సబ్ ఫీచర్

అందానికి, ఆరోగ్యానికి జ్యూస్ థెరపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూస్ థెరపీ గురించి విన్నారా..?
వాటర్, అరోమా, ఆయిల్ థెరపీల్లాంటిదే ఇది కూడా. దీనివల్ల ఆరోగ్యం మెరుగపడడమే కాకుండా ఎంత ఒత్తిడినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అయితే ప్రతినెలా మూడు రోజుల చొప్పున దీన్ని ఆచరించాలి. జ్యూస్ థెరపీ శరీరంలోని కణాల్ని శుభ్రపరుస్తుంది. కణాల్లో లోపాలుంటే వాటిని సరిదిద్దుకునే శక్తినిస్తుంది. జ్యూస్ థెరపీని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనే్న ‘డిటాక్స్ జ్యూస్ ఫాస్టింగ్’ అని కూడా అంటారు.
మనలో చాలామందికి ఒత్తిడిలో కూడిన జీవన విధానం వల్ల సరిపడా నిద్ర ఉండదు. అలాగే జంక్‌ఫుడ్స్, నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ వాడకం వంటివి పెరిగాయి. జంక్‌ఫుడ్స్ ద్వారా విష పదార్థాలు శరీరంలోకి చేరతాయి. వీటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.
అందుకే నెలలో మూడు రోజులపాటు జ్యూస్ థెరపీ చేయాలి. ఈ థెరపీలో మనం చేయవలసింది ఈ మూడు రోజులు ఘనాహారాన్ని తీసుకోకుండా అన్నిరకాల జ్యూస్‌లను తీసుకోవడమే. దీన్ని ప్రతినెలా ఒక క్రమంగా ఆచరిస్తే మంచి ఫలితాలిస్తాయి.
అసలు జ్యూస్ థెరపీ ఆచరించేవారు ముందు మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు ఆకలివేస్తున్న భావన మిమ్మల్ని వేధించదు. ఇది ప్రారంభించే వారం ముందు నుంచి బలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. జంక్‌ఫుడ్స్, అధిక కాలరీలున్న ఆహారాన్ని మానేయాలి. పిండి, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లు, కాఫీ, చాక్‌లెట్లు, నొప్పి నివారణులు, మత్తుమందులు, యాంటీ బయాటిక్స్ వంటివి వాడకూడదు. మూడు రోజులు డిటాక్స్ జ్యూస్ ఫాస్టింగ్‌కు పని ఒత్తిడి ఎక్కువగా ఉండని నెలలో ప్లాన్ చేసుకోవాలి.
థెరపీలో భాగంగా రోజుకు ఐదారుసార్లు రకరకాల జ్యూస్‌లు తాగాలి. నిమ్మరంతో మొదలుపెట్టాలి. రెండు గ్లాసుల నిమ్మరసం తాగిన తర్వాత కూరగాయల జ్యూస్ తీసుకోవాలి. తరువాత బత్తాయిరసం తాగాలి. టమాటో, కారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లను మధ్యహ్నం భోజనాకి రెండు, మూడు గంటలముందు ఇవి తీసుకోవాలి.
మధ్యాహ్నం పుచ్చకాయ, సాయంత్రం తోటక లేదా దోసకాయ జ్యూస్ తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు బత్తాయి, ఆపిల్, ద్రాక్షలను కలిపి జ్యూస్ చేసి తాగాలి.
ఇలా మూడు రోజులపాటు ఆచరించాలి. తర్వాత రోజుల్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే అన్నం, పప్పు, సూప్, కూరగాయలు, పెరుగు వంటి ఆహార పదార్థాలన్నమాట. ఈ ఆహారాన్ని నాలుగు రోజులపాటు తీసుకోవాలి. ఆహారంతోపాటు జ్యూస్‌లు కూడా రోజుకు ఒకటి, రెండుసార్లు తాగాలి. తర్వాత అలవాటుపడ్డ ఆహారం తీసుకున్నా, శరీరంలోకి విషపదార్థాలు మాత్రం చేరకుండా జాగ్రత్తపడాలి. పౌష్టికాహారం తినడంవల్ల శక్తి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ఏ థెరపీలో ఏయే జ్యూస్‌లు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా వుంది. ముందుగా కూరగాయల జ్యూస్ గురించి తెలుసుకుందాం.
టమాటోరసం: గుండె జబ్బులకు కారణమయ్యే హైపరాక్టివ్ ప్లేట్‌లెట్లను తగ్గిస్తుంది.
బీట్‌రూట్ రసం: రక్తాన్ని వృద్ధిపరుస్తుంది. మంచి శక్తినిస్తుంది. దీనిలో వున్న బీటా పొట్టను, పేగులను శుభ్రం చేస్తుంది.
క్యారెట్ రసం: దీనిలోని ప్రొ విటమిన్ ఎ, కెరోటిన్‌లు కాలేయానికి మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. పొట్టలో అల్సర్లను నివారిస్తుంది. ప్రధానంగా కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.
తోటకూర రసం: పచ్చి తోటకూర జ్యూస్‌ను అన్నం తినడానికి ముందు రోజుకు రెండుసార్లు తీసుకుంటే రక్తంలో చక్కెరమోతాదు అధికంగా వుంటే తగ్గిస్తుంది.
దోసకాయ రసం: ఇది కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
కుకుంబర్ రసం: అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా వుండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అన్నిరకాల చర్మ సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది.
పళ్ళ రసాల జ్యూస్‌లు
ఆపిల్ రసం: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హార్ట్‌ఎటాక్‌లు, స్ట్రోక్‌లు రాకుండా నివారిస్తుంది.
ఉసిరి రసం: ఉసిరి జ్యూస్ చక్కెర స్థాయిలను క్రమపరుస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయి రసం: జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని తగ్గిస్తుంది. యాంటీ బయాటిక్ మందులు వాడిన తర్వాత శరీరంలోని మంచి బాక్టీరియా నశిస్తుంది. దాన్ని తిరిగి ఏర్పరిచేందుకు బొప్పాయి జ్యూస్ ఉపయోగపడుతుంది.
ద్రాక్షరసం: ఇది అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. ధమనుల గోడలకు విశ్రాంతినిచ్చి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కార్డియోవాస్కులార్‌ను సంరక్షిస్తుంది.
నిమ్మరసం: బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మలబద్ధకాన్ని, డయేరియాను అదుపులో ఉంచుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండటంవల్ల రక్తపరిశుభ్రతకు పనిచేస్తుంది. కడుపులో వాయుపు, మంటను తగ్గిస్తుంది. ఆకలిని, జీర్ణశక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులకు, వాతానికి, రక్తపోటుకు, శరీరంలోని వేడిని తగ్గించడానికి నిమ్మరసం దోహదపడుతుంది.
ఇన్నిరకాల కూరగాయలు, పళ్ళరసాలతో జ్యూస్ థెరపీ చేస్తే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీర సౌందర్యానికి కూడా జ్యూస్ థెరపీ ఎంతో దోహదపడుతుంది. అంతకుమించి ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660