సబ్ ఫీచర్

పోషకాల్లో వెరీ‘గుడ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలు సమృద్ధిగా కలిగిన, చవకగా దొరికే ఆహారం ఏదైనా ఉందా? అంటే- అది ‘గుడ్డు’ అని వెంటనే చెప్పేయవచ్చు. గుడ్డు చూడటానికి చిన్నగానే ఉంటుంది. అయినా ఇది సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో రెండో శుక్రవారాన్ని ‘ప్రపంచ గుడ్డు దినోత్సవం’గా జరుకుంటారు. ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఇఐసి) 1996లో వియన్నాలో జరిగిన అన్ని దేశాల ప్రతినిధుల సదస్సులో ‘ఎగ్ డే’ను ప్రకటించింది. ‘గుడ్ల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్దేశించినది రజిత విప్లవం’ (సిల్వర్ రివల్యూషన్) అంటారు. కోడిగుడ్డు పొదిగే కాలం 21 రోజులు. గుడ్లకోసం పెంచే కోళ్లను ‘‘లేయర్స్’’ అంటారు. మాంసం కోసం పెంచే కోళ్లను ‘బాయిలర్స్’ అంటారు.
కోళ్లు చలికాలంలో గుడ్లు ఎక్కువగా పెడుతాయి. గుడ్ల వాడకాన్నీ, దానిలోని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు తెలియజేస్తూ ఏటా ‘ఎగ్‌డే’ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో గుడ్డు వాడకం అధికమే. గుడ్డును పలురకాలుగా ఆహారంగా తీసుకుంటారు. పిడికెడంత గుడ్డు ఆరోగ్యానికి పెట్టని కోట అని, ఇతర ఔషధాలకన్నా, ఆహార పదార్థాలకన్నా చేత శ్రేష్ఠమని పరిశోధనలు చెపుతున్నాయి. ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ, కోడి మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్న భారత్ అతి సమీప కాలంలో అగ్రస్థానానికి చేరుకోగలదని ఆశాభావాన్ని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. గుడ్లు, మాంసం లేదా రెండింటి ఉత్పత్తికోసం పెంపుడు రకం కోళ్లు, నెమళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, అడవి బాతులు, పావురాలు, ఈము పక్షుల పెంపకాన్ని ‘పౌల్ట్రీ’ అంటారు. భారతదేశ నవీన పౌల్ట్రీ పితామహుడు డా.బి.వి.రావు.
గుడ్డు తింటే లాభాలెన్నో..
* మెదడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి.
* గుడ్డుని తినడం వలన కండరాలు దృఢంగా అవుతాయి. ఇది క్రీడాకారులకు మంచి ఆహారం.
* గుడ్డులో ఉన్న రైబోప్లేవిన్ చర్మం ఆరోగ్యానికి, సరిగా జీర్ణం కావడానిక దోహదపడుతుంది.
* గుడ్డులో బి12 (సయనోకో బాలియన్) అనే విటమిన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందడానికి, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
* గర్భవతులకు గుడ్డు చాలా ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే ఫోలిక్ యాసిడ్ ఇనుము పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
* హార్మోన్లు, ఎంజైములు సక్రమంగా విడుదలవాలంటే ప్రోటీన్లు అవసరం. అందుకు రోజుకో గుడ్డు తినడమే మార్గం.
* వారానికి కనీసం నాలుగు గుడ్లు తింటున్నట్లయితే డయాబెటిస్ దరి చేరదని తాజా ఫలితాలు చెప్పాయి. తెల్లని సొన తినడం మంచిది.
* కంటి దోషాలు రాకుండా చేసే ఎ,ఇ విటమినులు, జింక్, సెలీనియం గుడ్డులో ఉన్నాయి. ఇవి కంటి జీవకణాన్ని రక్షించి పోషిస్తాయి.
* బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది.
* గుడ్డులోని తెల్లసొన ప్రధానంగా నీరు (87 శాతం) మరియు సరైన నిష్పత్తితో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కలిగిన ప్రొటీన్ (13 శాతం) ఉంటుంది.
* ఒక గుడ్డులో లభించే శక్తి 78 క్యాలరీలు.
*ప్రతి రోజూ ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే గుండెపోటు వచ్చే అవకాశాలు 12 శాతం తగ్గుతాయట. ఈ విషయం అమెరికా శాస్తవ్రేత్త ప్రొఫెసర్ డామినిక్ చేసిన పరిశోధనలో వెల్లడైందట.
ప్రజలు కోడిగుడ్లను ఆహార పదార్థంగా వాడటం అనాదిగా వస్తుంది. పోషకాహార లేమిలో బాధపడే వారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటాం. గుడ్డును పలావులో, బిర్యానీలో రుచికోసం వాడతారు. బేకరీ ఉత్పత్తుల్లో కూడా గుడ్డును వాడుతారు. గుడ్డును ఆమ్లెట్‌గా, ఎగ్‌ఫ్రైగా, కూరగా వాడుతారు. పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతో మంచివి.
పట్టులాంటి కురుల కోసం
* కురుల పోషణకు గుడ్డులోని పోషకాలు బాగా ఉపయోగపడతాయి.
* చివర్లు చిట్లిపోడవం పొడి బారిన జుట్టుకు గుడ్డు అప్లైచేసి షాంపూతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
* దుమ్ము, ధూళి వల్ల పాడైన జుట్టుకు పూర్వస్థితి రావాలంటే వెన్నతీసిన పాలలో గుడ్డు సొన కలిపి జుట్టుకు పంపించాలి. అరగంట తర్వాత కడిగేస్తే కురులు పట్టులా మెరుస్తాయి. గుడ్డు ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో సౌందర్యాన్ని కూడా అంతే పదిలంగా కాపాడుతుంది. చర్మానికి, కురులకు గుడ్డువల్ల చేకూరే లాభాలు బోలెడున్నాయి.
* చర్మ సౌందర్యానికి గుడ్డులోని ‘లూటిన్’ అనే పదార్థం చర్మం సాగే గుణాన్ని రెట్టింపు చేసి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.
* ఎండ, కాలుష్యం కారణంగా దెబ్బతిన్న చర్మానికి గుడ్డులోని పచ్చసొనలో చెంచా తేనె, పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం మృదువుగా మారుతుంది.
* గుడ్డులో విటమిన్ సి, పీచు పదార్థం తప్పించి అన్ని పోషకాలు ఉంటాయి.
* గుడ్ల ఉత్పత్తిలో చైనా, అమెరికాలు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.
* గుడ్డు బరువు సాధారణంగా 50-70 గ్రాముల వరకు ఉంటుంది.
* గుడ్డులో మన శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్లన్నీ ఎక్కువగా లభిస్తాయి. మాంసకృత్తుల విలువలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే అంటారు.
ప్రతి భారతీయుడు సగటున ఏడాదికి 43 గుడ్లు తాంటున్నాడట. అదే జపనీయులైతే 346 తింటున్నారట. ఈ ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. గుడ్డు ఖనిజాల గని, శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే బయోటిన్ గుడ్డులో లభిస్తుంది.
ఒత్తిడిని తగ్గించే శక్తి జ్ఞాపకశక్తి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. హైదరాబాదు నగరంలో రోజుకు 51 లక్షల గుడ్లు వినియోగిస్తున్నారు. నిత్యం కోటి కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని జాతీయ గుడ్ల సమన్వయ సమితి (ఎన్‌ఇసిసి) తెలిపింది. తెల్లని సొనని బాగా గిలకొట్టి కేక్‌ల తయారీలో వాడుతారు. గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానాన్ని, చేరువలో ఉండటం హర్షణీయం. సాలీనా గుడ్ల వినియోగం 60 ఉండటం కూడా హర్షణీయం. అందుకే గుడ్డు, వెరీగుడ్డు అనీ పోషకాల రారాజు అనీ, అందుకే గుడ్డు వాడకాన్ని ప్రచారం చేద్దాం.

- కె.రామ్మోహన్‌రావు, 9441435912