సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవ భావము
నీవు దైవత్వం దిశగా ఎదుగు. అంతేకాని, దేవుణ్ణి నీ స్థాయికీ, పశుత్వ స్థాయికీ దించకు. దేవుడంటే ఏమిటి? నీ ముందున్న ఫొటోయేనా? దేవుణ్ణి ఫొటో అనుకోటం కాదు. ఫొటోలో దేవుణ్ణి దర్శించు, భావించు, అర్చించు.
ఆయన అంతటా వున్నాడు. ఆయనను భావించటానికి ఏ చిన్న ప్రతిమయినా, సంకేతమయినా చాలు. ఆయన లేని చోటేముంది? శక్తీ, యుక్తీ, భక్తీ, ముక్తీ- అన్నీ ఆయనే!
జగత్ప్రభువు
ఒక మహనీయుడు రాజాస్థానములో ప్రవేశించి రాజును తప్ప అందరినీ పలకరించాడు. అతని నిర్లక్ష్యానికి రాజు కోపించి, ‘ఈయనకు ఉరిశిక్ష విధించాను. తీసుకొని వెళ్ళండి’ అని ఆజ్ఞాపించాడు. అప్పుడా మహనీయుడు. ‘రాజా! వీరందరినీ గమనించి నిన్ను గమనించలేదనే కోపంతో ఈ శిక్ష ఇచ్చావే! మరి నీవు నిత్యం అందరితోనూ ముచ్చటిస్తూ పదునాలుగు లోకాలకు ప్రభువైన ఈశ్వరుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు కదా! ఆయన నీకెంత ఘోరమైన శిక్ష వేయునో! అదే నా చింత అన్నాడు. ఆమాట విని రాజు యొక్క బుఱ్ఱ తిరిగింది. తన ప్రవర్తనకు సిగ్గుపడి ఆ మహనీయునికి పాదాక్రాంతుడైనాడు.
అంతా అవసరమే
భూమి నుంచి సూర్యుడు తొమ్మిది కోట్ల మైళ్ళ దూరంలో వున్నాడు. బాగా దూరంలో వున్న గ్రహం ఫ్లూటో. అది సూర్యుని నుండి 367 కోట్ల మైళ్ళ దూరంలో వుంది. అది సూర్యుని చుట్టూ తిరగటానికి 248 ఏళ్ళు పడుతుంది. ఇటువంటి బ్రహ్మాండమైన గోళాలనన్నిటినీ దేవుడెందుకు సృష్టించాడు? ఆశకొద్దీ సృష్టించాడా? లేక దీని మూలంగా ఆయన ఏదైనా పాఠాన్ని బోధించదలచాడా? కారణం లేకుండా కార్యం జరుగుతుందా? ఉపయోగం లేని పని సృష్టిలో ఉంటుందా? ఉదాహరణకు చూడండి! భూమి తన కక్ష్యపై తాను తిరుగుతూ వుంది. దానివల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. మేఘాలూ, వర్షాలూ కలుగుతున్నాయి. ఫలితంగానే పంటలూ, సంపదా, సౌభాగ్యం లభిస్తున్నాయి. ఇదంతా ఆయన అనుగ్రహం!
ఏకమేవా ద్వితీయం
ముస్లింలు అల్లాను ప్రార్ధిస్తారు. క్రైస్తవులు యెహోవాను ప్రార్థిస్తారు. వైష్ణవులు విష్ణువునూ, శైవులు శివుణ్ణీ ప్రార్థిస్తారు. ఎవరికి కావలసిన వాటిని ఆరోగ్యం కాని, సంపద కాని, చదువు కాని, సంతోషం కాని- వారి వారి దైవం వారికి సమకూరుస్తున్నాడు. అంటే ఏమిటి? దైవం అందరికీ ఒక్కటే అని అర్థం.
భిన్నత్వంలో ఏకత్వం
ప్రతి మానవునికి మూడు ప్రధానం. 1. దేశాభిమానము 2. త్యాగము 3. ఆధ్యాత్మిక దృక్పథము. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము. తెలుసుకోవటము- మనస్సు; చేయటము- దేహము; సాక్షీ భూతముగా ఉండటము- ఆత్మ, కనుక శరీరం, మనస్సు, ఆత్మయొక్క సమ్మిళితమే మానవత్వము. ఈ మూటింటియందూ ఉన్న దైవత్వము ఒక్కటే. అదే భిన్నత్వంలో ఏకత్వం.
అనే్వషణ
సత్యానే్వషణ అంటారు. ఏమిటి అనే్వషణ? సత్యం సర్వత్రా ఉంటున్నదే. అనే్వషణ ఎందుకు అనవచ్చు. దీనికి ఒక ఉదాహరణము. మన కన్నులు అమ్మను చూస్తుంటాయి. అదే కన్నులు బిడ్డను చూస్తున్నాయి. అదే కన్నులు భార్యను చూస్తున్నాయి. అదే కన్నులు వంట మనిషిని చూస్తున్నాయి. అయితే తల్లిని చూచే సమయంలో ఏ మనసుతో చూడాలి? బిడ్డను చూచే సమయంలో ఏ భావముతో చూడాలి? భార్యను చూచే సమయంలో ఏ తలంపుతో చూడాలి? వంట మనిషిని చూచే సమయంలో ఏలాగు చూడాలి? ఇదియే సత్యానే్వషణ. వీరు నలుగురు ఆడవారే. చూచే కన్నులు ఒక్కటే కాని ఎవరిని ఏ దృష్టితో ఏ భావంతో చూడాలన్నదే సత్యానే్వషణ. వెన్న ఉన్నది, వ్రేలితో కొట్టవచ్చు. ఇనుము ఉన్నధి, సుత్తితోనే కొట్టాలి. వెన్నను సుత్తితో కొడుతున్నామా? ఇనుమును వ్రేలితో కొడతామా?
పదార్థానికి తగిన ప్రయోగమే సత్యానే్వషణ.
ఇంకా ఉంది