సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాధాకృష్ణ
లోకములో ‘హరి, నారాయణ, విష్ణు’అనే పదములకంటెనూ ‘కృష్ణా’ అనేటటువంటి పదము చాలా మధురంగా ఉంటుంది. అదే విధముగనే ‘లక్ష్మీ, దుర్గ, సరస్వతి, సత్యభామ, రుక్మిణీ, అనేటటువంటి పదముల కంటెను ‘రాధా’అనేటటువంటి పదము చాలా మధురంగా ఉంటుంది. కనుక జగత్తులో ‘కృష్ణా! రాధా!’ పదములే చాలా మధురంగా ఉంటాయి. ఏమిటి ఈ కృష్ణ రాధలు? కృష్ణా అనగా దైవము, రాధ- (్ధరా) అనగా ప్రకృతి. ప్రకృతి ప్రతి ఒక్కరికీ ఇష్టముగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానిని ఆరాధిస్తారు. ప్రేమిస్తారు. ప్రకృతే ప్రతి ఒక్కరికీ ఆధారము.
రాధాకృష్ణులది అవినాభావ సంబంధం, వారినెవరూ విడదీయలేరు. ‘రాధ!’ ఉంటే కృష్ణుడూ వున్నట్లే! రాధాకృష్ణుల అనుబంధం దివ్యం. అమలినం. అజ్ఞానులు దానిని గురించి వంకరగా ఆలోచించినా, తెలిసిన వారికది దివ్యానుభూతి! అత్యున్నత ఆధ్యాత్మిక మధుర బంధం!
భాగవతం
‘భగవత...ఇదం...భగవతం’ అని కొందరు పండితులు చెప్పారు. అనగా భగవంతుని గురించి చెప్పు చరిత్రలే ‘భగవతం’అని పేరు. ‘భగవతానాం...ఇదం...భగవతం’అని కొందరన్నారు. అనగా భక్తులను గురించి ప్రబోధించునది ‘భగవతం’అన్నారు. భక్తునికి భగవంతునికి మధ్యనున్న సన్నిహిత సంబంధ బాంధవ్యాలను గురించి బోధించునదే ‘భగవతం’. భక్తునకూ భగవంతునకు మధ్యనున్న సేతువే ఈ ‘్భగవతము’.
రెండూ కలిసి...
ప్రహ్లాదుడు నిరంతరమూ హరినామము చింతిస్తూ వచ్చాడు. హరిని ప్రీతికరంగా చూచేవాడు ప్రహ్లాదుడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు హరిద్వేషి. సన్మార్గుని యొక్క భక్తి, దుర్మార్గుని యొక్క ద్వేషం- ఈ రెండింటి చేరిక వలననే నరసింహావతారం వచ్చింది. మంచిచెడ్డలు రెండునూ ఏకం కావాలి.
హిరణ్య కశిపులు
ఈ ఆధునిక యుగంలో చాలామంది హిరణ్యకశిపులు తయారైనారు. పిల్లలు గుడికి వెళ్ళి దేవుని పూజిస్తే, వీడికి దేవుని పిచ్చి పట్టిందంటారు. స్వామిదగ్గరకు వస్తే, వీడికి సాయిబాబా పిచ్చి అంటారు. మరే పిచ్చి పట్టాలి? ధనం పిచ్చి పట్టాలా? దైవభక్తి పిచ్చి కాదు. అదే నిజమైన ధనం.
కుంతి వరం.. కృష్ణుణ్ణి కుంతి ఒకసారి ఓ వరం అడిగిందిట. తన పిల్లలకు ఎప్పుడూ ఏదో వొక యిబ్బంది కలిగించమని! అదేం కోరిక? అవును. అలా ఏదో వొక బాధ వుంటుంటేనే గదా, వాళ్లకు సర్వదా దేవుడు గుర్తువుండేది! కృష్ణుడు వాళ్లను గమనిస్తూ ఆపదలనుండి ఎప్పటికప్పుడు వొడ్డెక్కించేది!
భక్తికి కొలమానం నీవు ఎన్ని సంస్థలు స్థాపించావు? ఎన్ని గుళ్ళు కట్టించావు? ఎన్ని గుళ్లు బాగుచేయించావు? ఎన్ని చందాలిచ్చావు? ఎన్నిసార్లు రామకోటి రాశావు? వీటిపై నీకెంత భక్తి ఉందీ అన్నది ఆధారపడి వుండదు. భక్తి అంటే ప్రేమ. దానికి స్వార్థంలేదు. ఫలాపేక్షాలేదు.
ఎండ మావులు
ఎండమావులు చాలా ఉంటుంటాయి. నీళ్లు ఎదుటే కనిపిస్తుంటాయి. కాని ఎంత దూరంపోయినా ఒక్క చుక్కనయినా నీరు అందించవు. ఎందుకని? అది కేవలం భ్రమ. నిజంగా అవి నీళ్ళుగావు. అలాగే భక్తితో భజన చేస్తున్నట్లుగా కనిపిస్తాడు. అది భక్తికాదు. కేవలం అతని శక్తి సామర్థ్యమును ప్రదర్శిస్తున్నాడు. ప్రకటిస్తున్నాడు. అలాంటివి నాకక్కరలేదు. భజన చేస్తున్నామంటే, ఈ భజన తరువాత మహాభజన ఏమిటి? ఈ పాట తరువాత మరొక పాటేమిటి? తాళమేమిటి? రాగమేమిటి? అంతా దీనిపైన పోతున్నారేగాని, భావానే్నమయినా కించిత్ అయినా భగవంతునిపై ఇమిడిస్తున్నారా? అలాటివారికి ఎలాంటి ఫలితం వస్తుంది?
భక్తుని లక్షణం
కొంతమంది బీదగా, సాదాసీదాగా కనిపిస్తారు. గంభీరంగా వుంటారు. వారు తమకుగల దైవభక్తిని చాటించుకోరు. బయటి జనానికి అర్థం కాకపోవచ్చు కాని నిజమైన భక్తుడు పైకి ఎట్లావున్నా అతని మనసు లోపల నిరంతరం దైవం నిండి వుంటాడు. ఎందుకని? అతడు ఏ పని చేసినా దానిని ఒక దైవకార్యంగానే భావించి చేస్తాడు కాబట్టి.
కార్యమే అర్చనం!
సాధకునికి తను చేయవలసిన పనిపట్ల భక్త్భివం వుంటుంది. ఏ పని చేసినా అది అతనికి అర్చనంలా పవిత్ర కార్యమే అనిపిస్తుంది. భగవత్ప్రీతికరంగా తోస్తుంది. దేవుని సన్నిధికి చేర్చే సోపానంగా కన్పిస్తుంది.
కర్తవ్యమే దైవం! కార్యమే అర్చనం!
ప్రత్యక్ష దైవాలు
పిల్లలంతా ప్రతిరోజూ తమ తల్లికీ, తండ్రికీ పాదాలను తాకి నమస్కరించాలి. దానివల్ల యింట్లో పవిత్ర వాతావరణం ఏర్పడుతుంది. పూజ్యభావం కలుగుతుంది. తల్లిదండ్రులకు నమస్కరించండి! ఇది నిత్యకార్యక్రమం కావాలి. మన సంస్కృతికి ఇది మూలం. ‘‘మాతృదేవోభవ!పితృదేవోభవ! ఆచార్య దేవో భవ!’’
అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.
ఇంకా ఉంది