సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి
మకర సంక్రాంతి మనకు ముఖ్యమైన పండుగ. ఎందుకు? ఆనాడు మనం చీకటి నుండి వెలుతురులోకి వెళతాం. ఆనాటి నుండే సూర్యుడు దక్షిణాయనం వదిలి ఉత్తరాయణంలోకి నడుస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ఆర్నెల్లు.
జ్వరం పడ్డవాడికి ఏదీ సయించదు. అరుచినే దక్షిణాయనం అంటాం. ఆరోగ్యవంతుడికి అరుచి ఉండదు. జిహ్వ మధురంగా ఉంటుంది. అదే ఉత్తరాయణం.
మనం దైవ చింతనకై ఎప్పుడూ తీవ్రంగా తపిస్తామో అప్పుడే మనకు నిజంగా ఉత్తరాయణం వచ్చినట్లు.
ముందు మనసులలో మమత, అనురాగం పెంచుకోండి. లోభాన్నీ మోహాన్నివదిలేయండి. ఆత్మను అహం అంటకుండా చూసుకోండి. ఆత్మ దర్శనానికి యోగ్యత లభిస్తుంది. చిత్తం చిదానందం సేవ అనే దివ్య వాసనలతో గుబాలిస్తుంది.
విష కంటకాలు
మీ మనసుల నుండి విష కంటకాలను ఏరి పారేయండి. అందరి పట్లా ప్రేమను పెంపొందించుకోండి. కోరికే సుడిగాలి. పేరాశే సుడిగుండం. గర్వమే ఆఖాతం. వాసనలే వరదు. అహంకారమే అగ్ని పర్వతం. వీటిని దరిజేరనీయకండి. ప్రశాంత చిత్తంలో సేవ ధ్యానంలో చేయండి. అప్పుడేమీ కాంతి రేఖలు విరుస్తాయి. మలయ మారుతాలు వీస్తాయి. విశ్వాసం దృఢమై ఉరకలెత్తుతుంది.
దైవత్వానికి దారులు మూడు
సహృదయత, సానుభూతి, సహనం, తనలోనూ ఇతరులలోనూ కూడా దైవత్వాన్ని చూసేందుకు దారులు ఈ మూడే. దయార్ద్ర హృదయాన్ని జనం ఈనాడు బలహీనత కిందా, పిరికితనం కిందా అమాయకత్వం కిందా పరిగణిస్తున్నారు. జాలి గండె పనికిరాదట. గుండె రాయి చేసికోవాలట. కఠినమైన ఆ దోవన నడిస్తే తటస్థించేవి ఏమిటి? అశాంతి కల్లోలం, యుద్ధం, పతనం, నాశనం. శాశ్వత సుఖ శాంతులు లభించేది ప్రేమ వల్లనే. విచారాన్ని పంచుకొని తగ్గించవచ్చు. సంతోషాన్న పంచుకొని పెంచవచ్చు. మనిషి పుట్టింది తోటివారితో కష్టసుఖాలు పంచుకోవడానికి ఆర్తులను ఆదుకోవడానికీ దీనులను సేవించడానికి జీవిత పరమార్థం ఇవ్వడమే గానీ గుంజుకోవడం కాదు.
‘షో’షల్ వర్కు
సంఘసేవ ప్రదర్శన కోసం కాదు. ప్రచారం కోసమూ కాదు. సేవ అనేది కెమెరా వేపు చూస్తూ చేసేదికాదు. సోషల్ వర్క్ ‘షో’ షల్ వర్క్ కాదు ‘సో’షల్ వర్కూ కాకూడదు. మంచిపని చేసేటప్పుడు మందంగా ఎందుకు హుషారుగా, చురుగ్గానే చేయవచ్చు. శాయశక్తులా చేయవచ్చు. నీవు మంచి చేయలేకపోతే పోనీ, కనీసం చెడు చేయకు. సేవ చేస్తున్న వాళ్లకు వంకలు బెట్టకు అంతే చాలు.
అనుభూతి కావాలి
మనదేశంలోనూ, బయటా సంఘసేవకోసం ఎన్నో ట్రస్టులున్నాయి. అన్నిటిలోనూ సత్యసాయి ట్రస్టు తన ప్రత్యేకతను నిరూపించుకుని ప్రకాశించాలి. అంతా ఒకే మాటగా, ఒకే బాటగా పరస్పర విశ్వాసం సహకారం చిత్తశుద్ధి ప్రాతిపదికగా పని చేయాలి. అందుకు అంతా ఒకటే అన్న అనుభూతి ప్రత్యక్షంగా కలగటం అవసరం. ఇక్కడ ఎవరి గొప్పవారు చూపించుకొనేందుకు అవకాశం లేదు. బలవంతం లేదు. పదవి మీద ఆసక్తి ఉండరాదు. అధికారం కై పాకులాట కుదరదు. ఒకరి మీద వొకరు చాడీలు చెప్పుకోడం అసూయ పడటం తగదు.
ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.