సబ్ ఫీచర్

జనాభిమానమే.. ఆమెకు ఫాల్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘంటసాలను పరిశ్రమకు పరిచయం చేసింది
కృష్ణవేణమ్మ అన్న విషయం సినీ ప్రపంచానికి కొత్త కాకపోవచ్చు. ఆయనను తెరపైకి తెచ్చిందీ
కృష్ణవేణమ్మే అంటే ఆశ్చర్యమేస్తుంది. కష్టాల్లోవున్న
పి పుల్లయ్య ఇంటికొచ్చి అభ్యర్థిస్తే -ఆయనను
రుణభారం నుంచి తప్పించేందుకు తెగువైన పాత్ర కృష్ణవేణమ్మ పోషించారనడం అతిశయోక్తి కాదు. అప్పటికి స్టార్ హీరోయిన్‌గావున్నా -ఆ కాలంలోనే పులయ్య అభ్యర్థన మేరకు వేంపు పాత్ర చేయడానికి సాహసించారు కృష్ణవేణమ్మ. ఆమెనుంచి మరికొన్ని జ్ఞాపకాల ముచ్చట్లు..
వెనె్నల అతిధుల కోసం రెండోవారం.
**
1939లో మళ్లీ పెళ్లి చిత్రంలో చిన్న పాత్రయినా ప్రాధాన్యతను చూసి నటించారు కృష్ణవేణి. నటి కృష్ణవేణి నిర్మాతగా రూపొందించిన చివరి చిత్రం -దాంపత్యం (1957). ఈ చిత్రంతో మధుర సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రమేష్ నాయుడిని పరిచయం చేశారు. ఆలుమగల మధ్య అన్యోన్య దాంపత్యమే కథాసారంగా ఆ చిత్రం రూపొందింది. భక్త ప్రహ్లాద చిత్రాన్ని రెండోసారి (జి వరలక్ష్మి ప్రహ్లాదుడు) రూపొందించారు. కానీ ఆ చిత్రంలో కృష్ణవేణి నటించలేదు. 1950లో ఈలపాటి రఘురామయ్య, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా పల్లెటూరి పిల్ల మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. రెండో షెడ్యూల్‌లో ఈలపాటి రఘురామయ్య బుల్ ఫైట్ చేయాల్సివచ్చింది. అలాంటి రిస్క్‌లు నేను చేయలేనంటూ రఘురామయ్య సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పుడే షావుకారు చిత్ర సెట్స్‌లోవున్న ఎన్టీఆర్‌ను బుక్ చేసుకుని మళ్లీ షూట్ మొదలెట్టారు. ఆ చిత్రానికి బుల్‌ఫైట్ హైలెట్‌గా నిలిచింది. 1947లో బ్రహ్మరథం చిత్రాన్ని రూపొందించారు. అదే ఏడాది గొల్లభామ చిత్రాన్ని కాశీమజిలీ కథలు ఆధారంగా రూపొందించారు. అప్పట్లో అంజలీదేవి తొలిసారిగా తెరమీద గంధర్వకన్యగా పరిచయమయ్యారు. ఈలపాటి రఘురామయ్య పాటలు, పద్యాలు, కృష్ణవేణి పాటలతో సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అదే చిత్రాన్ని 1967లో సి పుల్లయ్య దర్శకత్వం వహించి అదే కథతో ‘్భమావిజయం’ రూపొందించారు. అయితే గొల్లభామ చిత్రంలో కొన్ని కొన్ని అనుమానాలు ప్రేక్షకులకు అలాగే ఉంటాయి. ఆ అనుమానాలన్నింటినీ తన స్క్రిప్ట్‌లో సవరించి మళ్లీ అద్భుతమైన పాటలతో ఎన్టీఆర్, దేవిక, ఎల్ విజయలక్ష్మి, విజయనిర్మల, నాగరాజు తారాగణంగా రూపొందించారు. గొల్లభామలో రేలంగి గణపతి పాత్రలో నటించాడో, భామావిజయంలోనూ అదే గణపతి పాత్ర చేయడం విశేషం. సి కృష్ణవేణి కథానాయికగా రూపొందించిన మరో చిత్రం ‘్ధర్మాంగద’. ఇప్పుడు ఈ చిత్రం ప్రింటే దొరకడంలేదు. ఈ సినిమా కథ ఏంటంటే -రాణి కడుపున పాము పుడుతుంది. ఆ విషయం ప్రజలకు తెలీకూడదన్న ఉద్దేశంతో యువరాజే పుట్టాడని ప్రకటించిన మహారాజు సంబరాలు జరుపుతాడు. ఓ మూగ చెలికత్తెను కాపలాగా పెట్టి పామును పెంచుతాడు. ఆ మూగ చెలికత్తె పాత్ర చేసిందెవరో కాదు, గయ్యాళి పాత్రలతో గొప్ప పేరు తెచ్చుకున్న సూర్యకాంతం. లొడలొడా మాట్లాడుతూ అల్లరిచేసే సూర్యకాంతంతో మూగ అమ్మాయి పాత్ర ఎలా చేయించారంటూ అంతా అడిగారట. బహుశా సూర్యకాంతం కెరీర్‌లో మూగగా ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆ సినిమా విజయవంతమైంది. ఆ పామునే ఓ పతివ్రతకు ఇచ్చి పెళ్లిచేస్తే, ఆమె అన్ని పుణ్యక్షేత్రాలు భర్తతోసహా తిరిగి ముక్తిని పొందుతుంది. భర్తను మానవుడిగా మార్చుకుంటుంది. అదీ కథ. ఈ కథతో తరువాత అనేక జానపద చిత్రాలొచ్చాయి. పేరంటాళ్లు అనే చిత్రం 1951లో మాలతితో కలిసి నటించారు కృష్ణవేణి. పతివ్రతలకు సంబంధించిన కథలతో రూపొందించిన చిత్రం అప్పట్లో మార్మోగింది. కోన ప్రభాకర రావును ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రమే -సాహసం. ఇండస్ట్రీలో చాలాకాలం కొనసాగిన ఆయన తరువాత మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. తమిళంలో నందిని అనే చిత్రంలో పండితుడైన హీరోకు కథానాయికగా నటించారు కృష్ణవేణి. అప్పుడప్పుడే కన్నడ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న హీరో రాజ్‌కుమార్‌ను నాయకుడిగా తీసుకొని ‘రాజసింహ’ చిత్రాన్ని ప్రారంభించారు కృష్ణవేణి. ఒక షెడ్యూల్ పూర్తయింది. ఆ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న వ్యక్తికి, నిర్మాతైన కృష్ణవేణికి పడకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ఒక్కసారి ఏదైనా అవాంతరం వచ్చి షూటింగ్ ఆగిపోతే మళ్లీ దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు కృష్ణవేణి. ఈలోగా రాజ్‌కుమార్ కన్నడ చిత్రసీమలో అగ్ర హీరో అయిపోయారు. దాదాపు పది పనె్నండేళ్ల తరువాత ఆయన పాత సంఘటన మర్చిపోకుండా మళ్లీ నిర్మాత కృష్ణవేణికి ఫోన్ చేశారు. కన్నడంలో భక్తకుంభార అనే ఒక కథతో చిత్రం రూపొందించాలని, తాను అప్పుడెప్పుడో తీసుకున్న అడ్వాన్స్‌కి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలా ఆ కథను స్వీకరించిన కృష్ణవేణి, కుమార్తె ఎన్‌ఆర్ అనూరాధా దేవి నిర్మాతగా చిత్రాన్ని రూపొందించారు. అది అద్భుతమైన విజయం సాధించింది. రాజసింహ చిత్రంలో జరిగిన నష్టం ఈ చిత్రంతో పదింతలు లాభాలొచ్చాయి. ఓరకంగా తన జీవితంలో అది టర్నింగ్ పాయింట్ అంటారామె. 1950లో తిరుగుబాటు అనే చిత్రంలో కథానాయికగా కాకుండా వేంప్‌గా నటించమని అడిగారు పుల్లయ్య. నేనేంటి.. వేంప్‌గా నటించడమేంటి? ఇది జరగనిపని? అని ఖరాఖండీగా చెప్పేశారు కృష్ణవేణి. కానీ పి పుల్లయ్య వచ్చి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, హీరో హీరోయిన్లకు సరైన గుర్తింపు లేదు కనుక మీరు ఈ పాత్రలో నటిస్తే సినిమా హిట్టవుతుందని, తనకు రుణభారం తీరుతుందని అభ్యర్థించారు. ఎదుటివాళ్లు కష్టాల్లో వున్నారంటే, అందుకు తగ్గవిధంగా స్పందించి సాయం చేయడం కృష్ణవేణికి బాల్యంనుంచే అలవాటు. ఆ విషయాన్ని అప్పటి సాంకేతిక నిపుణులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ‘శోభనాచల స్టూడియోకి వెళ్తే ఖాళీ కడుపుతో ఏనాడూ పంపించేది కాదు మహాతల్లి. వేషాలకోసం అవకాశాలకోసం అనేక స్టూడియోలు పట్టుకుని తిరిగే మేము.. ఆకలైనప్పుడు శోభనాచల స్టూడియోకి వెళ్లి భోజనాలు చేసిన సందర్భాలు అనేకం’ అంటుంటారు సందర్భం వచ్చినపుడు. అంత గొప్పగా అప్పట్లో శోభనాచల స్టూడియో ఖ్యాతిగాంచింది. దర్శకుడికి సహాయం చేయడం కోసం వేంప్ పాత్రలో తిరుగుబాటు చిత్రంలో నటించారు కృష్ణవేణి. కానీ ఇన్నాళ్లుగా పెంచుకున్న స్టార్‌డమ్, ఆమె వ్యక్తిత్వంపై వున్న ఓ గౌరవం ఈ చిత్రంతో కొంత దెబ్బతిన్నమాట వాస్తవం. ఆ విషయాన్ని కృష్ణవేణమ్మే ఒప్పుకుంటారు. నేను ఆ చిత్రం చేయకపోతే బాగుండేది అని. వేంప్‌గా నటించినా ఎక్కడా అశ్లీలంగా కన్పించలేదు. పొడుగు చేతుల జాకెట్‌ను నేనే డిజైన్ చేసుకొని కుట్టించుకుని ఆ చిత్రంలో ధరించానని గుర్తు చేసుకున్నారు.
లక్ష్మమ్మ కథతో త్రిపురనేని గోపీచంద్ వచ్చారు. ఘంటసాలను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రంలో కథానాయికగా నటించారు కృష్ణవేణి. హీరోగా సిహెచ్ నారాయణరావు నటిస్తే, వేంప్‌గా నేటి సీనియర్ నటి లక్ష్మి తల్లి రుక్మిణి నటించారు. బాలమిత్రుల కథలో ‘ఐస్‌క్రీం బాబూ ఐస్‌క్రీం’ అంటూ ఓ పాట కూడా నిర్మాతల కోసమే పాడారామె.
అప్పట్లోనే ఇంగ్లీష్ పేర్లతో సినిమాలు రూపొందించిన ఘనత కృష్ణవేణమ్మదే. గుడ్ ఈవెనింగ్, లేడీ డాక్టర్ అనే రెండు చిత్రాలను ప్రారంభించారు. కానీ ఆ చిత్రాలు ఆగిపోయాయి. అదేవిధంగా కుమ్మరి మొల్ల చిత్రం కూడా కొంత రూపొందించాక.. సినిమాకు సంబంధించిన రచయిత మోసం చేయడంతో చిత్రీకరణ ఆపేశారు. అదే కథ అటుతిరిగి ఇటు తిరిగి చివరికి పద్మనాభం చేతుల్లో పడి వాణిశ్రీ కథానాయికగా ‘కథానాయిక మొల్ల’గా వచ్చింది. గోపీచంద్ మరో కథ ‘పాలేరు’. ఇదే పేరుతో షావుకారు జానకి మరో కథానాయికగా కృష్ణవేణమ్మ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ ఇదీ ఆగిపోయింది. ఈ చిత్రాలు కూడా విడుదలైవుంటే తన కెరీర్ మరోలా ఉండేదని గుర్తు చేసుకుంటారామె. సినిమాల్లో నటించడం తగ్గించేశాక ఘంటసాలతో వున్న పరిచయంతో రాష్టమ్రంతా తిరిగి సతీ సక్కుబాయి నాటకాన్ని ప్రదర్శించారు. ఇదే కథతో అంజలీదేవి చిన్ని బ్రదర్స్ పిక్చర్స్ పతాకంపై చిత్రాన్ని రూపొందించారు. విశేషమేమిటంటే పాటలు పాడే ఘంటసాల నటిస్తారని చాలామందికి తెలీదు. సతీ సక్కుబాయి నాటకంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తిరిగి ఆయన నాటకంలో నటుడిగా జీవించారు. సతీ సక్కుబాయి చిత్రంలో గుమ్మడి ధరించిన పాత్రలోనే ఘంటసాల నాటకంలో జీవించారు. ఇపుడు 95నుంచి 96వ పుట్టినరోజు ఈనెల 24న జరుపుకున్నారు కృష్ణవేణమ్మ. ఇప్పటికీ ఆరోగ్యంగా కనిపించే ఆమె ‘మంచి జరిగితే ఆనందంగా ఉంటాను. అనుకున్నదానికి భిన్నంగా జరిగితే బాధనిపిస్తుంది. ఏదేమైనా ఓ తరానికి ప్రతినిధిగా నన్ను చూస్తున్నారు. నేను ఇంతగా ప్రజల ఆదరణ, మన్నన, అభిమానం పొందానా? అని ఉక్కిరిబిక్కిరి అవుతుంటా. నా ఆరోగ్యానికి అదే ఆయుష్షేమో’ అంటారు.
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును, అదే ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించి గౌరవించుకున్నారు. దాదాపు ఓ తరాన్ని నడిపించిన కళామ తల్లికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవం దక్కకపోవడం తెలుగువారికి విచారకరం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునిచ్చి సత్కరించేంత గొప్ప కృషి చేశారామె. ‘అలాంటివి నాకు వచ్చినా, రాకపోయినా ప్రేక్షకుల్లో ఉన్న గుర్తించి చాలా గొప్పది’ అంటూ సింపుల్‌గా నవ్వేశారు కృష్ణవేణి. *

-సరయు శేఖర్, 9676247000