సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రార్థన
నీకు భగవాన్‌ను ఏదయినా అడగాలనిపిస్తే ఇలా చేయి: ‘‘ఓ భగవాన్! నన్ను ఆరోగ్యంగా, హాయిగా, మంచిగా, చురుగ్గా వుంచు. ఇదిగో, యిలా జరిగితే నాకు సుఖసంతోషాలు కలుగుతాయని నేననుకుంటున్నాను. నేననుకుంటున్నది సరిఅయితే అనుగ్రహించు. కాదనుకుంటే నాకు ఏది మంచిదో దానే్న యివ్వు’’అని ప్రార్థించు. భగవంతుడు భక్తుని ఎప్పుడూ వదిలిపెట్టడు. నీ బాగూ ఓగూ ఆయనే చూసుకుంటాడు.
పాత్రకొద్దీ జలం
గంగానదిలో నీరు అనంతంగా ప్రవహిస్తూనే వుంటుంది. కాని మనం ఎంత పాత్రను తీసుకొని వెళతామో మనకు అంతే వస్తుంది. మనం తీసికొని వెళ్లే పాత్ర చిన్నదయితే ఎక్కువ నీరు చిక్కలేదని విచారించి ప్రయోజనం ఏమిటి? భక్తిని పట్టే ఫలం.
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నేను!
భగవదనే్వషణ
లోకంలో కోట్లాది ప్రజలంతా కూడనూ భగవత్ అనే్వషణ జరుపుతున్నారు. ఎక్కడ ఉన్నారని జరుపుతున్నారు అనే్వషణ? నా ఉద్దేశ్యము ‘్భగవత్ అనే్వషణ’అన్న పదం చాలాతప్పు. నీవు భగవంతుని వెతక నక్కరలేదు. భగవంతుడు ఎక్కడ చూచినా ఉన్నాడు. కాని భక్తులు భగవంతుని వెతుకుతున్నామని భ్రమిస్తున్నారు. భగవంతుడే నిజమైన భక్తుడ్ని వెదుకుతున్నాడు. ‘ఎక్కడ ఉన్నాడు? త్రికరణ శుద్ధితో కూడిన భక్తుడు ఎక్కడ ఉన్నాడు’అని తానే నిరంతరము కూడనూ ఇటువంటి భక్తునికోసం వెదుకుతున్నాడు. భగవంతుని మీరు వెదుక నక్కరలేదు. ఎందుకని? నీవే భగవంతుడివి కనుక నిన్నునీవు ఎక్కడ వెతుక్కోగలవు? ఇదియే పెద్ద పొరపాటు.
భక్తికూడ నటన?
‘నన్ను చేరుకోవాలన్న ఆర్తితో తపించే హృదయం ఎక్కడ వుంది?’ - అని దేవుడు వెదుకుతుంటాడు.
కాని నిజమైన శక్తి ఏది? ఎక్కడ? మనిషి ప్రతి దానినీ నాటకం చేసేశాడు. చివరకు భక్తికూడా నటనగా మారింది. కొంతమంది భక్తిపారవశ్యంలో కన్నీరు కారుస్తుంటారు. కాని కడుపులో ఆర్తి ఉండదు. అందర్నీ మోసం చేయగలిగామని లోపల్లోపల నవ్వుకుంటుంటారు. అలాటి అర్చనతో అందరినీ వంచించి, అందరినీ దగా చేయవచ్చు కాని నీ అంతరాత్మను మోసం చేయలేవు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా? అలాటి నాటకంవల్ల లభించేది పరమపదం కాదు! పతనం!
నేనే వస్తా!
మీవద్దకు నేనే వస్తాను. మీతో నేనే స్వయంగా మాట్లాడతాను. మీకు శాంతి, సంతోషాలను అనుగ్రహిస్తాను.
అంతేకాని, నేను మరెవరి ద్వారానో రాను. ఇంకెవర్నో ఆవహించి మాట్లాడను. ఇది గుర్తుంచుకోండి! అలాటివి నమ్మకండి. నాకా అవసరం లేదు.
ఏమి నీ కోరిక?
కఠోర తపస్సుచేసి దేవుని మెప్పించే వాళ్ల సంగతి మీరు పురాణాల్లో చదివే వుంటారు. వారి తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై, ‘బిడ్డా! నీకేం కావాలో కోరుకో!’అంటాడు. ఇంతకాలం నీవు వౌనంగా తపస్సుచేస్తే, నీకేం కావాలో నీ నోటితోనే చెప్పించాలని చూస్తాడు దేవుడు. అదీ ఆయన లీల! నీవేవో కోరాలని అనుకుంటావు. నీ కోరిక కూడా చివరకు ఆయన సంకల్పం ప్రకారమే వుండేట్లు చేస్తాడు దేవుడు.
శ్యామ వర్ణం
‘‘నేను రామభక్తుడను’’, ‘‘నేను కృష్ణ భక్తుడను’’, ‘‘నేను సాయి భక్తుడను’’- అనుకొంటుంటారు, మీలో కొందరు. అది ఎంతవరకు యథార్థం? మీరా అవతారమూర్తి చేతిలో సాధనాలుగా మారినప్పుడే మీకాపేరు సార్థకం అవుతుంది.
ఉదాహరణకు భరతుని తీసికోండి. ఆయనను రామభక్తుడనవచ్చు. ఆయన రామనామమే తన వూపిరిగా బ్రతికాడు. రాముడు అడవులలో ఎలాటి జీవితం గడిపాడో తానూ అలాటి ముని జీవితమే నందిగ్రామంలో గడిపాడు. ఎండకు ఎండి, వానకు తడిసిన భరతుని తెల్లని శరీరం నల్లపడిపోయింది. రాముని వలె ఆయన అలా ‘శ్యామ’ వర్ణుడయాడు!
ఇంకా ఉంది