారతీయ జనతాపార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంలో సఫలీకృతులయ్యారు. దాని పరిణామం కూడా ఆ పార్టీ ఓటింగ్ సరళిపై ప్రభావం చూపెట్టింది. గట్టిగా పోటీ ఇచ్చే ప్రత్యామ్నాయంగా ప్రజలలో నమ్మకం కలిగించడానికి 2019 ఎన్నికల ముందే ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఉంటే ఫలితాలు గణనీయంగా మెరుగుగా రెండు పార్టీలకు ఉండేవి.
అవినీతిరహిత సమర్థవంతమైన పాలన, వారసత్వం రాజకీయాలతో ప్రమేయం లేని పాలన, పరిమితమైన ప్రయోజనాలకు అతీతంగా అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పాలించగలిగిన ప్రత్యామ్నాయం కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజల ఆకాంక్షను పూరించే విధంగా ఈ నూతన కూటమి ఎదగగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.

- ఐ.వై.ఆర్. కృష్ణారావు iyrk45@gmail.com