సబ్ ఫీచర్

పరిమళం ఎంపిక ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిమళాల నుండి వచ్చే సువాసన కేవలం కొన్ని నిముషాల వరకే వెదజల్లుతుంది. ఎలాంటి పరిమళం అయినా సుదీర్ఘకాలం సువాసన ఉండదు. అయితే ఇలాంటివి మనం అస్సలు ఇష్టపడం. నిరంతరం సువాసన వెదజల్లే పరిమళాల కోసం ఎంతగానో ఖర్చు చేస్తాం. కానీ ఎలాంటి పరిమళమైనా కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పరిమళాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రశాంతతనిచ్చే పరిమళాలే మనసుకు హాయినిస్తాయి. మార్కెట్లో బోలెడు రకాల పరిమళాలు దొరుకుతున్నాయి. అద్భుతమైన పరిమళం వెదజల్లే సరైన సువాసన కోసం షాపులకు, మాల్స్‌కు వెళితే అక్కడ అన్ని రకాల పరిమళాల సువాసనలు మనల్ని గందరగోళపరుస్తాయి. మనం ఇష్టపడే సువాసనతో పాటు దానికన్నా మంచిది ఉందని, ఇది ఒకసారి ట్రై చెయ్యండని చురుకైన సేల్స్ మెన్స్ మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు. అందుకే వారి మాటలు పట్టించుకోకుండా మీరు కొన్ని చిట్కాలను పాటించి పరిమళాలను ఎంపిక చేసుకోవడం మంచిది.
* ప్రతి ఒక్క పరిమళ సీసాల గురించి మొదట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వాటిపై ఉండే గమనికలను చదవడం. ఇవి కాలంతో పాటు మారుతుంటాయి. ప్రతి పరిమళానికి మూడు గమనికలు ఉంటాయి. టాప్ అండ్ బాటమ్ అండ్ మిడిల్. టాప్ నోట్ ఏంటంటే.. పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసిన తరువాత తొలి పదిహేను నిముషాలు సువాసన ఉంటుంది. తరువాత అది తగ్గిపోతుంది. అదే మిడిల్ నోట్ విషయానికొస్తే.. ఆ పరిమళం కొన్ని గంటల వరకు ఉంటుంది. ఇక బాటమ్ నోట్‌కి వస్తే ఇది రోజంతా వాడే సువాసన. కాబట్టి మంచి సువాసన వెదజల్లే పర్‌ఫ్యూమ్ ఎంపిక చేసుకునేటప్పుడు మీరు టాప్ నోట్ మాత్రమే కాకుండా బాటమ్ అండ్ మిడిల్ నోట్స్‌ను కూడా నిర్ధారించుకోవాలి.
* మీరు ఇప్పటికే మీకు తెలిసిన కొన్ని పరిమళాలను కనుగొనే ప్రయత్నం చేయాలి. మీరు ప్రేమించే సువాసనతో కూడిన పరిమళాన్ని వెదకడానికి ప్రయత్నం చేయండి. షాప్‌కు వెళ్లినప్పుడు అలాంటి సువాసన కావాలని అడిగి పరీక్షించడం వల్ల మీకు నచ్చిన పరిమళాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నట్లయితే కోరుకున్న సువాసనను ఎంపికను వివరించే ఫిల్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
* పరిమళాలను ఎంచుకునేటప్పుడు మొదటగా లైట్‌గా ఉన్నవాటిని ట్రై చేయాలి. తరువాత ఘాటైన సువాసనలకు వెళ్లాలి. మస్కీ, కలప వంటివి తేలికైన సువాసనలను వెదజల్లుతాయి.
* అన్ని పరిమళాలను ఒకేసారి ప్రయత్నం చేయకూడదు. సువాసనలను పరీక్షించడంలో అస్సలు తొందర పడకూడదు. మీరు ఎంత ఎక్కువగా వాసన చూస్తే మంచి సువాసన ఉన్న వాటిని ఎన్నుకోవడంలో అందరూ గందరగోళ పడతారు. కాబట్టి ఒకేసారి మూడు పరిమళాల కంటే ఎక్కువగా ప్రయత్నించకూడదు.
* పర్‌ఫ్యూమ్‌ను పరీక్షించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వాటి మధ్య బ్రేక్ తీసుకోవడం. రకరకాల పరిమళాలతో ఒకేసారి మునిగిపోకండి. సుగంధాల మధ్య కాఫీ వాసన చూడటం లేదా చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి ప్రయత్నం చేయవచ్చు.
* మొదట ఆఘ్రాణించే పరిమళమే రోజంతా వాసన అలాగే వస్తుందని కాదు.. దానికి మీ శరీర వాసన కూడా పరిమళ వాసన పడే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఒకే పరిమళం వేర్వేరు వ్యక్తులపై భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి పరిమళాన్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి శ్యాంపిల్ తీసుకుని రోజంతా పరీక్షించాలి. *