సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం-ధర్మం
‘సత్యం నాస్తి పరో ధర్మః’- సత్యం కన్న ధర్మం లేదు. సత్యమూ, ధర్మమూ ఒకే నాణేనికి బొమ్మా, బొరుసూ మంచి శీలాన్ని పెంపొందించుకోటానికి సత్యమే పునాది.
రాముడు సత్యానే్న ధర్మానికి ముఖ్యాంగంగా భావించాడు. ఎన్ని కష్టనష్టాలు కలిగినా ఆయన సత్యం తప్పలేదు. ధర్మాన్ని విడువలేదు.
సత్యమే ధర్మం. ధర్మమే సత్యం. ఈ రెండూ పరస్పరం విడతీయరానివి. ఉపనిషత్తులు ‘సత్యం వద!’ ‘్ధర్మంచర!’అని చెబుతున్నాయి. సత్యాన్నీ, ధర్మాన్నీ తప్పని నీతిపరుడుగా రాముణ్ణి ఈ పర్వతాలూ, సముద్రాలూ ఉన్నన్నాళ్లూ, ప్రపంచం గుర్తుంచుకొంటుంది. ‘మా తండ్రిగారి మాటకు నేనెందుకు బద్ధుడిని కావాలి?’అని ఆయన వాదించి వుంటే, ఆయనకు ఈ అమరత్వం సిద్ధించేది కాదు. అమరత్వానికి దారి చూపడమే. సత్యాన్నీ, ధర్మాన్నీ ప్రతిష్ఠించటమే, అవతార ప్రయోజనం.
సత్యమే మూలం
సత్యానికీ, శాంతికీ, ప్రేమకూ, సామరస్యానికీ భారతదేశం మూలస్థానం. అనాదిగా ఈ ఆదర్శాలను ప్రబోధిస్తూ ఆచరించమని నొక్కి వక్కాణిస్తోంది. ఈ దేశం. భారత్ అంటే ఏమిటి? ‘్భ’అంటే భగవాన్. రతి అంటే అనురక్తుడుగా వుండటం. దేవుని యందు ప్రేమతో ఉండటమే భారతం. దేవుని యందు భయంకన్న ప్రేమ, భక్తి అవసరం.
సత్యమే ధర్మానికి ఆలంబన. సత్యమే ప్రేమకు మూలం ప్రేమకే కాదు శాంతికి కూడా. ఇదీ భారతదేశపు ప్రత్యేకత. సత్యం ఉంటే చాలు. ఇంకే దైవం అక్కరలేదు. ఏ పూజలూ అక్కరలేదు.
ధర్మపథం
వ్యక్తి అభివృద్ధిచెందాలన్నా, సమాజం ముందుకుపోవాలన్నా ధర్మమార్గాన్ని అనుసరించాలి. ఇహానికీ, పరానికీ కూడ ధర్మమే గతి. అదే లోపలా, బయటా, సూక్ష్మంగా, స్థూలంగా వర్తించేది. వ్యక్తులెంత గొప్పవారైనా, వారి యిష్టాయిష్టాలపై అది ఆధారపడి వుండదు. తమ సౌకర్యంకోసం దానిని మార్చుకోడం కుదరదు. ధర్మం తల్లి వంటిది. ఎలా ఉంటే అలా వొప్పుకోవాలి గాని నచ్చిన పిల్లను చూసి పెళ్లిచేసుకున్నట్లు, తల్లిని ఎంపిక చేసికోటానికి వీలౌతుందా?
ధరణిజ ధర్మం
కష్టాలలో వున్నవాళ్లను చూసి సానుభూతి చూపితే భగవంతుడనుగ్రహిస్తాడు. ద్రౌపది తన సౌశీల్యం, భక్తి కారణంగా ఆ భగవత్కృప పొందింది. సీత తనకు వచ్చిన కష్టాన్ని సరకు చేయకుండా ధర్మానే్న అనుసరించింది. ఆమెను రావణుడు ఎత్తుకొనిపోయి లంకలో దాచాడు. హనుమంతుడు ఆమెను వెదికి, కనుగొని, తన భుజాలమీద ఎక్కించుకొని భద్రంగా రాముని వద్దకు చేరుస్తానన్నాడు. కాని సీత అంగీకరించలేదు. హనుమకా సామర్థ్యంలేదనా? కాదు. అలాచేస్తే రాముడు రావణుని శిక్షించే అవకాశం పోతుందనీ, అలా దొంగతనంగా వెనక్కు వెళ్లటం తనకు తగదనీ చెప్పింది. ధర్మం అంతే.
ముక్తి సోపానాలు
మంచి పనులు చేయటం, పూజ, జపం, ధ్యానం, వ్రతాలూ, దీక్షలూ యివన్నీ ఆధ్యాత్మిక చింతనకు సోపానాలు. సదాలోచన, ప్రార్థన, వివేకం, పరోపకారం- యివీ అంతే. క్రమక్రమంగా నీ మనసును శుద్ధం చేసికో. బుద్ధిని సునిశితం చేసికో. భగవదనుగ్రహాన్ని సంపాదించుకో.
అంతేకాదు. గొప్ప పాండిత్యం, కీర్తీ, సంపదా వుండొచ్చు. కాని నేర్చుకోవలసింది మనిషికి ఎప్పుడూ ఎంతో వుంటుంది. తేనెటీగను చూడు. దానివలె చీకూచింత లేకుండా స్వేచ్ఛగా వుండటాన్ని నేర్చుకో. చెట్టును చూడు. అది తన పండ్లనూ, నీడనూ ఎవరికైనా యిస్తుంది. కులం, గోత్రం, జాతీ, మతం, వయసూ, లింగం- ఏదీ చూడదు. ఆఖరికి గొడ్డలి పెట్టి తనను నరికే వాడిక్కూడా అది తన నీడనిస్తుంది. దానిని చూసి అలాటి స్తిమితాన్నీ, సహనాన్నీ నేర్చుకో. కుక్కను చూడు. దానికెంత విశ్వాసం? యజమాని పట్ల దానికెంత అంకితభావం? తన ప్రాణాన్ని లక్ష్యంగా చేయకుండా తన యజమాని ఆస్తిపాస్తుల రక్షణకు ఎలా పోరాడుతుందో గమనించు. విశ్వాసంతో కూడిన అలాంటి సేవాభావాన్నీ నేర్చుకో.
అన్ని మతాలూ చూపే మార్గం
ఆవేశాన్ని అదుపుచేసికో, నీపట్ల ఇతరుల ప్రవర్తన ఎలా వున్నా, నీవు వారి పట్ల సౌమ్యంగా స్పందించు. సమరసంగా వర్తించు. ఇదే అన్ని మతాలూ బోధించే మార్గం.
నీ మనసునూ, నీ ఆలోచనలనూ నిరంతరం శోధనచేసికో. సన్మార్గులను చూసి నేర్చుకోవాలి కాని దుర్మార్గులను అనుసరించకు. ఎవరిని గురించి చెడుగా మాట్లాడకు. ఎవర్నీ చులకన చేయకు. నీ ప్రవర్తనవల్ల ఎవర్నయినా నీవు నొప్పిస్తే ఆ సంగతి నిన్ను చివరదాకా వెన్నాడి బాధించగలదు.
అసలు కుటుంబం
తండ్రిని చూసినంత భక్తిగా జ్ఞానాన్ని చూడు. తల్లివలె ప్రేమను గౌరవించు. సోదరునివలె ధర్మాన్ని ఆదరించు.ప్రాణస్నేహితునికి వలె దయతో కలిసిమెలసి మెలగు. అర్థాంగివలె శాంతాన్ని స్వీకరించు. సహనం నీ పుత్రుడని భావించు! యథార్థంగా నీ కుటుంబసభ్యులు వీరే, వారిని వదలకు. వారి వెంటే వుండు.

ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.