సబ్ ఫీచర్

కూతురు.. ఇంటికి వెలుతురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక సమాజంలో ఓవైపు మహిళలు అన్ని రగాల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. మరోవైపు ప్రగతికి దూరంగా అక్షర ఫలాలు నోచుకుండా వెనుకబడిన ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు తొలగిపోవడంలేదు. చిట్టితల్లుల భవిత అగమ్యగోచరంగా మారుతోంది. తల్లిదండ్రుల్లో అవగాహనలేమి, బాధ్యత కాకుండా బరువుగా భావిస్తుండటం, ఆడపిల్లల పాలిట శాపంగా మారింది. అమ్మాయే అమ్మగా సృష్టికి మూలమని తెలుసుకోవాలి. అందుకే ఆడపిల్లలను కాపాడుకోవాలి. భవిష్యత్తులో అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని పదిలపరచుకోవాలి. ఆడపిల్ల అనగానే గర్భస్రావాలు చేసుకునేవారి సంఖ్య ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. రానురాను అది తగ్గిపోయింది. ఎందుకంటే, 2011 జనాభా గణన ప్రకారం ఆడపిల్లల నిష్పత్తి తగ్గడమొక కారణం, ఒకవైపు ‘ఇంటి దీపం’ అంటూనే మరోవైపు భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఉన్నా అమలులో లోపాలు ఉండటంతో బాలికల శాతం ఏటేటా పడిపోతున్నది.
ఆడపిల్లను భారంగా భావించే ప్రస్తుత సమాజంలో కొడుకైనా, కూతురైనా తల్లిదండ్రుల పెంపకంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలకు వారి తల్లిదండ్రులు సరైన మార్గనిర్దేశనం చేయగలిగితే వారు అనుకున్న రంగంలో రాణించగలుగుతారని నమ్మకం నేటి తల్లిదండ్రుల్లో కలుగుతుండటం సంతోషదాయకం. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలంటే తల్లిందండ్రులకు ప్రాణం. గతంలో ఆడపిల్ల అనగానే పురిట్లోనే గొంతుకోసే తల్లిదండ్రులు ఉండేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఎందుకంటే ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీక కూతుళ్లు.
ఆడపిల్లే బెటర్
అతి పిన్నవయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా, తనలోని నైపుణ్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా మెరుగుపెట్టుకోవడం ద్వారానే సాధించింది. ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో ఓ మహాలక్ష్మి పుట్టినట్లే అని అంటారు పెద్దలు. ఇంట్లో అబ్బాయిలు ఎంతమంది వున్నా ఒక్క ఆడపిల్ల ఉందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆడపిల్ల లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది. ఇంట్లోవారికి ఎవరెవరికి ఏమీ ఇష్టమో బాగా తెలిసేదేది తల్లి తర్వాత కూతురికే. తల్లిదండ్రులను ప్రేమించడంలో కూతుళ్ళను మించినవారు ఇంకొకరు ఉండరు. తనకు పెళ్ళై వేరే ఇంటికి వెళ్లిపోయినాసరే తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోదు. అందుకే కూతురి ప్రేమ జీవితాంతం అంటారు పెద్దలు. స్నేహితురాలిగా, అమ్మగా అన్ని విషయాల్లోనూ తోడుగా నిలిచి సాయం చేస్తుంది కూతురు. అందుకే నేటి ఆధునిక కాలంలో తల్లిదండ్రులు కూడా కొడుకులతోపాటు కూతుళ్లను సమాన దృష్టితో చూసుకుంటున్నారు. ఆడపిల్లలపై వివక్ష తొలగాలనే ప్రధాన ధ్యేయంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు నాలుగో ఆదివారంనాడు ప్రపంచ కూతుళ్ల దినోత్సవం జరుపుకుంటారు. కుమారులతో సమానంగా కూతుళ్లను తల్లిదండ్రులు ప్రోత్సహించడంవల్ల ఒక కల్పనా చావ్లా నింగిలోకి దూసుకెళ్లింది. పి.టి.ఉష పరుగులరాణి అయింది. తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగి దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఆడ, మగ తారతమ్యం లేకుండా ఉండటానికే రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టిననాటినుంచే పెళ్లి అయ్యేవరకు బాధ్యత ప్రభుత్వనిదే అంటూ కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టాయి. అందుకే ఆడపిల్లలు పుట్టినా బాధపడే రోజులు పోయాయి.
లింగ అసమానతలు
నేడు అందరినీ ఆవేదనకు గురిచేస్తున్న సమస్య రోజురోజుకూ పడిపోతున్న స్ర్తి, పురుష నిష్పత్తి. ఈనాడు దేశ వ్యాప్తంగా 1000 మంది బాలలు వుంటే 933మంది బాలికలు ఉన్నారని. దీనినిబట్టి చూస్తే ఆడపిల్లల జనన శాతం ఎంతగా పడిపోతోందో అర్థమవుతోంది. ఆడపిల్లలపట్ల అభద్రతాభావంపోయి ఆడపిల్ల పుట్టిందంటూ ఆనందపడే రోజులు రావాలి. వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి. ఆడపిల్లలకు వృత్తి, విద్యా, శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక విద్యకు అధిక నిధులు కేటాయించాలి. ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు కేవలం నూటికి 10 నుండి 30 శాతం మాత్రమేవుంది. పసిపిల్లలపై కూడా పైశాచిక దాడులు జరుగుతున్నాయి. ఆడపిల్లలకు భద్రతాభావం కల్పించాలి, బాల్య వివాహాలను అరికట్టాలి. ‘కంటే కూతుర్నే కనాలి’ అనే భావన కలగాలి. అప్పుడే కూతుళ్ళ దినోత్సవానికి సార్థకత. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఎలాంటి బెంగ చెందకుండా మంచి చదువులు చదివిస్తే మెరుగైన సమాజం నిర్మాణమవుతుంది.
బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిని బతికించు.. అమ్మాయిని చదివించు) నినాదంతో ఆడపిల్ల భవిష్యత్తుకు పునాదివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి పథకం’ ప్రవేశపెట్టింది. 10 ఏళ్ళలోపు అమ్మాయిల పేరిట సుకన్య సమృద్ధి ఖాతాను తపాలా శాఖలో తెరిచే అవకాశం కల్పించింది. చదువు, వివాహం దృష్టిలో పెట్టుకుని ఈ పథకం అమలు చేస్తోంది. తల్లిదండ్రులు ఆడపిల్లలను క్రమశిక్షణతో పెంచగలిగి వారి లక్ష్యాలను నెరవేర్చేందుకు తోడ్పాటునందిస్తే అమ్మాయిలు తల్లిదండ్రుల కలలను వందశాతం నెరవేర్చే ప్రయత్నం చేస్తారు.
అమ్మాయి భారం అనే సంకుచిత ధోరణినుంచి అమ్మాయే బెటర్ అనే ఆలోచనకు రావాలి. కొడుకు - కూతురు సమానమే అనే సంకల్పం రావాలి. ప్రపంచంలోని బాల్య వివాహాల్లో 40 వాతం భారతదేశంలోనే జరుగుతన్నాయి. బాడ్మింటన్, టెన్నిస్ క్రీడాకారిణిలు పి.వి.సింధు, సానియా మీర్జా సాధించిన విజయాలు అందరికీ తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితల గాథలను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే కూతుళ్ళ దినోత్సవానికి సార్థకత. ఆడపిల్లలను చదివిద్దాం - లింగ వివక్ష లేకుండా చూద్దాం!

-కె.రామ్మోహన్‌రావు 9441435912