సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండితుడు: భాగవత బోధ
1119. బాగుగా జదువుకొనిన యొక బ్రాహ్మణుడు ధీమంతుడగు నొక రాజునొద్దకు వెడలి, ‘‘మహారాజా! నేను బాగుగా జదివిన పండితుడను. నేను మీకు భాగవతమును బోధింతమని వచ్చితిని’’ అనెను. ఆ యిద్దఱిలో బుద్ధిమంతుడు రాజు, ‘ఎవడేని నిజముగా భాగవతమునే బాగుగా జదివియున్న పక్షమున నట్టివాడు రాజాస్థానములకు బోయి ధనగౌరవములను సంపాదింపనెంచుటకంటె నాత్మజ్ఞానము నార్జించుటనే యెక్కువగా నభిలషించు’నని బాగుగా నెఱుగును. అందుచే రాజాతనితో నిట్లు పలికెను: ‘బ్రాహ్మణ వర్యా! మీ రాగ్రంథమును సరిగా జదువనట్లు కనబడుచున్నది. నేను మిమ్ము నా గురువుగా గైకొన వాగ్దానము చేయుచున్నాను. కాని మీరు వెడలి ముందాగ్రంథమును బాగుగా జదువుకొని రండు.’’ అంత నా బ్రాహ్మణుడు తన దారిని బట్టిపోవుచు నిట్లనుకొనెను: ‘‘నేను ఎన్నో సంవత్సరములనుండి భాగవతము ననేక పర్యాయములు తిరుగవేసి యున్నను నన్నీరాజు భాగవతము నర్థముచేసికొనని మూఢుని క్రింద గట్టినాడు! ఈ రాజెంతటి మూర్ఖుడో!!’’ ఐనను నా బ్రాహ్మణుడు భాగవతమును మఱొకసారి యామూలాగ్రబుగ బఠించి మఱల రాజునొద్దకు వచ్చెను. రాజు మఱల తన పూర్వపు మాటలనే చెప్పి యాతని బంపివేసెను. బ్రాహ్మణున కొడలు మండినది- ప్రాణము విసిగినది. ఐనను రాజటుల వర్తించుట కేదియో యొక కారణముండియుండునని వానికి దోచినది. అంతనతడింటికి బోయి దీక్షగా దన గదిలో గూర్చుండి భాగవతమును శ్రద్ధగా బఠింప నారంభించెను.
క్రమక్రమముగా భాగవతము నందలి గూఢార్థము లాతనికి గోచరింపసాగెను. బుద్బుద ప్రాగములగు ధనము, గౌరవము, రాజులు, ఆస్థానములు మొదలగు విషయముల వెంట బరువులిడుట కేవలము వ్యర్థమని వాని వినిర్మల దృష్టికి దట్టెను. నాటినుండి యా బ్రాహ్మణుడు భగవదారాధన చేయుచు, మోక్షమునే తన పరమావధిగా భావించి మహానిష్ఠా గరిష్ఠుడై యుండెను. ఇక రాజునొద్దకు వెడలుదమను తలంపే వాని హృదయమున లేదయ్యెను. ఇట్లు కొన్ని యేండ్లు గడచిన పిమ్మట బ్రాహ్మణుడేమిచేయుచుండెనో యనుతలపు గలుగరాజు వానిని జూచుటకై వానియింటికి వెడలెను. బ్రాహ్మణుని ముఖము భక్తిజ్ఞానములతో దేదీప్యమానమై ప్రకాశించుచుండెను. రాజు వానికి సాష్టాంగ ప్రణామమొనర్చి యిట్లు పలికెను: ‘‘స్వామీ! భాగవతార్థమును దామిపుడు సంపూర్ణముగా గ్రహించితిరని నాకు దెల్లమైనది. ఈదీనుని శిష్యునిగా స్వీకరింతురేని సంసిద్ధుడై యున్నాడు.’’
జమీందారునిచే హింసింపబడిన సాధువు
1120. ఒకానొక గ్రామములో నొకమఠముండెను. మఠమునందలి సన్న్యాసులు భిక్షాపాత్రలను జేబూని యూరిలోనికి బోయి భిక్షాటనము చేయువారు. ఒకనాడొక సన్న్యాసి యిట్లు భిక్షాటనము చేయుచు నొక జమీందారుడు నొక పేదవానిని కఠినముగా గొట్టుచుండుట జూచెను. దయార్ద్ర హృదయుడగు నా సన్న్యాసి వానిని గొట్టవలదని జమీందారుని బతిమాలుకొనెను. యా జమీందారుడు తన క్రోధానలమును సన్న్యాసి మీదికి త్రిప్పెను.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది