సబ్ ఫీచర్

మానవ శరీరాల్లోకి మైక్రో ప్లాస్టిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటిదాకా జల వనరులు, భూమి పొరల్లో, గాలిలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలా పేరుకుపోతున్నాయి? వాటి దుష్ప్రభావం ఏమిటి? అనే అంశాలపై ఎనె్నన్నో అధ్యయనాలు జరిగాయి. పర్యావరణవేత్తలను, పరిశోధకులను కలవరపెడుతున్న విషయం మరొకటి ఉంది. అదేమిటంటే మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ శరీరాలలో ఎలా, ఏమేరకు పేరుకుంటున్నాయి, మానవుల ఆరోగ్యం, జీవన క్రియలపై వాటి ప్రభావం ఎలా ఉంటోంది అన్నదే. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సేకరించిన కుళాయి నీళ్ళ శాంపిళ్ళలోను, జల చరాలలోను, సముద్రపు ఉప్పులోను మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశోధకులు గుర్తించారు. వివిధ సౌందర్య సాధనాలు, టూత్ పేస్ట్ వంటి వాటిలో కూడా మైక్రోప్లాస్టిక్ పదార్థాలను గుర్తించారు. వీటి ద్వారా ఈ వ్యర్థాలు మానవుల శరీరాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది కదా. మనం పీల్చే గాలి ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మన దేహంలోకి చేరుతున్నాయి. ఇదంతా శాస్తవ్రేత్తల పరిశీలనలోకి వస్తున్న విషయం. మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలవల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేకపోయినా, వాటి కారణంగా భవిష్యత్తులో మానవులు ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యల గురించి శాస్తవ్రేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మానవుల ఆరోగ్యంపై మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు చూపే దుష్ప్రభావంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముందు ముందు ఈ వ్యర్థాలు పర్యావరణంలోను, తద్వారా మానవ శరీరాలలోను ఇంకా ఎక్కువ మోతాదులో పేరుకుంటాయి. ఫలితంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కూడా. ఆధునిక మానవ జీవితంలో విడదీయలేని భాగమైపోయింది ప్లాస్టిక్. ఉదయం నిద్ర లేవగానే ఉపయోగించే టూత్ బ్రష్ దగ్గర్నుంచి అత్యాధునిక సాంకేతిక పరికరాలైన కంప్యూటర్‌ల వరకు, చివరికి వైద్య చికిత్సలో ఉపయోగించే పరికరాలలో కూడా ప్లాస్టిక్ వాడకం సాధారణమైపోయింది. ప్లాస్టిక్ వాడకం లేని ఆధునిక మానవ జీవనాన్ని ఊహించడం అసాధ్యమే. అందువల్ల ప్లాస్టిక్ వ్యర్థాలే కాదు, అందుకు కారణమైన ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తులను, వాటి వాడకాన్ని నివారించడం లేదా వ్యర్థాల రీ సైక్లింగ్ కూడా మన ముందున్న పెద్ద సమస్య, సవాలు కూడా. మానవుల ఆరోగ్యంపై, పర్యావరణంపై దుష్ప్రభావం చూపని ప్లాస్టిక్ తయారీ లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై కొందరు పరిశోధకులు దృష్టి పెడుతున్నారు.
అసలు ప్లాస్టిక్ అన్నది పాలిమర్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. పాలిథిన్, పాలీప్రోపైలిన్, పాలిస్టర్ వంటివి ప్లాస్టిక్ ఉత్పత్తులకు కొన్ని ఉదాహరణలు. ఈ ఉత్పత్తులు ఏ అవసరాలకైనా, ఎంతకాలమైనా వినియోగించేందుకు వీటి తయారీలో కొన్ని రసాయనాలను చేరుస్తారు. ఈ రసాయనాల వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని విషపూరితం చేస్తున్నాయి. మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలలోను, శీతల పానీయాలలోను మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. దీనర్థం ప్రపంచవ్యాప్తంగా ఈ పదార్థాలలో మైక్రోప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయని కాదు. కానీ ఒకసారి ఆహార పదార్థాలు కలుషితం కావడం మొదలైందంటే అది అక్కడ ఆగదు కదా. అందువల్ల ఈ విషయంలో మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉంది.
చాలా ప్రదేశాలలో మార్కెట్లలోను, పెద్ద పెద్ద స్టోర్లలోను అమ్మే చేపల కణాలలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు వెల్లడవుతోంది. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, చైనాలలో అమ్ముడయ్యే సముద్రపు ఉప్పులో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా మోతాదులోనే ఉన్నట్లు గుర్తిస్తున్నారు.
పెద్ద మొత్తంలో డంప్ అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల జలచరాల మనుగడకు ప్రమాదం ఏర్పడుతున్నప్పటికీ, సాగర జలాలకు గాని, ఇతర స్వచ్ఛ జల వనరులకు గాని ఎలాంటి రసాయనిక పరమైన ముప్పులేదని శాస్తజ్ఞ్రులు భావిస్తూ వచ్చారు. కానీ ఇది తప్పని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. డంప్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి అలానే ఉండడంవల్ల వాటి నుంచి వెలువడే రసాయనాలు సముద్ర జలాలను, ఇతర జలవనరులను కలుషితం చేస్తున్నాయని శాస్తజ్ఞ్రులు గుర్తిస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వెలువడే కొన్ని రకాల రసాయనాలు..
పోలిక్లోరినేటెడ్ బైఫెనిల్స్: ఇవి కృత్రిమ రసాయనాలు. వీటి తయారీని ఇప్పుడు అమెరికాలో నిలిపివేశారు. ప్లాస్టిక్ తయారీలో వీటిని వాడడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు ఈ రసాయనాలు కూడా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇవి చాలా రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఈ రసాయనాలను క్యాన్సర్ కారకాలుగా గుర్తించారు.
పోలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్: ఈ రసాయనాలు అంత త్వరగా శిథిలమై ప్రకృతిలో కలిసిపోవు. ఈ రసాయనాలను కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల తయారీలో కలుపుతారు. ఇవి కూడా ప్రధానంగా కాన్సర్ వ్యాధి కారకాలే.
కొన్ని రకాల పురుగు మందులు: కొన్ని పురుగు మందులను కూడా ప్లాస్టిక్ ఉత్పత్తులలో వాడతారు. ఇవి మన హార్మోన్లపై ప్రభావం చూపే స్థాయిలో ఉంటున్నాయి.
మనం తినే ఆహారం ద్వారా, మనం తాగే మంచినీళ్ళ ద్వారా మైక్రోప్లాస్టిక్ పదార్థాలు మన శరీరాలలోకి చేరుతున్నాయని పరిశోధకులు వెల్లడి చేస్తున్నారు. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ పదార్థాలలోని రసాయనాలు మనకు ఏ విధంగా చేటు చేస్తున్నాయన్న విషయంపై వారు ఇంకా దృష్టి పెట్టలేదు. మన శరీరాలలోకి ప్రవేశించిన మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలవల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని నిర్థారణ చెయ్యడానికి శాస్తవ్రేత్తలు లోతైన పరిశోధనలు చెయ్యాల్సి ఉంది.
* మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మన శరీరంలో కరిగి కలిసిపోవు. వాటినుండి వెలువడే రసాయనాలు మన శరీరంనుండి బయటికి పోవు.
* మన శరీరంలోనే కరిగి కలిసిపోకుండా ఉన్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మనలోని సహజ జీవనక్రియ దెబ్బతినే అవకాశం ఉంది.
* మన శరీరంలోనే కలిసిపోకుండా ఉన్న మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వెలువడే రసాయనాల వల్ల దీర్ఘకాలంలో మనకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
* మన శరీరంలో పేరుకుంటున్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఇప్పటికిప్పుడు మనకి వచ్చిన ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కానీ వాటి మోతాదు పెరుగుతున్నకొద్దీ మన శరీరంలో అవి సమస్యలు సృష్టించే అవకాశం లేకపోలేదు.
* బయట మన కళ్ళకి కనిపించే ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలకన్నా మన శరీరంలో పేరుకునే మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ వ్యర్థాలవల్లే ఎక్కువ ప్రమాదం ఉందని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. నానో ప్లాస్టిక్ వ్యర్థాలు మన శరీరంలోని కణాలలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందని రసాయన శాస్తజ్ఞ్రులు అంటున్నారు.
ఇప్పటికిప్పుడు చూస్తే మన శరీరాలలో పేరుకున్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్య చాలా తక్కువే. అందువల్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అసలు సమస్య ఏమిటంటే మైక్రోస్కోపిక్ వడపోతకు కూడా చిక్కకుండా అతి సూక్ష్మంగా ఉండే ఈ వ్యర్థాలను మన శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడం అసాధ్యం. మనం ఏమీ తినకపోయినా, తాగకపోయినా సరే మనం పీల్చే గాలి ద్వారా ఈ వ్యర్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.
మన శరీరాలలోకి మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు ఏవిధంగా ప్రవేశిస్తున్నాయన్న విషయంపై ఇటీవలి కాలంలో జరిగిన అధ్యయనాలలో ఆందోళన కలిగించే వివరాలు వెలుగుచూశాయి. ఒకవేళ ఈ వ్యర్థాల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయో భవిష్యత్తులో శాస్తవ్రేత్తలు కనిపెట్టినా అప్పటికే పరిస్థితి చేజారిపోతుందని ఈ అధ్యయనాల మేరకు తెలుస్తోంది.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690