సబ్ ఫీచర్

ఆకట్టుకొంటున్న బొమ్మల కొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన బొమ్మలను చూసేందుకు పిల్లలే కాదు పెద్దలు ఇష్టపడతారు. అటువంటి వివిధ రకాలైన బొమ్మలు వందల్లో ఒకేచోట దర్శనం ఇస్తే చూసేవారి ఆనందానికి అవధులే ఉండవు అనడం అతిశయోక్తి కాదు. వందలాది బొమ్మలను ఒకచోట చేర్చి చూపరులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగుతుంది. దుర్గాదేవి వివిధ రూపాలను ధరించి దుష్టులైన రాక్షసులను అంతమొందించినందులకు నిదర్శనంగా ఆ చల్లని తల్లిని వివిధ అలంకారాలతో పూజిస్తూ దసరా పండుగను జరుపుకుంటాము. దసరాలో బొమ్మలకొలువులను నిర్వహించడం సంప్రదాయం. బొమ్మలు, కథలు కేవలం పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు. ఈ రెండింటినీ మేళవించి ఓ గొప్ప సాంప్రదాయం- బొమ్మలకొలువు. మారుతూ వున్న సామాజిక నేపథ్యంలో ఒకటిన్నరదశాబ్దలుగా కనుమరుగు అవుతున్నా ఈ సత్సంప్రదాయాన్ని సజీవంగా నిలిపి మన సంస్కృతీ గొప్పదనాన్ని భావితరాలకు అందుతుంది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదివి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. మన సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు వంటి వాటిపైన వివిధ పత్రికలలో వ్యాసాలు వ్రాస్తువున్న శ్రీమతి విజయలక్ష్మి గత పదకొండు సంవత్సరాలుగా బొమ్మలకొలువును నిర్వహిస్తూ వున్నారు. వీరి భర్త ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖరరావు రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక రచయిత. వీరిద్దరూ ఎంతో శ్రమకోర్చి ఏర్పాటుచేస్తున్న బొమ్మలకొలువు విశేషంగా ఆదరింపబడుతూ వుంది. సుమారు నాలుగు వందలకుపైగా మట్టితో చేసిన బొమ్మలు కొలువులో దర్శనం ఇస్తాయి. తొమ్మిది మెట్లు వున్న ఒక వేదికతోపాటు మరో కొన్ని వేదికలను ఏర్పాటుచేసి కొలువును తీర్చిదిద్దారు. దుర్గాదేవి, త్రిమూర్తులు, శ్రీవెంకటేశ్వరస్వామి, సీతారామలక్ష్మణులు, దశావతారాలు, హయగ్రీవుడు, సూర్యుడు, పాండురంగడు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి, మధుర మీనాక్షి, కాశీవిశాలాక్షి, కంచి కామాక్షి, అష్టలక్ష్ములు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప మొదలైన దేవతామూర్తుల బొమ్మలు, ఆదిశంకరాచార్యులు, రాఘవేంద్రస్వామి, వివేకానందుడు, షిరిడీ సాయిబాబా కంచి పరమాచార్య, చంద్రశేఖర సరస్వతి వంటి మహనీయులు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్ర్తీ వంటి సంగీత విద్వాంసులు, దేశ నాయకులు, రైతులు, వ్యాపారులు వంటివారి బొమ్మలుకొలువులో నయనానందకరంగా దర్శనం ఇస్తాయి. రావణదర్బారు, గుహుడు రాముడిని నది దాటించే దృశ్యం, వివాహం, కామాక్షి పూజ, సత్యనారాయణవ్రతం, లక్ష్మీనారాయణ పూజ, స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భావం, అరుణాచలగిరి ప్రదక్షిణ, మాయాబజార్‌లో ఘటోత్కచుడు విందుభోజనం చేసే సన్నివేశం, బృందావన కృష్ణుడు వంటి సన్నివేశాలతోకూడిన బొమ్మలు ఆయా పురాణగాథలను కళ్ళముందు కదిలేలా ఏర్పాటుచేశారు. కాగా నలభై సంవత్సరాలకు ఒకసారి కొలనునుంచి వెలుపలకు వచ్చి 48 రోజులు పూజలందుకునే కంచి అత్తివరదస్వామి వారి సన్నివేశం కూడా ఏర్పాటుచేయడం విశేషం.
వీటితోపాటు ఇసుకలో గడ్డిని మొలిపించి ఏర్పాటుచేసిన పార్కు పిల్లలు, పెద్దలను కూడా ఆశ్చర్యపడేలా చేస్తోంది. ఇందులో గోశాలను ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ మహాత్ముడు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారితో గోశాలలో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేస్తూ గోశాలలో ఆ సన్నివేశాన్ని, గోశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావుగారినికూడా ఏర్పాటుచేశారు. అంతేకాకుండా కొండను ఏర్పాటుచేసి అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వీరు ఈ బొమ్మలను చెన్నై, తిరుపతి, మధురై, రామేశ్వరం, కాశి, శ్రీశైలం వంటి ప్రాంతాలనుంచి సేకరించారు. తీర్థయాత్రలు ఎక్కువగా చేసే ఈ దంపతులు ఎక్కడకు వెళ్లినా బొమ్మలను సేకరించడం అలవాటుచేసుకున్నారు.
ఈ విధంగా బొమ్మలకొలువు నిర్వహించడంతోపాటు ప్రతిరోజూ పూజలు నిర్వహించి సాయంత్రం మహిళలను పిలిచి పేరంటాలు నిర్వహించి తాంబూలాలు ఇస్తూ మన సంప్రదాయానికి పెద్దపీట వేస్తువున్నారు. వీటన్నింటికిమించి కొలువును చూడడానికి వచ్చిన వారికి, పిల్లలకు శ్రద్ధతో బొమ్మలను గురించి, వాటికి సంబంధించిన పురాణ గాధలను వివరిస్తూ వుండడం విశేషం. ఈ దంపతుల కృషి, ఓపికలను సందర్శకులు అభినందించడంతోపాటు నలుగురికీ తెలిపి వారు సందర్శించేటట్లు చేస్తూ వుండడం విశేషం.
భావితరాల కోసమే...
మన సంప్రదాయం లేదా ఏదైనా ఒక బొమ్మను గురించి అడిగితే పిల్లలే కాదు యువత కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో పదకొండు సంవత్సరాల క్రితం నాకు బొమ్మల కొలువు పెట్టి భావితరాలకు మన సంప్రదాయాలు, ఆచారాలు తెలపాలనే కోరిక కలిగింది. నా చిన్నతనంలో మా ఇంట్లో బొమ్మలకొలువు పెట్టేవారు. పెళ్లితర్వాత శ్రీవారు బొమ్మలకొలువు పెట్టేందుకు అంగీకరించడంతో దసరా ఒక నాలుగు రోజులు ఉందనగా మా అబ్బాయిని వెంటబెట్టుకుని తిరుపతి, తిరుచానూరు వెళ్లి కొన్ని బొమ్మలు తెచ్చి బొమ్మలకొలువు పెట్టాను. అప్పటినుంచి ఎక్కడికి వెళ్లినా బొమ్మలు సేకరించడం అలవాటుగా పెట్టుకున్నాను. దీనితో పెద్ద బొమ్మలకొలువు ఏర్పడింది. సందర్శకులు ప్రధానంగా పిల్లలు వచ్చి చూసి దీని గురించి అడిగి తెలుసుకొంటుంటే ఆనందం రెట్టింపు కొనసాగేలా చేస్తుంది. తల్లిదండ్రులు విద్యతోపాటు మన సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు వివరించాల్సిన అవసరం ఎంతో వుంది.

- కె. విజయలక్ష్మి