సబ్ ఫీచర్

జంతుజాలంలో జాగృతమైన స్థితప్రజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంపుడు జంతువులు తమ యజమానులు వ్యక్తంచేసే మాటలను, హావభావాలను పసిగట్టి పాటిస్తాయి. ఏ జాతి శునకాలయినా తమ చిట్టి మెదడు ఇచ్చే సంకేతాల మేరకు, యజమానుల సంకేతాలను ఇట్టే పసిగడతాయి. ముఖ్యంగా నాసికా పుటాల ద్వారా వాసన రూపంలో ఎక్కువ విషయాలను పసిగట్టడం, శబ్దం ద్వారా జంతుజాలం ప్రమాదాలను పసికట్టడం, ప్రమాదాల బారినుండి తప్పించుకొనే చాకచక్యం కలిగి ఉంటాయి.
శునకాలకు గ్రాహ్యత ఎక్కువ
అందుకే వాటికి పోలీసుశాఖ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి క్రిమినల్ సంబంధిత నేరాల ఆచూకి కనుక్కోవడంలో ఉపయోగిస్తుంటారు. వాటికి గ్రాహ్యత ఎక్కువ. సందర్భాలను అనుసరించి చాకచక్యంగా నిందితులను కనుక్కోవడం వాటికి వెన్నతోపెట్టిన విద్య. ఇక గృహస్థులు పెంచే రకరకాల జాతుల శునకాలు కూడా కుటుంబ సభ్యుల పట్ల విధేయతతో రక్షణ విషయంలో అప్రమత్తత ప్రదర్శిస్తూ అపరిచితులను గుమ్మం దరిదాపులకు చొరనీయకుండా ‘్భభౌ’శబ్దాలతో చొరనీయకుండా భయాందోళనతో ఝడిపించడం జరుగుతుంది.
శునకాల తర్వాత విశ్వసనీయతగల జంతువులు అశ్వాలు
స్వారీ అనుభవాన్ని అశ్వశిక్షకుల నుండి పొందిన తర్వాత రారాజులు, రాజులు, సైనికాధిపతులు, ముఖ్య భటులు అశ్వాలపై స్వారీచేసే దశలో ‘రౌతు’మనోభావాలకు అనుగుణంగా వేగంగావెళ్ళడం, శత్రు కుతంత్రాలను పసిగట్టి దారిమళ్లించి రక్షణ దిశగా పరుగెత్తడం వాటికే చెల్లు. జీవ వేగం, సకిలింపులు, శత్రు కుతంత్రాలను, కదనంలో కత్తియుద్ధ నైపుణ్యంలో, వీరుల కరవాల చాలనలకనుగుణంగా అశ్వాలు సమయస్ఫూర్తిగా వ్యవహరించి శత్రువు తుదముట్టించే ఒడుపులతో పరుగులు పెట్టడం వాటికి అమరిన చతురత. అంతేకాదు యుద్ధరంగంలో తమ యజమాని తీవ్ర క్షతగాత్రుడై మూర్చిల్లిన సమయంలో సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళే అవగాహన ఆ అశ్వానికుంటుంది.
కదన రంగంలో గజాల రణోత్సాహం
యుద్ధ్భేరిల మ్రోతల సమరోత్సాహం, సైన్యం పటాటోపాలు, క్షతగాత్రులైన భటుల హాహాకారాలతో పెట్రేగిన గజాలు మావటివాడి కనుసన్నల మేరకు శత్రుసేనలను తొండంతో బాదుతూ ఘీంకారములు చేస్తూ, సైనికులను కాళ్లతో రాచి అసువులు బాసేవరకు చిధ్రంచేసే గజరాజుల కోలాహలం చెప్పనలవి కాదు.
పక్షి జాతిలో తీతువుల కూతలు
ఆరుబైట, గ్రామ, పట్టణాల సమీపంలో రాత్రిళ్లు పరాయివారి సంచారాన్ని గమనిస్తూనే తీతువుపక్షులు కూతలతో ప్రజలు అప్రమత్తులయ్యేలా కూతలు మొదలెడుతాయి. దాంతో ప్రజలు పరాయి వాసులెవరో దొంగతనాలకో, లూటీలుచేయడానికో వస్తున్నారని గ్రహించి గ్రామస్థులందరూ మేల్కొని ప్రమాదాలకు, దొంగతనాలకు వీలులేని విధంగా కాపుకాయడం జరుగుతోంది.
జంతువులకు ప్రకృతి విధ్వంసకాల్ని ముందస్తుగా గుర్తించే అప్రమత్తత
జంతువులలో ముఖ్యంగా పెంపుడు శునకాలే కాకుండా, వీధి కుక్కలకు సైతం ప్రకృతిపరంగా సంభవించే భూకంపాలు, సునామీలు, పెనుగాలులు, పిడుగులు పడడం వంటి భయానక ప్రమాదాలను వాటి ఘాణశక్తితో ముందస్తుగా పసికట్టి అరుపులు, భయానకం కలిగించే మూల్గులతో కరవరపడుతూ రాబోయే భయంకర విపత్తులను గురించి ప్రజలకు తెలియజేస్తుంటాయి. పశుజాతి సైతం మోరలెత్తి ఆకాశంవైపుచూస్తూ మోరలెత్తి అంబా రావాలుచేస్తూ సురక్షిత ప్రదేశాలకు పరుగులు పెడతాయి.
అడవిలో సైతం మృగాలు అతలాకుతలం
అడవికి నిప్పంటుకొంటే కార్చిచ్చుకు వాయువుతోడై దావానలం అడవినంతా కమ్ముకున్న సమయంలో అటవి పొదలలో ఆవాస మేర్పరచుకొన్న జంతువులు చుట్టూ అగ్నివలయం రాజుకొన్నవేళ అగ్నికి ఆహుతై భస్మీపటలం కావాల్సిందే. చెట్లు, మహావృక్షాలు ఎక్కగలిగిన జంతువులు సైతం అగ్నికీలలు వృక్షాలను సైతం దహించివేస్తుంటే వృక్షాలు తగలబడి రక్షణకోసం తపిస్తున్న ప్రాణులు సైతం కాలి బూడిదైపోవాల్సిందే.
జనారణ్యాలలోకి జంతు వలసలు
అడవిలో భారీ శరీరాలతో ఉండే ఏనుగులకు సరిపడినంత ఆహారము, ఆపై జలాలు అందక జనావాసాల వెంటపడి రైతులు పండించిన పచ్చటి పొలాలలోకి చెరుకు, అరటి, వేరుశనగ, వరి, కాయగూరలు, పండ్లు తోటలపైపడి తిన్నంతా తిని, వాటి విధ్వంసానికి పూనుకొంటున్నాయి. గుంపులు గుంపులుగా వలసవచ్చిన ఏనుగుల బారినపడి రైతులు ఆరుగాలం చేసిన పంటలు చిధ్రవౌతున్నాయి. ఏనుగులతోపాటు జింకలు, దుప్పులు, తోడేళ్ళుకూడా జనావాసాలపై బడడంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఏనుగుల దాడిలో పంట నష్టపరిహారమందక వేసిన పంట చేతికందక విలవిలలాడుతున్నారు.

- దాసరి కృష్ణారెడ్డి 9885326493