సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి-చెడు
ప్రతి విషయమునందు మానవునకు విచక్షణాజ్ఞానం అత్యవసరం. ఇది మంచా? చెడా? ఇది తప్పా? లేక రైటా? అనేది విచారణచేసి ఏది మంచో దానినే అనుసరించాలి. మంచి అనగా ఏమిటి? ఏది నిత్యమో అది. దానిని మాత్రం అనుసరించాలి. చెడు అనగా ఏది? ఏది అనిత్యమో అది. దానిని విసర్జించాలి.
ఆహార పుష్టి
మంచి ఆహారం వుంటే చాలాకాలం బతుకుతాం అనుకుంటారు కొందరు. అదే నిజమైతే మంచి ఆహారం తీసికొనే వీలున్న సంపన్నులలో కొందరు అకాలంగా ఎందుకు మరణిస్తున్నారు? గంజికి నోచుకోని పేదవారు నిక్షేపంగా ఎలా జీవిస్తున్నారు? అంటే, మనిషి ఆయుస్సు ఆహారంపై ఆధారపడి లేదు. నిజానికి మానవుడు జీవించేది ఆహారపుష్టివల్ల కాదు. ఆత్మబలం వల్ల. వివేచన లోపిస్తే దేహబలంవల్ల ఏం వొరుగుతుంది?
ఉపకారం- అపకారం
మనం ఇతరులకు చేసిన ఉపకారమును మరిచిపోవాలి. లేనిచో ప్రతిఫలమును ఆశించడం జరుగుతుంది. దానివల్ల కొంత నిరాశానిస్పృహలకు గురికావలసి వస్తుంది.
అలాగే ఇతరులు మనకు చేసిన అపకారమునుకూడా మరచిపోవాలి. లేనిచో ప్రతీకారం తీర్చుకోవాలనే దుర్బుద్ధి మనలో ప్రవేశిస్తుంది.
ఆశ, నిరాశలు, ప్రతీకార వాంఛ-ఇవి మనస్సుపై తమ దుష్ప్రభావాన్ని చూపుతాయి.
మనిషిమనిషిగా జీవించాలంటే మంచిని పెంచుకోవాలి. అప్పుడే అతడు దివ్యత్వాన్ని అందుకోగలడు.
సత్యసాక్షాత్కారం
స్ఫటికాలను మాలగా గుచ్చితే, లోపలి దారం కనిపిస్తుంది. కాని రుద్రాక్ష మాలలో లోపలి దారం కనిపించదు. స్వచ్ఛమైన హృదయానికే సత్యం సాక్ష్కారిస్తుంది. కాని మలినమైన మనసుకు కాదు.
రుద్రాక్షమాలలో దారాన్ని చూడాలంటే రుద్రాక్షను బద్దలుకొట్టి చూడాల్సిందే. హిరణ్యకశిపుడు ఆ పనేచేశాడు. స్తంభాన్ని బ్రద్దలుకొట్టాడు. సర్వాంతర్యామి అయిన స్వామి దర్శనం అప్పుడు గాని అతనికి లభించలేదు. అతని మనసుపై (శాపకారణంగా) కప్పిన మకిల అంతటి గాఢమైంది.
‘స్వార్థ’వాహులు
స్వార్థం...స్వార్థం... ఏమిటి ఈ స్వార్థం? ఈ స్వార్థమంటే అర్థమేమిటి? స్వ+అర్థము= స్వార్థము. వ్యక్తియొక్క స్వార్థము కాదిది. ‘స్వా’అనగా ‘ఆత్మ’. ఆత్మను అర్థముచేసుకోవటమే స్వార్థము. స్వ...్భవము అనగా ఆత్మభావమే స్వభావము. ‘ఇది నా స్వభావము’అని అనేకమంది అనుకుంటారు. కాదు...కాదు...ఆత్మ స్వభావము నిర్మలమైంది, నిశ్చలమైంది. నిస్వార్థమైనటువంటిది. కనుకనే అట్టి ఆత్మతత్వాన్ని ఆనాటి యోగులు ‘‘నిర్గుణం, నిరంజనం, నిరామయం, నిరాకారం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపం’’అని వర్ణించారు. అట్టి విలువైన ‘స్వార్థమును’ ఈనాడు దేహభ్రాంతితో, దేహమునకు అవసరమైన విషయములను కోరటమే స్వార్థము అని భావిస్తున్నారు.
బొమ్మ-బొరుసూ
పక్షులు ఎంతో శ్రమపడి గూళ్లు కట్టుకుంటాయి. కాని గాలివానకు అవి కొట్టుకొనిపోతాయి. లలితమైన పూరేకులన్నీ వానకు వూడి పడిపోతాయి. సుఖదుఃఖాలు ఒకే నాణేనికి బొమ్మాబొరుసూ. ఒకటి కోరుకోగానే రెండోది అప్రయత్నంగా సిద్ధిస్తుంది. సుఖజీవితానికి సహనం, కరుణ, సచ్ఛీలం సోపానాలు. అవి వున్న జీవితమే నిజమైన నాగరిక జీవితం. కాని నగరాలలో వుండటంకాదు. అవి లేకపోతే బతుకు జంతుప్రాయమే.
అసలైన సంపద
ఈరోజుల్లో పాకురాళ్ల వంటి ప్రాపంచిక సుఖాలకోసం మనిషి డబ్బు పిచ్చిలో పడ్డాడు. అవసరాలకు కావలసిన ధనాన్ని సంపాదించుకోవాల్సిందే కాని, దానికి ఓ హద్దుంది. డబ్బుకోసం ఆధ్యాత్మిక విలువలను పోగొట్టుకొనకూడదు.
ఆస్తీ, బంగళాలు- యివొక్కటేనా సంపద? ఆత్మజ్ఞానం, సచ్ఛీలం, ఆధ్యాత్మికతత్వం- యివన్నీ అమూల్యమైన సంపదలే!
నశిస్తున్న విలువలు
ఈరోజు ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యం. కాని నైతిక విలువలనూ, ఆధ్యాత్మిక విలువలనూ పట్టించుకొనే వారేరి? సత్యం. ధర్మం, మంచితనం- ఇవి ఎప్పటికయినా జయిస్తాయి అన్న నమ్మకం జనంలో క్రమక్రమంగా సన్నగిల్లిపోతున్నది. మంచీ, చెడూ అన్న విచక్షణ తగ్గిపోయింది. పెద్ద చిన్న తారతమ్యం నశించింపోయంది. ఎవరు ఎవరికీ గౌరవం ఇవ్వరు. ప్రేమను అంతకుముందే చూపరు.అందుకే సాయి అవతరించాల్సి వచ్చింది.
ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.