సబ్ ఫీచర్

యోగాకు బెస్ట్ యాప్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగాని జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మనదరికి రావు. జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే యోగా చేయాలంటే కచ్చితంగా క్లాసులకు వెళ్లాలి. అందుకు సమయం లేదు కదా.. అని వెంటనే అందరి నోటి నుండి సమాధానం రాకుండా ఇంట్లోనే ఎంచక్కా యోగా చేయవచ్చు. అందుకోసం మనకి ఉపయోగపడే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
బ్రీత్ యాప్
యోగా చేసే ముందు శ్వాస తీసుకుని వదలడం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆసనాల్లో ఎక్కువ సేపు ఉండగలుగుతాం. అందుకోసం ఈ బ్రీత్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో.. శ్వాస ఎంతసేపు తీసుకోవాలి.. ఎంతసేపటికి వదలాలి.. అనేవి స్పష్టంగా ఉంటాయి. అంతేకాదు.. రోజూ మనం అనుకున్న సమయానికి యోగా చేయొచ్చని ఈ యాప్ సూచిస్తుంది.
యోగా గో యాప్
ఈ యాప్‌లో ఫిట్‌నెస్‌తో పాటు అధిక బరువు నియంత్రించుకోవడానికి నియమాలు కూడా ఉంటాయి. ఏడు నిముషాల నుంచి మొదలై ముప్ఫై నిముషాల వరకు యోగా చేసేలా ఉంటుంది.
5 మినిట్
సమయం తక్కువగా ఉన్నప్పుడు కేవలం ఐదు నిముషాల్లోనే చేసే యోగాసనాల గురించి ఈ యాప్ పూర్తి సమాచారం ఇస్తుంది. ఇందులోని ఆసనాలన్నీ ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.
పాకెట్ యాప్
యోగాసనాలు వేయడంలో ఎన్నో సూచనలు ఇచ్చే ఈ యాప్.. ఏ భంగిమ ఎలా వేయాలో.. దానివల్ల కలిగే లాభాలేంటో సూచిస్తుంది.
యోగావేవ్
ఈ యాప్ అప్పుడే యోగా నేర్చుకునే వారినుంచి నిష్ణాతులైన వారివరకూ అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని నియమాలు పాటిస్తే శరీరం చక్కగా, ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.
సింపుల్ హాబిట్
ఈ యాప్ మెడిటేషన్‌కి సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తుంది. స్ట్రెస్, ఏకాగ్రతను పెంచి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.
*