సబ్ ఫీచర్

పండుటాకుల అగచాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వృద్ధాప్యం ఓ శాపం కాదు, వ్యాధి కాదు, అది రెండో బాల్యం’’ అన్నారు తిరుపతి వేంకట కవులు. వయసు పెరిగేకొద్దీ పెద్దరికం పొందాలి కానీ ముసలితనాన్ని కాదు అనేవారు తత్త్వవేత్త జాన్సన్. యువతను శక్తికి మారుపేరంటారు కానీ వారి వద్ద అనుభవమనే శక్తి ఉండదు. జీవిత సత్యాల జ్ఞానం చాలా తక్కువ. ‘అపారమైన అనుభవశక్తి, అసంఖ్యాకమైన సత్యాల సమాహారమే వృద్ధాప్యం’. వార్థక్యం ఎప్పుడూ యవ్వనం పరిధిలోకి రాదు. వృద్ధాప్యం శరీరానికి వస్తుందే కానీ మనసుకు రాదు. బాల్యంలో లాలన, కౌమారంలో చదువు, వనంలో ఉపాధి, వృద్ధాప్యంలో సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. జీవితంలో ఆ నాలగు దశల్లో తొలి మూడు సవ్యంగా సాగినా, తుది దశలో ఉండాల్సిన రక్షణ అనేకమందికి కరవౌతుంది. భారత్‌లో వృద్ధుల సంఖ్య దాదాపు 10 కోట్లకు పైగా ఉంది. 2050 సంవత్సరం నాటికి 32 కోట్లకు మించిపోతుందని అంచనా. అందుకే వయోవృద్ధులను విస్మరించవద్దు. వృద్ధులకోసం ‘మనం’ ఉన్నామనే భావన రావాలి. 60 ఏళ్ళకే ఎంతో ముసలివారమయినట్లు భావించరాదు. అకాల వృద్ధాప్యాన్ని మీద వేసుకోక మంచి పనులతో మరో 10 సంవత్సరాల వయసు తగ్గించుకునే ఆలోచనలు చేయాలి. సృష్టిలో ప్రతి ఒక్కటీ నశించేదే. ‘మరణం’ అన్నది ఎప్పుడు ఏ రూపంలో ఏ వయసులో వస్తుందో ఎవ్వరం చెప్పలేం. వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుంది అనుకోవటం సబబే కానీ మనః సామర్థ్యం పదిలపరచుకునే అవకాశం మనిషికి ఎప్పుడూ ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారు 11 కోట్లమంది 60 సంవత్సరాలు పైబడిన వారున్నట్లు తెలుస్తుంది. మరో 20 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా. అంటే మనిషి యొక్క జీవన పరిణామం పెరుగుతోంది. 1984 సంవత్సరంలో వియన్నాలో మొట్టమొదటిసారిగా వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. అక్కడే ‘సీనియర్ సిటిజన్’ అనే పదం పుట్టింది. వృద్ధులను వృద్దులన్నా, ముసలివాళ్లన్నా బాధగానే వుంటుంది. కానీ సీనియర్ సిటిజన్ అనే పదం ఇంగ్లీష్ అయినా కూడా ఎంతో హుందాగా వుంటుంది. 1999 సం.లో మన దేశంలో వృద్ధుల సంక్షేమానికి ఒక జాతీయ ప్రణాళిక ఏర్పాటు చేయనైనది. 2004 సంవత్సరంలో స్పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశంలో వృద్ధుల సంక్షేమానికి 41 తీర్మానాలు ఆమోదించడమైనది. ఫలితంగా మన కేంద్ర ప్రభుత్వం 2007లో వృద్ధుల పోషణ, సంరక్షణా చట్టాన్ని తీసుకువచ్చి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరింది. వృద్ధులు పడుతున్న మూడు రకాలైన బాధలు- 1.ఆర్థికం, 2.సామాజికం, 3.అనారోగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వారిని ప్రేమతో పోషించకపోవడం అమానవీయం. వయోధికులని జాలివద్దు కానీ వారికి చేయూతనందించడమే ముద్దని తెలుసుకుందాం.
తమ వయసును బట్టి అందరూ గౌరవించాలని వృద్ధులు ఆశించడం తప్పుకాకపోయినా, బుద్ధిని బట్టి గౌరవం లభిస్తుందన్నది సత్యం. ‘బుద్ధిమంతుడైనా వ్యక్తే వృద్ధుడవుతాడు కాని, వయసుమీరినవాడా వృద్ధుడు’ అని ప్రశ్నించాడు నీతిచంద్రిక కర్త. ఎందుకంటే వార్థక్యం రెండో బాల్యం వంటిది. వృద్ధాప్యాన్ని చాలామంది శాపంగానే భావిస్తారు కాని భగవంతుడిచ్చిన ఈ సంధ్యాకాలాన్ని మనిషి అందంగా తీర్చిదిద్దుకొని ఆనందంగా గడపాలి. సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం అమృతఫలాలు వంటివి. ఆ రెండింటిని వార్థక్యంలో అలవాటు చేసుకోవాలి. వృద్ధాప్యానికి భద్రతనివ్వడం ప్రభుత్వ వ్యవస్థల కర్తవ్యం. ప్రతి మనిషికి వృద్ధాప్యం అనివార్యం. వృద్ధుల జనాభాలో 29 శాతం పట్టణాల్లో, 21 శాతం మంది గ్రామాల్లో జీవనం గడుపుతున్నారు. వృద్ధులయిన తల్లిదండ్రులను పోషించే బాధ్యత పిల్లలదేనని కోర్టు తీర్పులు వచ్చినా, చట్టాలు చెబుతున్నా, వినేవారు అరుదు. ముదిమిని సగౌరవంగా ఆహ్వానించి, సవ్యంగా గడపాలి. ముల్క్‌రాజ్ ఆనంద్, ఆర్.కె.నారాయణ్ వంటి రచయితలు తొంభైలు దాటినా రచనలు చేశారు. పి.వి.నరసింహారావుగారు, అబ్దుల్ కలామ్, డా.రాజేంద్రప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు చివరివరకు ఎంతో హాయిగా జీవించారో తెలుసుకోవాలి. అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకుని మన పరిధిలో మనం ఏం చేయగలమో ఆలోచించాలి.
తల్లిదండ్రులమీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి.. పుట్టలోనా చదలు పుట్టవా గిట్టవా.. విశ్వదాభిరామ వినురవేమ! అలనాడే సమాజాన్ని ఆసాంతం చదివిన యోగి వేమన మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి. పుట్టుకకు కారకులు, ఎదుగులకు సారథులు, సమాజానికి మనకూ మధ్య వారధులు అమ్మా నాన్నలు. కానీ నేడు పేగు తెంచుకు పుట్టినవారు తమను సాకడంలేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న సంఘటనలు ఉన్నాయి.
పడిపోతున్న జననాల రేటు
ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు తగ్గుతూ వస్తున్నది. 1950లో జననాల రేటు 1.87 శాతం ఉండగా ప్రస్తుతం 1.05కు పడిపోయింది. 2050 నాటికి జననాల రేటు ఒక శాతానికి దిగువనకు పడిపోవచ్చని అంచనా. ఫలితంగా అప్పటికి యువత సంఖ్యతో పోలిస్తే వృద్దుల రేటు రెట్టింపుకానున్నది. మనుషుల సగటు జీవితకాలం పెరగడం కూడా వృద్ధుల జనాభా పెరగటానికి ఒక కారణం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సగటు జీవితకాలం 66 ఏండ్ల వరకు ఉండగా 2050 నాటికి అది మరో 6.7 ఏండ్లు పెరగొచ్చని అంచనా. మరో 30 ఏండ్లలో వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోతుందంటూ.. 2050ని ప్రపంచ జానాభాకు టైంబాంబ్‌గా వర్ణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రకారం 60 ఏండ్లకు పైబడినవారిని వృద్ధులుగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 180 కోట్లమంది వృద్ధులున్నారు. ఇది ప్రపంచ జనాభాలో 12 శాతం, 2050 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 200 కోట్లకు చేరుతుందని డబ్ల్యుహెచ్‌ఓ అంచనా వేసింది. అంటే అప్పటి ప్రపంచ జనాభాలో దాదాపు 22 శాతం వృద్ధుల జనాభా పెరిగి యువత సంఖ్య తగ్గితే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పెనుభారంగా మారుతుంది. ప్రస్తుతం వృద్ధ జనాభాలో సమతమవుతున్న జపాన్‌లో 30 శాతానికి పైగా 66 ఏండ్లకు పైబడిన వారే. 1991 అక్టోబర్ 1 నుంచి ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వయోవృద్ధుల జనాభా భారతదేశంలో ఉంది. దేశంలోని వయోవృద్ధుల్లో 51 శాతానికిపైగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ నుంచి జాతీయ వయోశ్రీ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. వారికి అవసరమైన వాకర్లు, క్రచ్‌లు, కళ్లద్దాలు, వినికిడి పరికరాలు, కృత్రిమ దంతాలు, చక్రాల కుర్చీలు, ట్రైపాడ్లు తదితర సదుపాయాలు కల్పించడమే వయోశ్రీ పథకం ముఖ్య ఉద్దేశం. 60 ఏళ్ళ పైబడ్డవారి జనాభా 2011లో 8.6 శాతం ఉండగా 2041 నాటికి అది 16 శాతానికి పెరగబోతోందని ఇటీవలి ఆర్థిక సర్వే కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. ‘‘దేశం వయసు మీరుతోంది. సీనియర్ సిటిజన్స్‌కు అవసరమయ్యే నిర్దిష్ట చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. రిటైర్‌మెంట్ వయసు దశలవారీగా పెంచాలి. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పెద్ద ఎత్తున ఓల్డేజ్ హోమ్‌లను ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకోవాలి. వృద్ధులు గౌరవప్రదంగా బతకగలిగేలా పెన్షన్‌ని నిర్ణయించాలి. ఆరోగ్య సంరక్షణపై ప్రధానంగా దృష్టిపెట్టాలి.
వస్తు వ్యామోహ సంస్కృతి విస్తరించాక ఇంట్లో ఎందుకూ కొరగాని పాడుబడిన వస్తువులుగా వృద్ధులని పరిగణించే అమానవీయ సంస్కృతి చెలామణి అవుతున్నది. వృద్ధుల్లోనూ మహిళలే ఎక్కువగా హేళనని, అవమానాల్ని, ఈసడింపుల్ని ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేకపోవడం, వితంతువులు కావడం, ఎక్కువ కాలం బతకడం వంటి కారణాలవల్ల వారిపట్ల కినుక వహిస్తున్నారు. ముదిమిలోనూ చురుకుగా, హుషారుగా ఉండేలా ఎవరికివారు ముందునుండే సిద్ధంకావాలి. ఇందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చేయూతనివ్వాలి. వృద్ధాప్యానికి రక్షణ కల్పించాలి. అప్పుడే ముదిమిలోనూ ఉత్సాహంతో సృజనాత్మకంగా జీవించడం సాధ్యం. దీంతోపాటు దైవభక్తి, ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ సేవ మనశ్శాంతి కల్గిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కుటుంబం, సమాజం పెద్దలను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అనుభవాలలో పండిన వారి జీవితాలను, జాతి భవితకు మార్గదర్శిగా భావించాలి. అందుకే వృద్ధులను గౌరవిద్దాం. వారికి తగు సహకారమందిద్దాం.

- కె.రామ్మోహన్‌రావు 9441435912