సబ్ ఫీచర్

గాంధీ చెప్పని సందేశం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మా గాంధీకి తనవి అంటూ ఉన్న
వస్తువులు చాలా తక్కువ : అవి....
కళ్ళజోడు ,చెప్పులు జత ఒకటి
ఒక జేబు గడియారం ,చిన్న పాత్ర , పళ్లెం
......ఇవి కాక మూడు కోతుల బొమ్మ.
దీనిని చైనా దేశం నుంచి గాంధీజీని కలుసుకోవడానికి వచ్చిన సందర్శకులలో ఒకరు తెచ్చి , అర్ధం చెప్పి ఇచ్చారట.
కన్ఫ్యూషియస్, టావోయిజం, జపాన్ షింటోఇజం ఈ మూడింటి ప్రాచీన గ్రంథాలలో మూడు కోతుల గురించి చెప్పడం ఉందట.జపాన్ షింటోయిజం ప్రకారం
మిజారు,కికజారు, ఇవజారు -అంటే ఏదైనా ఒక పనిని సులువుగా, సహజంగా ప్రామాణికంగా చేయడానికి మన మనసును సమాయత్త పరిచేవి అని చెప్తారు.
ఇవ జారు అంటే చెడు చూడవద్దు.రెండవది చెడు వినవద్దు.మూడవది చెడు మాట్లాడవద్దు- అని మనందరకు తెలిసిన విషయమే.
అయితే దీనిని గాంధీ ఎలా తన అపురూపంగా దాచుకున్నారు? ఎందుకు ఆ ప్రస్తావన పెద్దగా చేయలేదు? కాస్త పరిశీలిద్దాం.
మనం చేసే పని ఏదైనప్పటికీ చూసి, విని,మాట్లాడి- కదా చేస్తాం? కానీ అలా ఒక పని చేసేముందు మనం మన మనసులో ఏదో భావిస్తాం. మెదడుతో ఏదో ఆలోచిస్తాం. బహుశా ఈ మూడు ఎంత స్వచ్ఛంగా, ఏ నిబధ్ధతతో ఉండాలో మనకు తెలిపేదే ఈ మూడు కోతుల బొమ్మ.
మానసిక శాస్త్ర ప్రకారం, మనిషి తన జీవితంలో ఏదైనా కోరుకున్నది దొరకగానే సంతోషాన్ని, దొరకని క్షణంలో బాధను పొందుతూనే ఉంటాడు. ఈ బాధ భౌతికమైన నొప్పి దగ్గరనుంచి వ్యక్తిగతమైన డిప్రెషన్‌గాను, సామూహికమైన అశాంతి వరకు ముప్పేటగా మనని ఆవరించి ఉంటుంది. చెప్పాలంటే అనుక్షణం మన చుట్టూ ఉన్న వాటి నుంచి చూసి, విని, వాటి ప్రభావానికి గురైన పిదప మనం కొన్ని భావనలకు లోనవుతాం. వాటిని ‘ఉద్వేగాలు’ అంటారు. ఆ తరువాత ఈ ఉద్వేగాలు మన ఆలోచనలను ప్రభావితం చేయ డం మొదలు పెడతాయి
ప్రపంచమంతా అరచేతి లోకి వచ్చిన ఈనాటి చరవాణి సాక్షిగా దేశ విదేశాలలో జరుగుతున్న సంఘటనలు, వారి అలవాట్లు, శాస్ర్తీయ ఆలోచనా విధానాలు, వైజ్ఞానిక పరమైన ఆవిష్కరణలు - ఇవన్నీ కుండపోత వర్షంలాగ, వెంటనే వార్త గానో, ప్రకటన రూపంలోనో మన వద్దకు చేరుతోంది.
ఇది ప్రపంచీకరణ ప్రభావం.
అయితే ఇలా వచ్చి పడిపోతున్న అనేకమైన వార్తలు, కొత్త విషయాలు ఒక సగటు మానవుని చిన్నిగుండె, చిన్నారి మనసు మెదడు తట్టుకోలేక పోతున్నాయా? అన్నది ఒక సందేహం.రమారమి రోజుకు 50 నుండి 70 వేల ఆలోచనలు మనిషి మెదడులో వస్తాయని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు.
గాంధీ కాలానికి, రవి అస్తమించని విస్తృత బ్రిటిష్ సామ్రాజ్యపు అధినేతలు తాము చేజిక్కించు కున్న దేశాలలోని సహజ వనరులను, మనుషుల శ్రమను చేసిన దోపిడీ ఆనాటి ప్రపంచం ఎదుర్కొం టున్న అతి పెద్ద సవాల్. పైగా ఒక చిన్న దేశం నుంచి చాల తక్కువ సంఖ్యలో మనుషులు వచ్చి తాము ఆక్రమించుకున్న దేశాలలోని పెద్ద సమూహా లను నియంత్రించడం మామూలు విషయం కాదు. వారిదెంత దుష్టనీతి అంటే,
ఒక సమాజంలోని వ్యక్తుల చేత తమ తోటి మనుషుల పైనే అధికారం చెలాయించేలా, శారీర కంగా హింసించేలా, మానసికంగా బానిసత్వానికి లోను చేసేలా విదేశీయులతో చేయి కలిపి మరీ పీడించేలా ఎలా ప్రేరేపించ గలిగారు? ఇది ఎంత దారుణమైన దోపిడీయో ఊహకు అందనంత కష్టం.
ఇంతటి రాజకీయ సంక్షోభ సమయంలో ‘‘రైలులో ప్రథమశ్రేణిలో కూర్చోవడానికి నువ్వు తగవ’’ని గాంధీని కిందకు దింపినప్పుడు అతడు పొందిన ఆత్మన్యూనతాభావం, ఆ అవమానం గాంధీలో ఎలాంటి తిరుగుబాటు భావాన్ని రగిలిం చినదో, ఆపైన అది ఎలా ఉద్యమ రూపం దాల్చిందో ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన మానసిక సంఘర్షణ మనకు గోచరిస్తుంది.
ఒక వ్యక్తిగా తనకు కలిగిన అవమానం లోంచి ఒక వర్గం మరొక సమాజాన్ని తక్కువగా చూసి, ఎలా వివక్షను చూపుతుందో దాన్ని గాంధీజీ గుర్తించగలిగాడు.
ఎలా ఒక దేశ ప్రజలు ఇతర దేశాల పౌరులను ప్రాథమిక మానవ హక్కులను కాల రాసి, కనీస గౌరవం ఇవ్వకుండా అణగద్రొక్కారో అనే నిజం వైపు దృష్టి సారించడమే గాంధీ చేసిన అతి గొప్ప ప్రయత్నం.
ఇది క్షణకాలపు అవమాన భారం నుంచి 50 సంవత్సరాల ఆయన జీవిత కాలపు స్వతంత్ర పోరాటంగా మారింది.
స్వాతంత్రం అంటే తమను తాము పరి పాలించుకోవడం. స్వేచ్ఛ అంటే మరొకరి నియంత్ర ణలో ఉండకుండా తమ జీవితం గురించి తామే నిర్ణయాలను తీసుకోగల స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం.
పోలీసు లేదా మిలటరీ వ్యవస్థతో బ్రిటిష్ రాజ్ తమకున్న తుపాకులు, మందుగుండు సామానుతో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మందిని మరీ ముఖ్యంగా పౌరులను భయంతో అణగదొక్కాలని చూసింది. చెరసాల గోడల సాక్షిగా తమను ఎదిరించి నిలుచున్న ప్రతి వ్యక్తిని నేరస్తుడిగా ప్రకటించి మరీ శిక్షార్హులు గా మార్చింది.
ఆ అకృత్యాలను ఎదిరించి నిలిచిన వాడే సత్యాగ్రహి. సత్యాగ్రహి సత్యం కోసం ఆగ్రహం చెందుతున్నాడు.
ఆ సత్యమే స్వేచ్ఛ.
అతడి ఆగ్రహాన్ని సైతం
అహింసాయుత విధానం లోనే వెల్లడి చేస్తాడు.
ఎవరినీ చెడుగానిందించడు.
ఎవరి పట్ల అసత్యప్రచారం చేయడు.
ఎవరి పట్ల ద్వేషం పెంచుకోడు,
వారితో యుధ్ధానికి దిగడు.
తన స్వేఛ్ఛ నే కావాలంటాడు.
గాంధీజీ దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా చెరసాల పాలైనప్పుడు తాను ఒక హంతకుని పక్కన ఒక గోడ మాత్రమే అడ్డుగా రెండు నెలలపాటు చెరసాలలో ఉన్నాను అని చెప్తూ ‘‘మూడడుగుల ఆ గది, రెండు నెలల భయం కరమైన వౌనం ఆ నేరస్తుడిని ఏం మార్చిందో నాకు తెలియదు గానీ నన్ను మటుకు సత్యం వైపుకు నడిచేలా చేసింది’’ , అని చెప్పారు.
బ్రిటిషువారి వర్ణ వివక్షపై నిరసనను తెలిపి, ఆ తరువాత దాన్ని మత, వర్గ, లింగ వివక్షలపై ‘‘నిరంతర పోరాటం’’గా గాంధీజీ విస్తృత పరిచారు. ఆయన మళ్లీ, మళ్లీ తన ఆలోచనలను పరిశీలించు కుంటూ, ప్రతిసారి సత్యం వైపే చూస్తూ, మొదటి రోజు తాను ఏ ప్రతికూలతను, అణచివేతను అనుభవించాడో అటువంటి బాధను మరెవ్వరూ పొందకూడదని తన ఉద్యమాన్ని కొనసాగించాడు .
మూడు కోతుల బొమ్మ సాక్షిగా
గాంధీజీ తన మనసును, మాటను, చెవులను
అసత్యం నుంచి,
అబద్దాలనుంచి,
బలహీనతల నుంచి
వడపోసుకుని అహింసాయుత పోరాటం చేయడానికి ముందుకు సాగినట్లుగా మనకు తెలుస్తోంది.
అందుకే ఆయన వేల కొలది శిష్యులను పొందగలిగాడు. వందలకొలది మేధావులను ఆక ర్షించగలిగాడు. లక్షల కొలది సాధారణ పౌరులను తన అనుయాయులుగా చేసుకోగలిగాడు.
సమాజంలో ఉన్న ప్రతి వారి సమస్యను తన సమస్యగా గుర్తించగలిగాడు.
కూడు, గూడు, గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాలకోసం ఏ దేశంలోనూ పరాయి పాలన లో న్యాయం జరగదని, దానికి రాజకీయ స్వాతంత్య్రం చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు.
ఇందుకు నిరంతరం సమాజక్షేమం కోరి ఎటువంటి ప్రతికూల విషయాలను వినక, చూడక, మాట్లాడక ఉండడానికి ఈ మూడు కోతుల బొమ్మ ను తన ఆదర్శంగా, భావి తరాలకు తన సందేశంగా ఆయన వదిలి వెళ్ళారని అనుకోవచ్చు.

- కాళ్ళకూరి శైలజ 9885401882