సబ్ ఫీచర్

సేంద్రియ సేద్యం మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార పదార్థాలలో కల్తీలవల్ల ఎంతోమంది రుగ్మతల పాలవుతున్నారు. దుకాణాలలోని అద్దాల అల్మారాలలో చూడగానే కళ్లు మిరుమిట్లు గొలిపే తయారీ వంటకాలు, పిజ్జాలు, బర్ఫీలు, గోబీ మంచూరియాలు అప్పటికప్పుడు రుచికరంగా తోచినా వాటి తయారీకి వాడిన పదార్థాలలో కల్తీలతో కూడిన విష రసాయనిక శకలాలు ఏదో రూపంలో చొచ్చుకెళ్ళి బలవర్ధకం కోల్పోయి శరీర జీర్ణప్రక్రియలో ఏదో ఒక రోగానికి కారకమవుతోంది.
రసాయనిక ఎరువులు మితిమీరి వాడిన వరి ధాన్యంలో, కాయగూరలు పండించే విధానంలో చీడపీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందులు, ప్రజలు ఎక్కువగా ఉపయోగించే సాంబారు, వేపుళ్లు, ఇతరత్రా వంటకాల వినియోగంలో టమోటో కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. నాటి మొక్కలకు సాలువేసి, పూత, పిందె నుండి రసాయనిక ఎరువుల వినియోగం, పిందెలను, కాయలను తొలిచే ఊజీ పురుగుల నివారణకు వాడే క్రిమిసంహారక మందుల శకలాలు పూర్తిస్థాయిలో టమోటో నుండి విడిపోక అలానే నిల్వలుండి పోతుంది. అలాంటి కాయలను నీటితో కడిగి పైపైన శుభ్రం చేసినంత మాత్రాన అవి తొలగిపోవు. అలాగే ఆకుకూరలు ఏపుగా పెరగాలని రసాయనిక ఎరువులు ఉపయోగించిన కూరగాయలు ఆకుకూరలలో సైతం రసాయనాల ఉనికి పొడగిట్టకపోయినా అందులో కొంత శాతమైనా విష రసాయనాలు నిక్షిప్తమై వండిన కూరలద్వారా మానవ శరీరంలో రుగ్మతలకు గురిచేస్తుంటాయి. బియ్యం మరింత తెల్లగా మిలమిలలాడుతూ కనిపించాలని మోతాదుకు మించిన పాలిష్ చేయించడంవల్ల విలువైన విటమిన్లు పాలిష్ తవుడులో కలిసిపోయి, ఏమాత్రం బలవర్ధకం కాని అన్నం మిగులుతోంది.
ఇక పాలు, గుడ్లు బలవర్ధక ఆహారాలని పేర్కొంటున్నా ఉత్పత్తిదారుల ధనదాహంతో పలుచగా ఉన్న పాలలో యూరియా, ఇతర ద్రావణాలు కలిపి చిక్కబరచిన కల్తీవ్యాపారంతో పాలలోని బలవర్ధకత సమసిపోయి అనేక రుగ్మతలకు ఆలవాలమవుతోంది. కోడిగుడ్లలో కూడా కల్తీలు ప్రవేశించి నాసిరకం గుడ్లు అందుబాటులోకి వచ్చి నిరుపయోగమై, బలానికి బదులు అలసటను, అనారోగ్యాన్ని అందిస్తున్నాయి. ఇక కాయలను పండ్లుగా మగ్గబెట్టే దశలో వాడే రసాయనికాలతో మగ్గబెట్టడంవలన ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వపరంగా కల్తీ నిరోధకశాఖ అధికారులున్నా పర్యవేక్షణ కొరవడటం, మామూళ్లు మత్తులో జోగుతూండటం కాకుండా కల్తీ నిరోధకాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనాఉంది. కల్తీలతో సామాజిక ప్రజలకు అనారోగ్యం తెచ్చిపెట్టే కల్తీదారుల భరతం పట్టి కఠిన శిక్షలను అమలుచేయాల్సిన అత్యయిక అవసరం ఎంతైనా ఉంది.
సామాజికపరంగా ప్రజలలో ఆహారపు అలవాట్లును మార్చుకోవాలి
సాంప్రదాయబద్ధంగా మన పూర్వీకులు అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లు అయిన రాగిముద్ద, జొన్నరొట్టె, కొర్రలు, సామలు, సజ్జలును వినియోగంలోకి తీసుకువచ్చి వరి అన్నమే ఆధునికతకు ఆవలంబనమనే ఆరోగ్యపరమనే భ్రమలను విస్మరించాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఆహార ఉత్పత్తుల ధాన్యాన్ని ఆహారంగా వినియోగించు కోవడంవలన ఆరోగ్యానికి రక్షణ, శరీరానికి తుష్టి, పుష్టి కలుగుతుంది. మారుతున్న సామాజిక ఆరోగ్యం గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలి. సాంప్రదాయబద్ధమైన సేంద్రియ ఎరువుల వాడకంవలన ఉత్పత్తిఅయిన ధాన్యాల వినియోగం ఎంతైనా అవసరం. మెట్ట ధాన్యాలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడంవలన మెట్ట్ధాన్యాల ఆహార ఉత్పత్తులను విధిగా తినడంవలన ఆరోగ్యానికి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి మేలయిన బాటలు పరిచే ఆయుధం.
మన ముందుతరాలవారి శారీరక పటిష్టతకు ఆనాటి ఆహార పోషకాలే కారణం
వరిలో బైరొడ్లు, నల్లవడ్లు, సన్నవడ్లు, తోక వడ్లు పంటలను సేంద్రియ ఎరువులతో పండబెట్టి రోకళ్లతో దంపుడు బియ్యంగా రూపొందించి తినడంవలన శరీరాలకు తుష్టిపుష్టి చేకూరుతూ ఉండేది. ప్రతి ఇంటి పరిధిలో కాయగూరలను పండించే వెసులుబాటు ఉండేది. బీర, కాకర, గుమ్మడి, బెండ, వంకాయలు, సొరకాయలు, చిక్కుడు, గోరుచిక్కుడు, ముల్లంగి, చిన్న ఎర్రగడ్డలు, ఉర్లగడ్డలు తదితర దుంపల పంటలను వాణిజ్యపరంగా కాకుండా ఇంటి వాడుకకు ఆరోగ్యకరమైన పంటలను పండించేవారు. ఇక పండ్లపరంగా నేరేడు, అల్లనేరేడు, వెలగ, సీతాఫలాలు, రామసీతాఫలాలు, పనసపళ్లు, కొండలు గుట్టల అరణ్యప్రాంతాల్లో ఉలింజ, బలుసు, అల్లికాయలు విరివిగా లభించేవి. మనుషులకేకాదు పశువులకు కూడా ఆహారం పుష్కలంగా లభించి పాడి ఆవుల పాలతో గ్రామీణ ప్రాంతాల జనులు కడుపులనిండా తినేవారు. వేరుశనగ, చెరుకు గడలు, వాటినుండి తీసే తీయటి బెల్లం, మెట్ట పొలాలలో ఆనప, కంది, అలసంద కాయలు విరివిగా లభ్యమై బజారులో డబ్బుపెట్టి కొనే పరిస్థితి ఉండేదికాదు. మానవ జనాభా పెరిగిపోతూ అందరికి సరిపడ ఆహార సంవృద్ధి అందుబాటులో లేక పట్టణాలలో, నగరాల వెంటబడి ఎక్కడో పండిన వాటిని దిగుమతి చేసుకోవడం తాజా ఆహార పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. గ్రామీణ ప్రాంతాలలో సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు తినడంవలన ముందు తరాల వారిలో బోలెడంత వ్యాధి నిరోధకశక్తి, శారీరిక బలం చేకూర్చి రోగాల ఊసే లేకుండా దిట్టంగా, బలవర్ధకంగా ఆరోగ్యమే మహాభాగ్యంగా అలరారే వెసులుబాటు ఉండేది. రసాయనిక సేద్యాలతో, క్రిమిసంహారకాలతో నేటితరం యువకుల నుండి వయోవృద్ధుల వరకు ఏదో ఒక రోగం ఆవహించి అడుగడుగునా అవస్థలతో కునారిల్లుతున్నారు. అందుకే పోషకాల విలువలతో పండిన సేంద్రియ పంటల ఆహారపు ఉత్పత్తులపై మానవాళి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి 9885326493