సబ్ ఫీచర్

చెప్పాలని ఉంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువతకు గొంతెత్తి చెప్పాలని వుంది. యుక్తవయస్సులో మనం తీసుకొనే ఏ నిర్ణయమైనా భవిష్యత్తుకు నాంది అవుతుంది. అలాకాకుండా చెడువైపు మళ్లామా.. లైఫ్ రిస్క్‌లో పడినట్లే. తిరిగి చూసుకుంటే అంతా అగమ్యగోచరమే. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా యుక్తవయసులో ముందు మంచి చదువు, తర్వాత మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా చేయండి. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. సినిమాలు చూడండి.. షికార్లు చేయండి... ఈ వయసులో కేవలం అవి ఒక భాగం మాత్రమే. అవే జీవితం కాదు. అందులోని మంచిని గ్రహించండి. చెడును వదిలేయండి. అమ్మా నాన్నల కలలను సాకారం చేస్తూ, మీ భవిష్యత్తుకు పునాదులు గట్టిగా వేసుకోండి. అంతేకాని సినిమాల ప్రభావమో, విదేశీ సంస్కృతుల విచ్చలవిడితనాన్ని వదిలేయండి. ఇపుడు యువతను పట్టి పీడిస్తున్నది ప్రేమభూతం. దీనివలలో పడి యువత చాలావరకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించడం తప్పుకాదు.. కాని మన కర్మభూమిలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు.. ఆచార సాంప్రదాయాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని తొంగలో తొక్కి ప్రేమ వలలో పడి యువత జీవితాలను పాడుచేసుకొంటున్నారు. అమ్మా నాన్నలను ప్రేమించండి.. కుటుంబ సభ్యులను ప్రేమించండి.. మంచి స్నేహితులను ఎన్నుకోండి.. మీ భవిష్యత్తును ప్రేమించండి!
ఇంకోమాట- ఈమధ్య అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే.. మనం జనారణ్యంలో వున్నామా.. మానవ మృగాలమధ్య తిరుగుతున్నామా అర్థం కావడంలేదు. ఈ విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఆత్మరక్షణకై ఆయుధాలు సిద్ధంగా ఉంచుకోవాలి. లేదంటే టెక్నాలజీని ఉయోగించుకోవాలి. వేళకాని వేళలో వెళ్ళవలసి వస్తే తోడు తీసుకొని వెళ్లండి. ఆపద పొంచి వుందని అన్పిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి.. లేదంటే జనసమ్మర్దం వున్న చోటుకు వెళ్లండి. అత్యవసరమన్పిస్తే 108కు ఫోన్ చేయాలి. ఆపద సమయంలో అంబులెన్స్ సర్వీస్‌కు మించింది లేదు.
ఇక దారుణాలు చేసే ఆవారాళ్ళమీద పోలీసువారు ఓ కనే్నసి ఉంచాలి. మానభంగం చేస్తే మరణశిక్షే సరైన దండన. లేదంటే ఆ దుర్మార్గులను మగతనాన్ని దూరం చేయాలి. మళ్లీ ఎవరైనా చేయాలంటే ఆ శిక్షలకు భయపడాలి. వారు చేసే పనికి అమ్మాయిలు ఎంత నరకయాతన పడతారో.. అంతకుమించి నరకం చూపించాలి. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఎంత వేదనకు గురవుతారో ఆలోచించాలి. అటు ప్రభుత్వాలు.. నాయకులు.. అవసరమైన చట్టాలను రూపొందించి నేరస్థులకు కఠిన శిక్షలు విధించాలి. చాలా దేశాల్లో శిక్షలు ఖచ్చితంగా కఠినంగా విధిస్తున్నారు. ఒక్క మన దేశంలోనే ఇలా వుంది. మార్చండి చట్టాలను.. అమాయకులైన అమ్మాయిలను కాపాడండి.
ఏ దేశ చరిత్రనైనా తిరగరాసేది యువత.. యువత చైతన్యవంతం కావాలి. దేశ భవితకై నడుం బిగించండి. యువత తల్చుకుంటే సాధించలేనిది లేదు. కలిసి మెలిసి కదనరంగంలోకి దూకండి. తప్పుచేసినవాడిని అప్పుడే అడ్డుకోండి. నవశకానికి నాంది పలకండి. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకండి. నిరాశావాదాన్ని తరిమికొట్టండి. ఆశావాదానికి జైకొట్టండి. కళ్లముందు జరిగే అవినీతిని.. అఘాయిత్యాలను అడ్డుకోండి. మన యువ భారత కీర్తిని దశదిశలా దిగంతాల అంచులు దాటించండి.

-కురువ శ్రీనివాసులు