సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్నిలో ఆజ్యం
లాభమైనా, నష్టమైనా, సుఖమైనా కష్టమైనా గెలుపైనా ఓటమైనా మానవుడు మేరునగధీరుడై స్థిరంగా నిలవాలి. చలించరాదు. కోరికలను పాడమనిచ్చావా వాటికి బానిసవు కాక తప్పదు. ఒక కోరిక తీరుతూనే పది తలెత్తుతాయి. జ్వాలలో నేయివేస్తే చల్లారుతుందా?కోరికలు జారిపోయే మబ్బుల్లాటివి. అవి ఆత్మకు పట్టవు. ఆత్మను గురించీ నీలోని దైవత్వం గురించీ జాగృతి నీలో కలిగితే నినే్నం చేయలేవు.
కోరికలే బంధాలు
ఏమిటి ఈ కోరికలు? ఈ కోరికలు పెరిగిన కొలది మన బంధన అధికవౌతుంది. కోరికలు ఎంత తరిగితే మన బంధనలు అంత సడలిపోతాయి. కనుక బంధనలకు మన కోరికలే మూలకారణం. కోరికలు ఉండవలసినదే. కాని వాటిని కొంత పరిమితి ఉంటుండాలి. ఈ పరిమితిని మనం మించిపోయినప్పుడు మనం బంధనంలో చిక్కుబడిపోతాం.
ఆయన కరుణ
ఏదో ఒక కోరికను మనసులో పెట్టుకొని దేవుని ప్రార్థించటం కూడదు. ఏమిటి? దానర్థం ఏమిటి? నీవు ప్రార్థించేదాకా ఆయన నా అవసరాన్ని గమనించక కనిపెట్టుక్కూచుంటాడనేగా? ఆయన శరణు పొందు. నీకేది మంచిదో ఆయనకు తెలుసు. ఆయన ఏం చేసినా నీ మంచికే. ఆయనను నీ వెంత పొగిడితే అంతగా కరుణను నీపై వర్షిస్తాడని భావించటం తప్పు.
యథార్థమైన పూజ
భగవంతుని ఏవేవో కోరికలు కోరుతుంటారు. మొక్కులు మొక్కుతుంటారు. అవి తీరకపోతే విసుక్కుంటారు. అదంతా ఎందుకు జరుగుతోంది? దేవుడంటే ఎవరో పరాయి వాడనుకుంటున్నావు. కనుక దేవుడు బయటెక్కడో ఏ వైకుంఠంలోనో, ఏ క్షేత్రంలోనో లేడు. నీలోనే ఉన్నాడు. నీవు చేసే ప్రతి ఆలోచనలో ప్రతి చర్యలో ఆయన ఉన్నాడు. నీలోని దైవత్వానికి తగినట్లుగా నీవు ప్రవర్తించు. ఆయన నీకప్పగించిన పనిని నీ అంతరాత్మ తృప్తిగా సరిగా నిర్వహించు. అదే యథార్థమైన పూజ.
ఆత్మతృప్తి
మానవుడు మొదటి నుండీ కోరికలకు బానిసగానే ఉంటున్నాడు. తన కోరికలలో ఆత్మతృప్తికి దారితీసేవి ఏవి? విషయ వాసనలకు లోబడేవి ఏవి?అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇంటి వద్ద అందరూ అరమరికలు లేకుండా ఉండటం. ఇరుగు పొరుగుతో పొరపొచ్చాలు లేకుండా ఉండటం ఇతరులకు ఉపకారం చేయటం . సమాజ సంక్షేమం కోసం పాటుబడటం ఇలాంటి కోరికలన్నీ ఆత్మతృప్తిని కల్గిస్తాయి.
గులక రాళ్లు
మీరు ప్రశాంతి నిలయానికి యాత్రకు వస్తున్నారు. నన్ను ఆరాధిస్తున్నారు. కాని నేనొక సంగతి చెప్పక తప్పదు. ఏదో ఒక కోరికతో యిక్కడికి వచ్చి ప్రయోజనం లేదు. ఒక కోరిక తీరితే పది తలెత్తుతాయి. పరీక్ష పాసవాలంటారు. పాసయితే ఉద్యోగమంటారు. ఉద్యోగం దొరికితే పెండ్లి, పిల్లలు, ఆపైన ట్రాన్స్‌ఫర్లు, పిల్లలకు మెడిసిన్‌లో సీటు-యిలా కోరికలు కొండవీటి చాంతాడులా పెరిగిపోతుంటాయి. ఈ పరిస్థితిలో ప్రాపంచిక వ్యామోహాలనుండి విడిపడి ఆత్మవిచారంపై దృష్టి మళ్ళేదెప్పుడు? ముక్తి అనే అమూల్య రత్నాన్ని వదిలి చిల్లర కోరికలనే గులకరాళ్ల నేరుకుంటారెందుకు?
ఇక్కడికి వచ్చింది ఎందుకు?
మీకు కలిగే కోరికలను తీర్చుకోడానికి ఇక్కడదాకా రావటం ఎందుకు? దైవకృపకోసం అయితే యిక్కడకు రావాలి.
ఆసుపత్రికి పోతే డాక్టరు యిచ్చే మందు తీసికొనటానికీ, పథ్యపానాదులు పాటించటానికీ వొప్పుకొనేపోవాలి. ఇక్కడకు వస్తే నేను యిచ్చే ఆదేశాలను ఎవరేమన్నా సరే పాటించాలి. ఎంత కష్టమైనాసరే. వాటిని అనుసరించాలి. ప్రశాంతి నిలయానికి నీవు వచ్చింది ఎవరినో సంతోష పెట్టటానికి కాదు. నీవు ఆనందింపజేయాల్సింది వారినీ, వీరినీ కాదు, నన్ను! ప్రతిజీవిలోనూ నన్ను చూడు అంటే పరమాత్మను చూడు. జీవాత్మలో పరమాత్మ నివసిస్తూ పనులుచేయిస్తూ ఉంటాడు. దీన్ని గమనించు. అంతేకానీ వారు వేరు వీరు వేరుఅన్న భావాలతో సంకుచితంగా ప్రవర్తించవద్దు.

ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.