సబ్ ఫీచర్

ఫోన్లో మాట్లాడటమూ కళే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఇరుగుపొరుగువారు కలిసిమెలిసి చక్కగా మాట్లాడుకునేవారు. నాడు ఫోన్లో మాట్లాడటం అనేది ఒక విలాసం. అప్పుడప్పుడూ.. ఏదో అవసరం ఉంటే తప్ప ఫోనును వాడేవారు కాదు. కానీ ఇప్పుడు.. పక్కింట్లో ఉన్న మనిషితో కూడా ఫోన్లోనే మాట్లాడేస్తున్నాం. ఇలాంటి విచ్చలవిడి ఫోన్ల వాడకంలో లాభనష్టాల మాట అటుంచితే ఫోన్లో మాట్లాడటం కూడా ఒక కళే.. అంటున్నారు నిపుణులు. మనిషి ఎదురుగుండా ఉండడు కాబట్టి మొహమాటమూ, భయమూ లేకుండా ఉంటాము. అలాంటి సమయంలో కొన్ని కనీస మర్యాదలను పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు..
* కొంతమందికి ఫోన్ వస్తే చాలు వదలకుండా మాట్లాడుతూనే ఉంటారు. సరే అయితే.. ఇక ఉంటాను.. వంటి సూచనలు అవతలివారు ఇస్తున్నా కూడా సంభాషణని మరింతగా పొడిగిస్తూ ఉంటారు. ఇలాంటి సంభాషణలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.
* ఏదైనా విషయం గురించి మాట్లాడాలనుకునేటప్పుడు ఒక నిముషం సేపైనా మీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటి? దాన్ని అవతలివారికి ఎలా తెలియజేయాలనుకుంటున్నారు? అన్న అంశంపై దృష్టి పెట్టాలి. మీ మాటలకు అవతలి వ్యక్తి ఎలా స్పందించే అవకాశం ఉంది. దానికి మీ దగ్గర తగిన జవాబు ఉందా? లేదా? అనేది తరచి చూసుకోవాలి. లేకపోతే సంభాషణ మధ్యలో మాటలు తడుముకోవాల్సి ఉంటుంది.
* మన జీవితంలో ఎదురుపడిన ప్రతి ఒక్కరి దగ్గరా మన ఫోన్ నెంబరు ఉండాలన్న నిబంధన లేదు. కానీ చాలామందికి తమను తాము పరిచయం చేసుకునేందుకు అహం అడ్డు వస్తుంది. నేనే మాట్లాడేది.. ఏంటి విశేషాలు? అని నేరుగా సంభాషణలోకి దిగిపోతుంటారు. అవతలివారు సదరు మనిషిని గుర్తుపట్టలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. ఒకవేళ గుర్తుపట్టినా సంభాషణ మొదలయ్యే తీరు చాలా అమర్యాదగా తోస్తుంది.
* ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు నమస్కారం చెప్పడం, క్షేమ సమాచారాలు అడగడం కనీస మర్యాద. ఫోన్ సంభాషణలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు.. అవతలి వ్యక్తి హోదాలో ఎంత చిన్నవారైనా కూడా దురుసుగా మాట్లాడటం, వేళాకోళం చేయడంతో మన గురించి చెడు అభిప్రాయానే్న మిగులుస్తుంది. చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు తమకి ఉన్న హాస్య చతురతని అంతా చూపిద్దామనుకుని గీత దాటుతూ ఉంటారు. దీంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
* ఫోనోల మన వాదనను వినిపించేందుకు ఎంతగా ప్రాధాన్యతని ఇస్తామో, అవతలివారి మాటను వినేందుకు కూడా అంతే ప్రాధాన్యతని ఇవ్వాలి. మాటిమాటికీ అడ్డు తగలడం, హెచ్చుస్థాయిలో మాట్లాడటం వల్ల వాదన కాస్తా వివాదంగా మారిపోయే అవకాశం ఉంది. తొందరగా మాట్లాడేయాలన్న కంగారులో ఏది పడితే అది మాట్లాడేసే ప్రమాదమూ లేకపోలేదు. ఇక ఏదైనా ముఖ్యం విషయం మాట్లాడాలనుకునేటప్పుడు టీవీ, ట్రాఫిక్ వంటి శబ్దాలు లేని సందర్భాన్ని ఎంచుకోవడం మంచిది.
* ఫోన్ సంభాషణ ఎలా మొదలుపెట్టాలి అన్నదే కాదు.. ఎంతసేపట్లో ముగించాలన్నది కూడా తెలిసి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక చాలు అన్న సూచనని ఇచ్చినప్పుడు ఆ సంభాషణని ఇక ముగించడం మేలు.