సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మచారి
బ్రహ్మచర్యం అంటే పెళ్లిచేసుకోకుండా వుండటం కాదు. బ్రహ్మయందు చరించటం. అందుకు ఆలోచనలు పవిత్రంగా వుండాలి. మనస్సు నిర్మలంగా వుండాలి. ఆచరణ స్వార్థరహితంగా వుండాలి. చిత్తశుద్ధి కనిపించాలి.
హనుమంతుడు ఎప్పటికీ బ్రహ్మచారే. సువర్చల ఆయన భార్య అంటారు. అయినా ఆయన బ్రహ్మచారి ఎలా అయ్యాడు? ఎందుకంటే ఆయనకు రాముడు తప్ప మరో విషయం తోచదు. సర్వస్వం రాముడే. ఆయన సదా బ్రహ్మంలోనే వుంటున్నాడు. బ్రహ్మంలోనే చరిస్తున్నాడు. కనుక బ్రహ్మచారి అయ్యాడు.
నీ ఆలోచనలనూ, నీ ఆలోచనలనూ, వాక్కులనూ, చేతలనూ బ్రహ్మపరం చేయి. అసలైన బ్రహ్మచారివి కా!
అత్యున్నత సంస్కారం
ఇంగ్లీషులో కల్చర్ అన్న పదానికి అర్ధంగా సంస్కృతి అన్న మాటను వాడుతున్నారు. ‘సంస్కారం’ అన్న దాని నుండే నాగరికత ఏర్పడింది. సంస్కారంలో రెండు అంశాలున్నాయి. ఒకటి- చెడును తొలగించటం, రెండు- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను పెంపొందించుకోడం:
వ్యక్తి జీవితంలో విధిగా పాటించాల్సిన వైదిక విధులను కూడా సంస్కారాలనే పిలుస్తారు. సంస్కారాలు 48 దాకా వున్నాయి. వాటిని 16కూ, 10కీ, ఆఖరికి ఒకటికి కూడా తగ్గించవచ్చు.
‘తానూ బ్రహ్మమూ వొకటే’ అన్న ఎరుకను సంపాదించటం అన్నిటికన్నా ఉత్తమ సంస్కారం.
నరుడెవరు? నారాయణుడే! తనను ఆవరించిన అవిద్యను తొలగించుకోగలిగితే అది అర్థమవుతుంది. అందుకు అధ్యయనం దోహదం చేస్తుంది.
సదసద్వివేకం
బుద్ధిని ఉపయోగించి ఏది మంచీ, ఏది చెడూ అన్నది తెలుసుకొనే వివేకాన్ని, విచక్షణను అధ్యయనం ద్వారా సంపాదించాలి. ‘చదివిన సద సద్వివేక చతురత గలుగున్’- అంటుంది భాగవతం. గాయత్రి మంత్రం ద్వారా అనాదిగా మనిషి చేస్తున్న ప్రార్థన యిదే: ‘్ధయోయోనః ప్రచోదయాత్’. ‘నేను సరిగా ఉంటే, మంచీ-చెడూ ఎగిరి, నడుచుకొనేలా నా బుద్ధిని ప్రకాశింప చేయి’- అని.
అంకురం
ఎక్కడ ఏ పని జరిగినా శబ్దం ఆవిర్భవిస్తుంది. నీకు వినపడక పోవచ్చు కాని అంతా శబ్దమయమే. కనురెప్పలు వాలినా చప్పుడవుతుంది. పూల రేకులపై మంచుబిందువు రాలినా చప్పుడవుతుంది. నిశ్చల నిరామయ బ్రహ్మంలో మొదట కల్గిన శబ్దమే ప్రణవనాదం, ఓంకారం. ప్రణవనాదం నుండే గాయత్రి ఉదయించింది. గాయత్రి ఉపదేశం పొందనిదే వేదాధ్యయనానికి అర్హత లభించదు. ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించటం జరగదు. అంటే, గాయత్రి ఎంత పవిత్రమైన, ప్రధానమైన మంత్రమో అర్ధమవుతుంది.
విశ్వజనీనం
గాయత్రి మంత్రం విశ్వజనీనం. అన్ని కులాలవారు, అన్ని మతాలవారు దానిని జపించవచ్చు. గాయత్రి అర్ధం ఏమిటి? సూర్య చంద్రాది గ్రహాలనూ, నక్షత్ర లోకాలనూ, మూడు లోకాలనూ ఆవరించివున్న పరమాత్మ దివ్యశక్తిని ఉద్దేశించి చేసే ప్రార్ధన అది.
‘నా మేధను జాగృతం చేయి, సాధనకు దోహదం కలిగించు. విజయం అనుగ్రహించు’-అన్న ప్రార్థనే అది.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది