సబ్ ఫీచర్

డిప్రెషనా? జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం యాంత్రికమైన దినచర్య, పనుల ఒత్తిడి, సొంత పనులకు సమయం చాలకపోడం, ముఖ్యంగా ఉద్యోగినులు ఇంటా, బయటా అధిక శ్రమకు గురికావడం, తాము చేపట్టిన పనిలో పరాజయం, ఆప్తుల మరణం, భగ్నమైన ప్రేమ, సన్నిహితుల ఎడబాటు, ప్రేమరాహిత్యం, అభద్రతా భావం, ఒంటరితనం, తాము కోరుకున్నది వారికి లభించకపోవటం, అనారోగ్యాలు, అవమానం లాంటివి ఎనె్నన్నో కారణాలు డిప్రెషన్‌కు గురిచేస్తాయి.
ఇంకా మనోదౌర్భల్యం, మానసిక బలహీనత, మానసిక వైకల్యం లాంటివి డిప్రెషన్‌కు దారితీస్తాయి. అంటే మానసిక కారణాలు డిప్రెషన్‌కు గురిచేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా డిప్రెషన్‌తో బాధపడుతన్నప్పుడు, వారి ప్రవర్తన, మాటలు, మానసిక శారీరక లక్షణాలను బట్టి తోటివారు వారిలోని డిప్రెషన్‌ను గుర్తించవచ్చు.
ఆ లక్షణాలు ఏమింటే.. నిరుత్సాహంగా ఉండటం, నిరాశగా మాట్లాడటం, అభద్రతాభావాన్ని ప్రదర్శించడం, జీవితం పట్ల ఇష్టత లేకపోవడం, తన బతుకు నిరర్థకమని భావిస్తుండటం, విసుగు, చిరాకు, అసహనంగా ఉండటం, సహనం తగ్గిపోవడం, తొందరపాటు నిర్ణయాలు, మనస్థిమితం లేకపోవడం, ఆత్మన్యూతాభావం, తాము ఇష్టపడే విషయాలపట్ల అనాసక్తి, విముఖత, ఎవరితోనూ కలవకపోవడం, నెగెటివ్ థింకింగ్, తమంతట తాము నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆత్మహత్య చేసుకోవాలన్న కోరికతో ఆత్మహత్యాప్రయత్నం లాంటివన్నీ వారి మాటల్లో, చర్యల్లో స్పష్టంగా గోచరిస్తాయి.
డిప్రెషన్‌గలవారు అతిగా ఆహారాన్ని తింటారు లేదా ఆహారంపట్ల అయిష్టతగా ఉంటారు. అతిగా తినడంవల్ల బరువు పెరిగి స్థూలకాయులు కావడం, తక్కువ తినడంవల్ల బలహీనత ఏర్పడటం జరుగుతుంది. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయదు. నిద్రలేమి ఏర్పడుతుంది. స్వల్ప పనికే త్వరగా అలసిపోతారు. కీళ్ళనొప్పులు, నడుమునొప్పి వస్తుంది. దాంపత్య జీవితంపై అనాసక్తి కలుగుతుంది. హార్మోనుల వ్యవస్థలో మార్పులు కలుగుతాయి. నాడీ మండల వ్యవస్థ నిర్వహణలో లోపం ఏర్పడుతుంది. ఎసిడిటి, అల్సర్ లాంటి వంటి అనారోగ్యాలు వస్తాయి. గుండె కూడా అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ డిప్రెషన్‌తో బాధపడేవారికి ఏర్పడే శారీరక అనారోగ్యాలు.
తమంతట తాముగా డిప్రెషన్ బాధితులు ఆ స్థితినుంచి బయపడలేరు. కుటుంబ సభ్యులుగానీ, వారి సన్నిహితులు కాని కొన్ని పద్ధతులు అమలు పరుస్తూ, తమ సూచనలను, సలహాలను వారు పాటించేలా మానసికంగా సిద్ధంచేయాలి.
- డిప్రెషన్‌కు గురైనవారిని ఒంటరిగా వలదలకుండా వారి వెంటే ఉంటూ, వారి మానసిక అశాంతిని, దిగులును తొలగించాలి.- వారికి నచ్చని పనులను బలవంతంగా చేయించకూడదు. వారికి ఇష్టమైన పనులను స్వేచ్ఛగా చేయనివ్వాలి.
-అపసవ్యమైన ఆలోచనలనుండి వారి మనసును మళ్లించి వారి ఆలోచనలు సవ్యమైన దిశలో సాగేలా వారికి మృదువుగా నచ్చచెప్పాలి.
- డిప్రెషన్ నుంచి బయటపడటానికి, మనసులోని ఆందోళననూ, వ్యాకులతనూ తొలగించుకోవటానికి కుటుంబ సభ్యులందరి ఆదరణ, ప్రేమానురాగాలు అవసరమవుతాయనే విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుసుకుని ప్రవర్తించాలి.
- ఆత్మహత్య అనే భావనను వారి మనసులోకి రానీయకుండా, బతుకులోని మాధుర్యాన్ని వారికి అందించాలి.
- వారి మనసులోని అనుమానాలను, ఆందోళనలను తోటివారు పంచుకుంటూ, మానసిక ప్రశాంతత కలగజేయాలి.
-ప్రతిరోజూ వారిచేత వ్యాయామం చేయించాలి. అయితే బలవంతంగా కాకుండా, వ్యాయా మం చేయడాన్ని వారు ఇష్టపడేట్లుగా బోధించాలి. వ్యాయామం చేసేందుకు అనుకూలంగా మార్చాలి.
- వారు మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకోవటానికి వారితో హాస్య సంభాషణలు చేస్తూ, వారి మనసుకు నచ్చే మాటలను చెప్పాలి.
- హాస్యపుస్తకాలను, మంచి సాహిత్యంతో కూడిన పుస్తకాలను చదివేలా చేయాలి. మానసిక డిప్రెషన్‌కు ఊరట లభిస్తుంది.

- పి.ఎం. సుందరరావు 9490657416