సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్తులను సేవించు
ఎదురుగా కనిపిస్తున్నది ఏమిటి? తోటి మానవులు పడుతున్న దుఃఖం నీలో దానికి స్పందన కలగకపోతే అధి వ్యాధులనూ, అపమార్గం పట్ట్ధోరణులనూ గట్టి పట్టుదలతో దీక్షతో ఎదుర్కొనగలవా? కనిపించే వాటినే ఎదుర్కోలేకపోతే కనపడని దేవుని ఎలా కనుగొంటావు? అందుకు కావలిసిన పట్టుదల, దీక్షా నీకెలా సమకూరుతాయి? జీవుని ప్రేమించని వాడు దేవుని ప్రేమించగలడా? సాటి మనిషిని ద్వేషిస్తూ దేవుని ప్రేమించటం సాధ్యం కాదు.
మీరెవరైనా రోగికి ఉపచారం చేయండి. బాధ నెమ్మదించేలా చూడండి. ఆ సేవ నాకే చెందుతుంది. ఎందుకని? వాళ్ల హృదయాలో ఉన్నది నేనే కదా!వాళ్లు ఆర్తిగా పిలిచేది ననే్న కదా.
దేవునికి మీ సపర్యలెందుకు? ఆయనకేం కాలునొప్పా, కడుపు నొప్పా? దరిద్ర నారాయణుడి సేవ చేయండి. శ్రీమన్నారాయణునికి కావాల్సినంతమంది పరిచారకులు ఉంటారు. ఆయనకు ఎవరూ సేవలు చేయనవసరం లేదు. బీద నారాయణునికే సేవలు చేయాలి. ఇలాం టి పవిత్రమైన భావాన్ని మీ హృదయంలో నాటుకొని దానినే పెద్ద వృక్షంగా పెంచుకుని దాని ఛాయ లోపల, చల్లగా, ఆనందంగా సేవా దృక్పథంతో జీవితం గడపటానికి ప్రయత్నించాలి.
అన్నీ ఉన్నా అంగహీనుడు
తులసీదాసు చెప్పాడు. ‘ నాకు చేతులున్నాయి. కాళ్లున్నాయి. కండ్లున్నాయి. అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఓ రామా! నేను అంగహీనుడను. ’ అని, దీని అంతరార్థమేమిటి ? చేతులుండి ప్రయోజనం ఏమిటి? నీ సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి చేతులుండి ఏం లాభం? నిన్ను కన్నులారా దర్శించుకోవడానికి నా కళ్లు సహకరించడం లేదు. నిన్ను కన్నులారా దర్శించుకోలేకపోతున్నాను. కాళ్లుండీ నీ దగ్గరకు రాలేకపోతున్నాను. కాబట్టి నిన్ను సేవించనటువంటి అంగములు ఉండి కూడా నిరుపయోగములే అవుతున్నాయి కనుక నేను అంగహీనుణ్ణి అని తులసీదాసు అన్నారు.
దైవ కృప
మనిషి ఎంతోధనాన్ని సముపార్జించుకోవచ్చు. ఎన్నో ఓట్లను సంపాదించుకోవచ్చు. టన్నుల కొద్దీ బాధలతో, బరువులతో , బాధ్యతలతో తన తలను బరువెక్కించుకోవచ్చు. కాని అది జీవిత పరమార్థం కాదు. మానవుడు సద్గుణాలను అలవర్చుకోవాలి. ధర్మానికి బద్ధుడు కావాలి. తన జీవితం గడపటానికి ఎంద ధనం కావాలో అంతే మనిషి న్యాయంగా సంపాదించుకోవాలి అని శ్రుతులు చెప్తున్నాయి. మిగిలిన సమయాన్ని మానవుడు సమాజ సేవ కోసం వినియోగించుకోవాలి. అర్థాన్ని ధర్మమార్గంలో సంపాదించాలి. అపుడే దైవ కృప పుష్కలంగా లభిస్తుంది.
సేవకులే అంతా
ఒకానొక దినమున రాజును చూడటానికి వచ్చాడు అతని పాతమిత్రుడు. ఏం చేస్తున్నావని అడిగాడు రాజు. ‘రాజా! నేను బీదవాడిని. కడుపునిండా తినటానికి తిండి లేక అనేక అవస్థలు పడుతున్నాను. జగత్తులో అందరూ ఏదో ఒకరీతిలో దాసులుగా ఉంటున్నారు. ఏదో ఒకదానికి లొంగిపోతున్నారు.’అన్నాడు ఆ మిత్రుడు. రాజుకు కోపం వచ్చింది.
‘నేను సర్వాధికారిని. నేను ఎట్లా దాసుడనవుతాను. నాకు అనేకమంది పరిచారకులున్నారు ’అన్నాడు రాజు. ఆ రాజుకు చక్కగా అర్థమయ్యేరీతిలో చెప్పాలనే ఉద్దేశంతో తన చేతిలో నున్న కర్రను క్రింద పడేశాడు ఆ మిత్రుడు. వంగి ఆ కర్రను తీసుకోలేక పోతున్నాడు. ఆధారంగా ఉన్న కర్ర పోయిందే యని బాధపడుతున్నాడు. ఆ పరిస్థితిని చూచిన ఆ రాజు వంగి, క్రింద పడిన కర్రను తీసుకొని, మిత్రునకు అందిస్తాడు.‘రాజా! ఇప్పుడు నాకు నీవు దాసుడవు’అన్నాడు ఆ మిత్రుడు. ‘ఎందుకంటే నాకు నీవుకర్రను అందించావు. నాకు సేవ చేశావు. ఇదే సేవత్వములో ఉండినటువంటి అంతరార్థము ’అని వివరించాడు మిత్రుడు. రాజుకు జ్ఞానోదయం అయింది.
ఇంకా ఉంది
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.