సబ్ ఫీచర్

రజనీ.. చాలా నేర్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజినీ నటించిన తాజా చిత్రం -దర్బార్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించాడు. చాలాకాలం తరువాత పోలీస్ అధికారిగా రజనీ కనిపించనున్నారు. రజనీతో చాలాకాలం తరువాత నయనతార కూడా జోడీకట్టింది. ఈనెల 9న సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్ మీడియాతో మాట్లాడాడు.
రజినీతో చాన్స్ ఎలా?
గజినీ విజయం సాధించిన టైంలో రజనీ నన్ను ఇంటికి పిలిచారు. అలా వెళ్లి ఆయనను కలిశాను. ఆయన శివాజీ సినిమా చేస్తున్న టైంలో నాతో ఓ సినిమా చేయాలనుకున్నారు. టైం కలిసిరాలేదు. ఆ టైంలో నేను హిందీ గజినీతో బిజీగా ఉన్నా. ఆ తరువాత రజనీ టైం దొరకలేదు. ఆయన ప్రాజెక్టులతో ఆయన బిజీ అయిపోయారు. ఇలా మా ఇద్దరి కాంబోలో సినిమా రావడానికి 15 ఏళ్లు పట్టింది.
ప్రతి సినిమాలో మెస్సేజ్ ఇస్తారు..?
దర్బార్‌లోనూ అదే కొనసాగింది. పోలీస్ అంటే సమాజానికి ఉపయోగపడేవాడు. సొసైటీలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో స్పందించే ఓ పోలీస్ కథ ఇది. పోలీస్‌లు రెండు రకాలు. కొందరు ప్రజలకు కనెక్టవుతారు. కొందరు ప్రభుత్వానికి, రాజకీయ నేతలకు కాపలా కాస్తారు. దర్బార్ పోలీస్ మొదటి రకం.
రజనీలాంటి సీనియర్ నుంచి నేర్చుకున్నది?
చాలా నేర్చుకున్నా. అందులో ముఖ్యంగా -మనల్ని మనం నమ్మాలని. పోటీదారుల నుంచి నేర్చుకోవాలని. ఎవరో ఏదోచేసి విజయం సాధించారని, మనమూ అదే చేయకూడదు అంటారాయన. భగవంతుడి గురించి అనేక విషయాలు చెప్పారు. నాకు ఓ బుక్ కూడా ప్రజెంట్ చేశారు. ప్రతి ప్రశ్నకూ రజనీ దగ్గర సమాధానం ఉంటుంది. అదీ ఆయన అనుభవం.
అనిరుధ్ గురించి..?
దర్బార్‌కు అనిరుధ్ మంచి సంగీతం సమకూర్చాడు. మంచి బాణీలూ అందించాడు. బీజీఎమ్ చక్కగా కుదిరింది. యంగ్ జనరేషన్‌లో అనిరుధ్‌కి మంచి టాలెంట్ ఉంది.
తెలుగులో స్ట్రెయిట్ మూవీ..?
తెలుగు నేటివిటీ తగినట్టు హీరో రోల్ ఎలా డిజైన్ చేయాలో ఇంకా అనుభవంలోకి రాలేదు. తెలుగు ప్రజల నాడి పట్టడం చాలా కష్టం. అందుకే ధైర్యం చేయలేకపోతున్నా. ఆ విషయం అవగాహనకు వచ్చిన తరువాత మళ్లీ చేస్తానేమో.
స్పైడర్ ఫలితంపై మహేష్ స్పందన?
స్పైడర్ మూవీ రిజల్ట్ నన్ను బాగా నిరాశపర్చింది. అయినప్పటికీ మహేష్ రోజూ ఫోన్, మెసేజ్ చేసేవారు. సినిమా అంటే మనం కష్టపడినా ఒక్కోసారి మంచి ఫలితం రాకపోవచ్చు అనేవారు. మహేష్ మనసు ఆయన శరీరం కంటే తెలుపు. అలాంటి హీరోకి ప్లాప్ ఇచ్చినందుకు బాధగా ఉంటుంది.
మహేష్‌లో గమనించింది..?
సాధారణంగా సక్సెస్ ఇచ్చిన దర్శకుడినే పలకరిస్తారు. కానీ మహేష్ ప్లాప్ ఇచ్చిన నాలాంటి దర్శకుడినీ ఆప్యాయంగా చూస్తారు. అదే మహేష్‌లో నేను చూసిన బెస్ట్ క్వాలిటీ.