సబ్ ఫీచర్

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలపై నిత్యం పెరుగుతున్న అత్యాచారాలపై సభ్య సమాజం భీతిల్లుతోంది. ఆడపిల్లలుగల తల్లిదండ్రులతే నిత్యం సంఘర్షణకు లోనై బయటికి వెళ్ళిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు వారి ఆలోచనలు పరిపరివిధాలుగా పోతోంది. సామాజికపరంగా మానవత్వం మటుమాయమై అవకాశాలకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మగ మృగోన్మాదుల అరాచకాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్న విష సంస్కృతి వారిది.
వావి వరుసా లేదు, చిన్నారులనే కనికరంలేదు, యువతులపట్ల, గృహిణులపట్ల మరే ఆలోచనతో పనిలేకుండా అత్యాచారాలు చేయని రోజు లేదు. నిర్భయ, అభయ, ఫోక్సో చట్టాలు ఇలాంటివారికి గుర్తుకురావు. అడవులలోని మృగాలు కామేచ్ఛతో పొరుగు మృగాలపైబడి అత్యాచారాలు చేసిన సంఘటనలు కానరావు. ఇక ఆకలికి కడుపు నింపుకోవడానికి చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడి ఆకలి తీర్చుకొంటాయి. ఆ అలవాటు వాటి జీవన విధానం. కానీ ఇక్కడ అవకాశం, నిస్సహాయులుగా వున్న యువతుల్ని, పిల్లల్ని, ముదుసలులను, గృహిణులను నిర్బంధించి బెదిరించి ఇచ్ఛ వచ్చిన రీతిలో అనుభవించడమే కాకుండా హత్యలు చేయడం లాంటి దుర్మార్గులను మృగోన్మాదులు, మదోన్మాదులంటే తప్పులేదు.
బాలికలపై పెచ్చరిల్లుతున్న అత్యాచారాలు
ఒకవైపు నిందితులకు మరణశిక్షలు, యావజ్జీవ కారాగారశిక్షలు పడుతున్నా వాటిని ఏ మాత్రం లక్ష్యపెట్టడంలేదు. అసోమ్ రాష్ట్రంలో కన్న తండ్రే కాటువేయగా, వికారాబాద్ జిల్లా పెద్దాపురం మండలంలో ఒక యువకుడు తల్లి ఒడిలో నిద్రపోతున్న పసిపాపలను ఎత్తుకెళ్లి అకృత్యానికి తెగబడ్డాడు. ఛత్తీస్‌గడ్‌లో పాఠశాల ప్రాంగణంలో తోటి విద్యార్థులే అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందనే వివిధ కారణాలతో కొన్ని ఘటనలు వెలుగులోకి రావడంలేదు.
దేశంలో 50 శాతంపైగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోనే నమోదవుతున్నాయని జాతీయ నేర విభాగ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. అకృత్యాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు కేసుల విచారణలో జాప్యం, నిందితుల తరఫున రాజకీయ నాయకుల అండ, నేర నిర్థారణలో పోలీసుల వైఫల్యం, లెక్కకు మిక్కిలిగా కోర్టులలో కేసులు పేరుకుపోయి తీర్పులలో జాప్యం జరుగుతున్నాయి. ఇటీవల వరంగల్‌లో తొమ్మిది నెలల పసిగుడ్డుపై అత్యాచారం, ఆపై హత్య చేసిన నిందితునికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నెలన్నరోజుల్లోనే విచారణ పూర్తిచేసి మరణదండన విధించడంపై సభ్యసమాజం హర్షించింది.
తల్లిదండ్రుల ఉదాసీనత
విద్యాలయాల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లోని చదువుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు ము రిపెంగా, వారు అడిగినంత డబ్బులివ్వడమే కానీ వారి ప్రవర్తన, వారి మిత్రులు ఎటువంటివారు, డబ్బును దేనికి ఖర్చుపెడుతున్నారు లాంటి పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది విద్యార్థులు పోకిరీల సావాసంతో మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిసలై విలాసాలకు అలవాటుపడి అకృత్యాలకు, అరాచాలకు పాల్పడి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోవడమే కాకుండా బాలికల వెంటపడి వారి భవిష్యత్తుకు నాశనం చేస్తున్నారు.
సక్రమ పవర్తన అలవడేలా..
విద్యా సంస్థలు సన్మార్గంతో ఉత్తమ భావిపౌరులుగా ఎదిగేటట్లు పాఠ్యంశాలలో కూడా మంచి నడవడిక, ఎదుటివారిపై స్నేహభావం, క్రమశిక్షణ, నైతిక విలువలు అలవడేలా చదువుతోపాటు సమత, మమత భావాలను పెంపొందించే బోధనలను పాఠ్యాంశాలతో తెలియజెప్పి ఉత్తమ మార్గంలో పయనించే విధంగా గురువులు హితబోధ చేసి వారిలో మార్పు తీసు కురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-దాసరి కృష్ణారెడ్డి 98853 26493