సబ్ ఫీచర్

ఆదరణ కోల్పోతున్న రైతన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత చరిత్రను, మన పూర్వికుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలను చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికే దినోత్సవాలు చేస్తూ ఉంటాము. ప్రపంచ వ్యాప్తంగా దేశాలవారీగా ఒక్కొక్క ప్రత్యేకతను పురస్కరించుకుని ఆయా సందర్భాలనుబట్టి దినోత్సవాలను జరుపుకుంటారు. అయితే మనం రోజూ బ్రతకడానికి తినే తిండిని అందిస్తున్న రైతును మాత్రం మరచిపోతున్నాం. భారత మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్ జన్మదినాన్ని అంతర్జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.
* చరిత్ర: ఆదిమానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తిచేయడం నేర్చుకున్నారు. ఆధునిక పురాతత్వ శాస్తవ్రేత్తల ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీ.పూ. 7000లోనే మధ్యదరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తిచెంది ఉండేవి. క్రీ.పూ. 3000 నాటికి ఈజిప్షియన్లు, మొసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధతులను, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.
* వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతిపెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థికప్రగతిలో వ్యవసాయాభివృద్ధి ఒక కీలకాంశము. ‘వేటాడటం’ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతుల్లో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాల వంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందడంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండించటం ప్రారంభించడంతో తెగ/ జాతి/ రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసులుబాటునిచ్చింది.
* రైతు చేసే వ్యవసాయ పనులు-(ఒక పంట కాలంలో)
* దుక్కి దున్నడం: పంట పండించే ముందు సరైన కాలంలో దుక్కిదున్నడం, ఈ ప్రక్రియ మొట్టమొదటిసారిగా చేసే వ్యవసాయపు సాగుపని. దుక్కిదున్నడానికి ‘నాగలి’ని విరివిగా ఉపయోగిస్తారు.
* భూమిని చదునుచేయడం: పొలంలోని మట్టి గడ్డలవలన నేల ఎగుడుదిగుడుగా ఉంటుంది. దీనివల్ల ఆ నేలలో విత్తనాలు జల్లడానికి, నారు మొక్కలువేయడానికి అనువుగా ఉండదు. కాబట్టి నేలను చదునుచేయాలి.
* నీరు పెట్టడం: మట్టిగడ్డలు చదునుగా మరియు విత్తనాలు వేయడానికి అనువుగా ఉండటానికి నీరు పెడతారు.
* విత్తడం: విత్తేముందు రైతులు ఏ వ్యాధిలేని విత్తనాలు ఎంపిక చేస్తారు. దీనివల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది.
* నారు నాటడం లేదా ఊడ్చడం.
* దారులు చేయడం
* కలుపుమొక్కల్ని తొలగించడం: పొలాల్లో సాగుమొక్కలతోపాటు నేల, నీరు పోషక పదార్థాలు వెలుతురుకూ పోటీపడుతూ పెరిగే అవసరం లేని మొక్కలను తొలగిస్తారు.
* నీటిపారుదల: మొక్క ఎదుగుదలకు పంటల ఉత్పత్తులకూ నీరు చాలా అవసరం.
* ఎరువులు: మొక్కల పెరుగుదలకు వివిధరకాల పోషక పదార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, మాంగనీస్, జింక్, మాలిబ్దినం, బోరేట్, క్లోరిన్ మొదలైనవి. కర్మాగారాల్లో తయారైన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులను కూడా రైతు ఉపయోగించుకుంటాడు.
* పురుగుమందులు చల్లడం, పంటకోయడం, కోసిన పంటని ఎండబెట్టడం, కట్టలు కట్టడం, కుప్పవేయడం, నూర్చడం లేదా ధాన్యాన్ని వేరుచేయడం, తూకం, బస్తాలు నింపడం.
రైతు ఉపయోగించే వ్యవసాయ పనిముట్లు, నాగలి, గొడ్డలి, కొడవలి, పలుగు, పాఱ, ఏతము, ఎద్దులబండి మొదలగునవి.
ఒక క్రమపద్ధతిలో ఆరుగాలం కష్టపడి తన చెమటను ధారబోసి పంటను పండించే రైతు ఆ తరువాత దశలో అడుగడుగునా మోసపోతూనే ఉన్నాడు. (దీనికి అనేక కారణాలు, పరిస్థితులు ఉన్నాయి)
* భారతదేశంలో వ్యవసాయం:
భారతదేశంలో పంట కాలాన్ని మూడువిధాలుగా వర్గీకరించారు.
1) ఖరీఫ్ పంటకాలం (జూన్-అక్టోబర్) 2) రబీ పంట కాలం (అక్టోబర్- మార్చి, ఏప్రిల్) 3) జైద్ పంటకాలం (మార్చి- జూన్)
* వ్యవసాయ- విద్య: 1) డిగ్రీ: ఎమ్‌సెట్ పరీక్ష ద్వారా రకరకాల సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. అవి బీఎస్సీ (వ్యవసాయం), బీఎస్సీ (ఉద్యానవనం), బివిఎస్‌సి మరియు పశుగణాభివృద్ధి, బిఎస్సీ(వాణిజ్య వ్యవసాయం, వ్యాపార నిర్వహణ) బిఎఫ్‌సి. 2) బి.టెక్ (జీవ, సాంకేతిక శాస్త్రం, బి.టెక్ (ఆహార విజ్ఞానం మరియు సాంకేతికం), బి.టెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్), బి.టెక్ (పశుపోషణ). 3) పాలిటెక్నిక్: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయంలో రెండేళ్ళ డిప్లొమా కోర్సులు అందజేస్తున్నాయి.
* ఉపాధి: స్వయం ఉపాధితోపాటు, ప్రభుత్వ, ప్రైవేటురంగాలలో వివిధ ఉపాధి అవకాశాలున్నాయి. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకి సంబంధించిన వివిధ ప్రాంతీయ కేంద్రాలలో కృషి విజ్ఞాన కేంద్రాలు, నేషనల్ డైయిరీ రీసెర్చ్, ఫారెస్ట్‌రిసెర్చ్, వెటర్నరీ రీసెర్చ్, వివిధ పేర్లతో ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
ఉన్నత విద్యలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక కోర్సులను చదువుతున్నప్పటికీ, ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ వాస్తవంగా నేడు రైతును ఎవరు కూడా పట్టించుకోకపోగా, రోజురోజుకు రైతు మోసపోతూనే ఉన్నాడు.
వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం రైతును బ్రతకనిద్దాం!

- సూర రాజేందర్