సబ్ ఫీచర్

అలాంటివి ఎనె్నన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణయుగంనాటి ముచ్చట్లు ఎన్ని చెప్పుకున్నా తక్కువేననిపిస్తుంది. జర్నలిస్టు వృత్తినుంచి ఇండస్ట్రీకి వచ్చిన రావి కొండలరావు -పరిశ్రమలో ‘స్టార్’ స్థానానికి చేరకున్నా, స్టార్లను
వెలిగించే సినిమాను మాత్రం కాచి వడపోశారు. తనముందు తరానికి తలలో నాల్కలా.. తనతోవాళ్లకు
ఆప్తుడిలా.. తరువాతి తరానికి మంచిచెడ్డలు చెప్పగలిగే స్నేహితుడిలా.. ఆయన సాగించిన, సాగిస్తోన్న సినీ ప్రయాణం చిన్నదేంకాదు. అందుకే -తన అనుభవాలే కాదు, పరిశ్రమలో పదిమందికీ తెలీని చాలా చాలా విషయాలే ఆయన మస్తిష్కం నుంచి మనం సేకరించుకోవచ్చు.
అడిగిందే తడవుగా నాలుగు వారాలపాటు ఎనె్నన్నో ముచ్చట్లు, స్వగతానుభవాలు మన ముందుంచిన రావినుంచి మరిన్ని విషయాలు సందర్భానుసారం తవ్వుకుందాం. ఐదోవారంలో ఆయన చెప్తోన్న ముచ్చట్లను చదువుకుంటూ -స్వర్ణయుగంనాటి సినిమా విశేషాలు మళ్లీమళ్లీ నెమరేసుకుందాం.
మాయాబజార్‌లో నల్లరామ్మూర్తితో కలిసి కామెడీ పండించిన నటుడు చదలవాడ కుటుంబరావు. ఎన్నో చిత్రాల్లో తనదైన, వైవిధ్యమైన బాణీతో హాస్యం పండించాడాయన. తడికో తడిక.. అంటూ సాగే ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రంలోని పాటకు ఆయన చేసిన నృత్యం చూసినోళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. సహజంగా మంచి వ్యక్తి. ‘నేను సినిమాల్లోకి వెళితే -రమణారెడ్డి, రేలంగి వెళ్లిపోతారు’ అంటూ చెప్పేవారట. తరువాత సినిమాలోకి వచ్చారు కానీ, రేలంగి, రమణారెడ్డిని మాత్రం అధిగమించలేకపోయారు. చివరికి ఒకరోజు ఆయన తనపై తనే చమత్కారాన్ని విసురుకుంటూ ‘నేను వెళ్తే వాళ్లు వెళ్లిపోతారనుకున్నాను. కానీ, నేనే వెళ్లిపోయేలా ఉన్నా’ అంటూ చమత్కరించారట. చాలా సరదా మనిషి. చెప్పి పరిశ్రమకు ఎలా వచ్చారో, అన్నట్టుగానే పరిశ్రమ నుంచి అంతర్థానమయ్యారు. విజయవాడ దగ్గర ఒక ఊరు ఆయనది. అనేక చిత్రాల్లో కలిసి నటించడంవల్ల చాలా కలివిడిగా వుండేవాళ్లం.
ఓసారి జగ్గయ్య, భారతి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న ‘అర్ధరాత్రి’ షూటింగ్ చేస్తున్నాం. ఆ రాత్రి ఆయనతో షూటింగ్ చేశాం. పొద్దునే్న ఇంటికెళ్లాడు. చక్కగా స్నానం చేసి టిఫిన్ తిని కాఫీ తాగి పడక కుర్చీలో సేదతీరుతూ అలాగే ప్రాణం వదిలేశాడు. ఆయన చనిపోయిన సంగతి కూడా ఆ రోజు షూటింగ్‌కు వచ్చేదాకా మాకు తెలీదు. దర్శకుడు పి సాంబశివరావు ఏదోవిధంగా ఆయన లేని లోటును తీర్చేలా షూటింగ్ చేద్దామన్నారు. కానీ మా మనసుకు నచ్చలేదు. నిన్న మనతో కలిసివున్న వ్యక్తి ఈరోజు లేడంటే ఏదో బాధ అనిపించింది.
నేను విజయచిత్రలో పనిచేసేప్పుడు మూవీ మొఘల్ డి రామానాయుడితో ప్రశ్నలు- జవాబులు శీర్షిక నిర్వహించాం. ఓ పాఠకుడు మీకిష్టమైన నటుడు ఎవరు? అని అడిగితే నల్ల రామ్మూర్తి అని జవాబిచ్చాడాయన. ఆయనదీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో ఊరు. నేను ఇండస్ట్రీకి రాకముందే ఓసారి ఆయన్ని కలిసి ‘మీ ఇంటి అడ్రెస్ పంపియ్యండి. వచ్చి కలుస్తా’ అన్నాను. అందుకాయన ‘వేపచెట్టు పక్కనున్న పెద్ద అరుగుల ఇల్లు మనదే. అక్కడికి వచ్చి నల్ల రామ్మూర్తి అంటే చాలు. ఎవరైనా చెప్పేస్తారు’ అని జవాబిచ్చారు. అయినా మా ఊళ్లో ఇద్దరు నల్ల రామ్మూర్తులున్నారు. అయినా వాడు నాకన్నా ఏం తెల్లగా ఉండడండీ అని చెప్పడంతో అది జోకో, సెటైరో అర్థమయ్యేది కాదు. అలావుండేది ఆయన భాష. ఏమైనా అద్భుతమైన నటుడు. మంచి వ్యక్తిత్వం వున్నవాళ్లు అప్పటి నటులు.
పాతాళభైరవిలో బాలకృష్ణ ఒకవిధమైన సెటైరికల్ నవ్వుతో కనిపిస్తాడు. విలన్ ఎస్వీఆర్, రేలంగిని చూసినపుడు నవ్వే నవ్వది. ఇహి..హి..హి అంటూ సాగే ఆ నవ్వులో కేవలం ముందున్నపళ్లే కనిపించేలా నవ్వుతాడు. అది అతని స్టైల్. తొలినాళ్ళల్లో ఓ పౌరాణిక నాటకం చూసిన ఆయన, ఆ నవ్వును ఒంటబట్టించుకొని, తరువాత పాతాళభైరవి సెట్‌లో దర్శకుడు కెవి రెడ్డిముందు నవ్వి చూపించాడు. అది బాగుండటంతో కెవి రెడ్డి కూడా ఆ నవ్వును ఒప్పుకున్నాడు. ఆ నవ్వు అప్పట్లో ఓ సంచలనమైంది. పాతాళభైరవి చిత్రంలోనే అంజిగాడికి మాయా దుప్పటి, మాయా చెప్పుల జతనిచ్చే రెండు భూతాలుంటాయి. ఆ భూతాల పాత్రలు ఎవరు వేశారనేది ఇప్పటికీ చాలామంది చెప్పలేరు. అందులో ఓ భూతం తాతినేని ప్రకాశరావు, మరో భూతం ఎద్దు నాగేశ్వరరావు. నిజానికి రౌడీ పాత్రలకు ఎద్దు నాగేశ్వర రావు బాగా పనికొచ్చేవాడు. యోగి వేమన, భక్తపోతనలో కూడా ఆయన నటించాడు. కానీ ఎక్కడా అతను ఎద్దు నాగేశ్వర రావు అని తెలిసినోళ్లు చాలా తక్కువ. ఎద్దు నాగేశ్వరరావుది బాధాకరమైన కథ. ఏ సినిమాలోనైనా చిన్న రౌడీ, గూండా పాత్రలు వేసేవాడు. ఓసారి ఎంజిఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ రోజుకి షూటింగ్ పూర్తవ్వాలి. తరువాతి రోజునుంచీ ఎన్టీఆర్ చిత్రంలో నటించాలి. కానీ ఆ రోజు ఎంజిఆర్ చిత్రం పూర్తికాలేదు. రేపు కూడా షూటింగ్‌కి రమ్మన్నారు. కానీ రేపు ఎన్టీఆర్ షూటింగ్‌కు వస్తానని ముందుగానే మాటిచ్చాడు ఎద్దు నాగేశ్వరరావు. తెల్లారితే ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొనాలి. షేర్‌ఖాన్ గార్డెన్స్ దగ్గరుండే గుడిసెల్లో నివాసం వుంటాడు ఎద్దు నాగేశ్వరరావు. ఆ రాత్రి అటు ఎంజిఆర్ చిత్ర యూనిట్‌వాళ్లు, ఇటు ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన యూనిట్ వాళ్లు వచ్చి అతన్ని సందిగ్ధావస్థలో పడేశారు. రేపు మా షూటింగ్‌కు రావాలి, లేదంటే బాగుండదని ఒకరు బెదిరింపు, రేపుగాని మా షూటింగ్‌కు రాకపోతే నీ సంగతి చూస్తాం అని మరొకరు భయపెట్టారు. ఆ రాత్రంతా టెన్షన్‌తో నాగేశ్వరరావు ఏదీ తేల్చుకోలేకపోయాడు. తెల్లారేసరికి ఆ టెన్షన్‌లో హార్ట్‌ఎటాక్ వచ్చి చనిపోయాడు. అపుడు తెలుగు, తమిళ పరిశ్రమలో చిన్న చిన్న ఆర్టిస్టులంతా చాలా బాధపడ్డారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన మేనేజర్లు అలా భయపెట్టేస్తారు, చిన్న ఆర్టిస్టుల్ని. ఆ రోజు మేమందరం ఆ తాటాకుల పూరి పాక వద్దకెళ్లి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాం. చిన్న ఆర్టిస్టుల బాధలు నెమరువేసుకుంటూ మళ్లీ షూటింగ్‌కు వచ్చాం. అది మర్చిపోలేని విషయంగా నాకెప్పుడూ గుర్తుంటుంది.
సువర్ణసుందరి చిత్రంలో రాక్షసుడిగా నటించింది లక్ష్మయ్య చౌదరి. అటువంటి పాత్రలుంటేనే అతన్ని పిలిచేవారు. అతని కొడుకు పూర్ణ. ఎన్టీ రామారావుకు పర్సనల్ కాస్ట్యూమ్స్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఇంకా పొట్టి ప్రసాద్, చిడతల అప్పారావు లాంటివాళ్లు ఎంతో అద్భుతమైన ప్రతిభగలవారు. ఒక్కొక్కసారి అటు షూటింగ్ వుండేది, విజయచిత్ర పత్రిక పని ఉండేది. అందుకని ఓ వైపు మేకప్‌తో సెట్‌లో నటించి, అదే మేకప్‌తో పత్రికా ఆఫీసుకు వచ్చి ప్రూఫ్ రీడింగ్ గట్రా చూసుకునేవాణ్ణి. ఒక్కోరోజు ఒక్కో మేకప్‌తో వెళితే, అక్కడున్న మా బృందం ఎంతో ఆనందపడేవాళ్లు. అలా ఎన్నో అనుభవాలు. ఎన్నో ముచ్చట్లు. చెప్పుకుంటే చాలా వుంటాయి అంటూ ముగించారు ఆయన.
*
కాచి వడపోశాడు
సినిమాలలో గొప్పగా ఎస్వీఆర్‌లాగో, నాగభూషణంలాగో చెప్పను కానీ ఒకరకంగా సినీ పరిశ్రమను కాచి వడపోశాడు ఆయన. ఎవరితో ఎంతగా ఎలా మాట్లాడాలో అంతే మాట్లాడటం తెలిసినవాడు. బాగా చదువుకున్నవాడు. చక్కగా తెలుగు భాష తెలిసినవాడు కనుక పెద్ద పెద్ద దర్శకులంతా ఆయనతో మాట్లాడేవారు. దాదాపు అన్ని చిన్న చిన్న పాత్రలే వేశారు. మామగా, మేనల్లుడిగా, బావమరిదిగా, సూర్యకాంతం భర్తగా, తమ్ముడిగా, హేమలతమ్మ కొడుకుగా, రాజబాబు తండ్రిగా.. ఇలా ఎన్నో వేషాలు. కానీ ఎక్కడా ఎవరితో ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆయన గొడవపడ్డట్టు ఏనాడూ వినలేదు. అందరితో స్నేహభావమే. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసినవ్యక్తి. సినిమా పరిశ్రమను కాచి వడపోశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. నలుగురిలో కూర్చున్నపుడు దేనికి ఎంత నవ్వాలో అంతే నవ్వి చిన్నగా జారుకునేవాడు. ఆయన అక్కడ కూర్చోడు. అలా తన గురించి తాను తెలుసుకుని గొప్ప నటుడు అని చెప్పనుగానీ గొప్ప మనిషైపోయాడు. కథల గురించి మాట్లాడతాడు. స్క్రీన్‌ప్లే గురించి చెప్పగలడు. మాటలు రాయగలడు. అద్భుతంగా జర్నలిజంలో రాణించాడు. చిన్నప్పుడు వాళ్ల మాస్టారు చేసిన ‘అనప్పాదు’ అనే మాటను తీసుకొని మా అందరికీ వినోదం పంచేవాడు సెట్స్‌లో. అద్భుతంగా నవ్వించేవాడు. ఎక్కడికి పోయినా ఆయన ఉన్నాడంటే హాయిగా నవ్వుకునేవాళ్లం. అలా అన్ని సంవత్సరాలపాటు పరిశ్రమలో వుండడం, అదీ తామరాకుమీద నీటిబొట్టులా, అన్ని సినిమాల్లో పనిచేయడం ఆయనకే చెల్లింది. చాలా చిత్రాల్లో నటించాడు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్నాడు. ఓ రకంగా పరిశ్రమలో వారిది నిలువుఈత కదండీ! సినిమా సముద్రంలో ఇంకా ఈదుతూనే ఉన్నాడు. ఆయన ఎక్కడా ఖాళీగా కూర్చోడు. సినిమాలు చేస్తాడు, నాటలు వేస్తారు, విజయచిత్రకు రచనలు అందిస్తారు, అలా కష్టజీవిగా మాకు బాగా తెలుసు. ఆయనకు తగ్గట్టు ఆయన జీవిత భాగస్వామి కూడా దొరికింది.
-వాణీశ్రీ
*
పాలిష్డ్ హాస్యానికి
కేరాఫ్ రావి
రావికొండలరావు సెట్‌లో వున్నాడూ అంటేనే మాకు ఆ రోజు ఉత్సాహం వచ్చేసేది. మంచి వక్త. మంచి నటుడు. మంచి రచయిత. వందలాది చిత్రాల్లో నటించాడు. కామెడీ అయినా, విలనీ అయినా, కారెక్టర్ ఆర్టిస్టు అయినా, పురాణ పాత్రలైనా మెప్పించాడు. మంచి క్వాలిఫికేషన్స్ వున్నాయి. ఇప్పుడున్నవాళ్ళల్లో సీనియర్ మోస్ట్ ఆయనే. వివిధ రకాల పాత్రల్లో నటించినా, ఆయన ముద్ర ఆ పాత్రకు ఉంటుంది. ఒకరకంగా ఆల్‌రౌండర్. పాలిష్డ్ హాస్యనటుడు. ఆయన జోక్స్ వేసినా చాలా పాలిష్డ్‌గా వుంటాయి. అనేక పుస్తకాలు రాశాడు. ఇంత గొప్ప వ్యక్తి ఓ పద్మశ్రీగానీ, ఓ గౌరవంగానీ దొరకలేదు. ప్రపంచంలో భార్యాభర్తలు కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించిన రికార్డు వారిద్దరికే వుంది. నాటకాలు కూడా ఇద్దరూ కలిసి వేసిన రికార్డు కూడా వారిదే. ప్రతిభకి గుర్తింపు రావాలండీ!
-జమున
*

-సరయు శేఖర్, 9676247000