సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామా? తాడా?
చీకటిలో తాడును చూసి పామనుకొని భయపడతాం. దీపం తెచ్చి చూస్తే. అది పాముకాదు, తాడేనని తెలుస్తుంది. అజ్ఞాన దశలో బ్రహ్మత్వాన్ని (జగత్తు రూపంలో) దర్శించి, ప్రకృతిగా పొరపడతాం. జ్ఞాన దీపం వెలిగించుకొని చూస్తే నిత్యమైన బ్రహ్మం గోచరిస్తుంది.
ఒక్కొక్కసారి నిరాకార బ్రహ్మం ధర్మస్థాపనకై ఆకారాన్ని ధరించి అవతరిస్తుంది. ఆకారాన్ని ధరించినంత మాత్రాన దాని దైవత్వానికి ఏలోటూ రాదు. దాని నిత్య చైతన్యతత్వంలో ఏ మార్పూ వుండదు. అవతార ఉపాధిలోని దైవాంశ అక్షరతత్వమే!
***
ప్రబోధ యోగం
ప్రస్తుతం మానవుడు చేస్తున్నదేమిటి? తనకు తోచినట్లు ప్రవర్తించటం. నీతీ నియమం పాటించటం లేదు. తన అంతరాత్మ ప్రబోధాన్ని పట్టించుకోవడం లేదు. వక్రమార్గం పట్టి, పతనానే్న పట్టుదలగా కోరుకుంటున్న వాడెవరేం చెబితే వింటాడు? మందు కావలసింది ఎవరికి? బాగా ఆరోగ్యంగా వున్న వాడికి మందు ఎందుకు? చచ్చిన వాడికి అంతకన్నా అక్కరలేదు. సుస్తీ మనిషికే ఔషధం కావాలి. సంశయాత్ముడికీ, ఆతురత కలవాడికీ, ఆందోళన పడుతున్న వాడికీ బోధ అవసరం. శాస్త్రాలలోనూ, వేదాలలోనూ అలాటి బోధ లభిస్తుంది.
అధ్యయనానికి అర్హత
పుట్టినప్పుడు ఎవరూ బ్రాహ్మణులు కాదు, అంతా శూద్రులే. (జన్మనా జాయతే శూద్రః). తానెంత గొప్ప వేదపండితుని కొడుకైనా, వేదం చదివే అధికారం అతనికి లేదు. అందకు ఉపనయనం అనే సంస్కారం జరగాలి. గాయత్రీ మంత్రోపదేశం పొందాలి. అలా బ్రహ్మోపదేశం పొందినప్పుడే వేదాల అధ్యయనానికి అతనికి అధికారం లభిస్తుంది.
ఉపనయనం
బ్రహ్మోపదేశం తీసుకొనే సంస్కారమైన ఉపనయనం అన్న మాటకు ‘దగ్గరకు తీసికోడం’అని అర్థం. బ్రహ్మానికి దగ్గరగా తీసికోడం అన్నమాట. బ్రహ్మజ్ఞానం లభించే దారి చూపడమే దాని లక్ష్యం. మనసును పరిశుద్ధం చేసేందుకు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేందుకూ అది ఉద్దేశించబడింది. ఆ ఉపదేశాన్ని పొందినవాడు ‘ద్విజుడు’ (అంటే, రెండుసార్లు పుట్టిన వాడు) అవుతున్నాడు. ముందు ఇహలోకంలో జన్మించటం; తరువాత ‘సాధకుడు’గా రూపొందటం. ఉపనయనం కాగానే బ్రహ్మచారి అవుతాడు. అంటే బ్రహ్మం దిశగా నడిచేవాడన్నమాట! బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడే బ్రాహ్మణుడనబడతాడు.
అద్వైతం
శంకరాచార్యులవారు దైవాన్ని నిరాకారుడనీ, నిరామయుడనీ కీర్తించారు. ఆయన దేవుని పరంజ్యోతి అన్నారు. జీవుడూ, దేవుడూ వేరు కాదని చెప్పారు. అదే అద్వైతం. అంటే జీవాత్మే పరమాత్మ అని అర్థం. పరమాత్మ వేరుగా జీవాత్మ వేరుగా కనిపించటానికీ, మిథ్య అయిన జగత్తు వాస్తవంగా తోచటానికీ కారణం మాయ అని ఆయన చెప్పారు. అదే అవిద్య.

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది