సబ్ ఫీచర్

ఎంబ్రాయిడరీ సొగసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమీ లేని విషయాన్ని గురించి ఎవర్నయినా అడిగితే... ఏముందీ! ‘సూదిలో...’ అంటుంటారు చాలామంది వ్యంగ్యంగా.. కానీ మేలురకం పట్టువస్తమ్రయినా సూదీ దారానికి లోకువే. దాని కుట్టుబడికి కట్టుబడి ఉండాల్సిందే. ఆ సూదీ దారాలే ఫ్యాషన్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అదెలా అంటారా?
చకీల చమక్కులు, అద్దాల వెలుగులు, రాళ్ళ మెరుపులు, దారాల అందాలు, పూసల రంగులు వెరసి సూదీ దారంతో కుట్టే ఈ బుటేదారీ పని సృజనాత్మకత భారతీయ భారతీయ ఎంబ్రాయిడరీగా ఖండ ఖండాంతర ఖ్యతినార్జిస్తోంది. అంతర్జాతీయంగా ఆకట్టుకుంటోంది.
పెళ్ళి, పండగ, వేడుక ఏదైనా కానివ్వండి.. వర్క్ శారీ లేదా సల్వార్‌లతో కళకళలాడాల్సిందే. అలాగని ఎంబ్రాయిడరీ కేవలం మహిళలకే కాదు- షేర్వాణి, కుర్తా, లాల్చీ పైజమా మగవారి డ్రెస్సులకయినా కుట్టు అందాలుండాల్సిందే. పిల్లలకైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అపుడే పుట్టిన పాపాయిని ఉయ్యాల్లో వేయాలన్నా ఎంబ్రాయిడరీ చేసిన పట్టు లంగా కావాలి.
అరవయ్యేళ్ళ బామ్మ ఫంక్షన్‌కి వెళ్లాలన్నా పుల్కారీ లేదా కాశ్మీరీ వర్క్ చేసిన పట్టు లేదా ఫ్యాన్సీ చీర కట్టాల్సిందే. పెళ్లికి వచ్చేవాళ్ళను వదిలేస్తే, పీటలమీద కూర్చునే పెళ్లికూతురుకైనా, పెళ్ళికుమారుడికైనా ఎంబ్రాయిడరీ వర్కు వస్త్రాలు ధరించాల్సిందే. రిసెప్షన్‌కైతే ఈ ఫ్యాషన్ తప్పనిసరైంది. తరమేదైనా అందరికీ ఒకే తరహా ఫ్యాషన్.. అదే ఎంబ్రాయిడరీ. కుట్టు అందాలు దక్షిణాదిలో సైతం వర్క్ వస్త్రాలు తళతళలాడటం విశేషం. అసలెందుకీ క్రేజ్.. అంతగా ఆకట్టుకునేదేముంది ఇందులో? అని ప్రశ్నిస్తే ఒక్కటే సమాధానం- అందం. ఆ అల్లికల్లోంచి పుట్టుకొచ్చిందే ఎంబ్రాయిడరీ. ఆదినుంచీ మనిషి కళాపోషకుడేనన్నది తెలిసిందే.
చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.పూ. 3వేల సంవత్సరాలనుంచి ఎంబ్రాయిడరీ వాడుకలో వుంది. అచ్చం పెయింట్ చేసినట్లుగా కుట్టే ఓ ప్రత్యేక పద్ధతిలో కుట్టుపనిలో ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాల్లో భారత్ సైతం ఫ్యాషన్‌కు వేదికగా మారింది. అందులో సహజ రంగుల అద్దకం మాత్రం ప్రత్యేకంగా మనకే సొంతమైంది. ప్రపంచ ఎంబ్రాయిడరీలో మన దేశానికి ప్రత్యేకమైన గుర్తింపు వంద. పైగా భిన్న ప్రాంతాల్ని ఆయా ప్రాంతాల సంస్కృతుల్నీ మన ఎంబ్రాయిడరీ చక్కగా ప్రతిబింబిస్తుంది. ఏ ప్రాంతానికి చెందిన ఎంబ్రాయిడరీ అయినా అన్నింటిలోనూ ఆయా ప్రాంతాల్లో తిరుగాడే జంతువులు, పక్షులు, అక్కడ విరిసే కుసుమాలు. ఆయా ప్రాంతాల సంప్రదాయ నిత్య జీవన రీతులు, రంగులూ, దారాలు, డిజైన్లూ అన్నీ అక్కడికక్కడే ప్రత్యేకం.
కాలక్రమంలో మెషీన్లు రావడంతో ఎంబ్రాయిడరీ వేగం పెరిగింది. మధ్యలో కొంతకాలం హ్యాండ్ ఎంబ్రాయిడరీ నుంచి అంతా మెషీన్ వైపు మళ్లినా దేని క్రేజ్ దానిదే. రెడీమేడ్స్‌కి మెషీన్ ఎంబ్రాయిడరీ చక్కగా ఫిక్సయిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ డిజైన్లనీ, దుస్తుల్నీ రూపొందించగలిగే సౌలభ్యం ఇందులోనే వుంది.
ఫ్యాబ్రిక్‌ను బట్టి ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైనా రంగు దారాల్ని కలబోసి కుడితే అది అందంగానే వుంటుంది. అయితే కొన్ని కుట్లు కొన్ని రకాల వస్త్రాలమీదే మరింత మెరుస్తూ పనితనంలోనే గొప్పనాన్ని చాటుతాయి. ఈ ఎంబ్రాయిడరీ నాటినుంచి నేటివరకూ ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్. నిజానికి ఈ ఫ్యాషన్ స్వాతంత్య్రం రాక మునుపే నారీమణుల ఒంటిమీద తళుక్కుమన్నదే. నాటి ఫ్యాషన్ నేటి సెలబ్రిటీలతోపాటు సామాన్యుల్ని సైతం సందడి చేస్తోంది. ఎంబ్రాయిడరీ కేవలం దుస్తులకే పరిమితమా? కానే కాదు, బెడ్‌షీట్లు, కరెన్లు, నాప్‌కిన్లు, టేబుల్‌క్లాత్, కుర్చీలు, సోఫాసెట్లు, ఫ్రిజ్, టీవీ క్లాత్ వంటి ఫర్నీచర్ ఫ్యాబ్రిక్‌తోపాటు సంచులు, బ్యాగులు, ఆభరణాలు- ఇలా రకరకాల యాక్ససరీలు కూడా ఎంబ్రాయిడరీ సొగసుల్ని అద్దుకుంటున్నాయి.
దినదిన ప్రవర్థమానమయ్యే ఈ పరిశ్రమలోని నిపుణులు కొందరు ఎంబ్రాయిడరీకి కొత్తదనం ఆపాదించే ప్రయత్నంలో వున్నారు. త్రీడి ఎఫెక్ట్సు, అక్షరాలు రాయడం, బొమ్మలు గీతయం వంటివాటిలో సాఫ్ట్‌వేర్ టెక్నిక్స్ జోడించేందుకు కృషిచేస్తున్నారు.
సో.. సాంకేతికంగా.. ఆధునీకతతో నేటి, రేపటితరం కోసం మున్ముందు ఇంకా ఇంకా ఎనె్నన్ని అందాల్ని సృష్టించనుందో.. ఈ సూదీ దారం!?

-తులసి జ్యోతి దొప్పలపూడి