సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతట సన్న్యాసి రోగిని జూచి యిట్లు పలికెను. ‘‘చూచితివా? నీ నిమిత్తమై యెవ్వరును బ్రాణమర్పింప సిద్ధపడువారు లేరైరి. ‘లోకములో నెవరిమీదను ఆశపెట్టుకొనుట తగ’దని నేననిన మాట లిప్పటికైనను నీకు బోధపడినవా?’’ లోకము యొక్క రుూ ధోరణినంతయు బ్రత్యక్షముగా జూచిన యా బ్రాహ్మణుడపారమైన సంసారమును విడనాడి యా సన్న్యాసి ననుసరించెను.
భార్య యొక్క ప్రేమను పరీక్షించిన హఠయోగి
1108. తన భార్యకు దాననిన పంచప్రాణములు కావున సన్న్యసింపజాలకున్నానని యొక శిష్యుడు గురునితో జెప్పెను. ఆ శిష్యుడు హఠయోగాభ్యాసము సాగించువాడు. అతడు చెప్పిన కారణము వట్టి నెపమని బోధించు తలంపున గురువు వానికి గొన్ని హఠయోగాభ్యాసములను నేర్పెను. హఠాత్తుగా ఆ శిష్యుని యింటిలో నొకనాడేడ్పులతోడను బెడబొబ్బల తోడను బెద్ద గందరగోళము వినవచ్చెను. ఇరుగుపొరుగు వారందఱును బరుగెత్తుకొని యా యింటికి వచ్చి చూడగా, హఠయోగి విచిత్రముగా నొక గదిలో మెలికలు దిరిగి నిశ్చలుడై పడియుండెను. అందఱును బ్రాణముపోయినదని తలంచిరి. ‘‘అయ్యో! ఏమైపోతిరి? మమ్ముల నెందుకు విడనాడిపోతిరి? అయ్యయ్యో! ఇంతలో నిట్టియాపద వచ్చునని కలనైనను దలపనైతిని కదా!’’అని భార్య విలపింపసాగెను. ఇంతలో బందుగులు వచ్చి పాడెగట్టి శవమును దహనమునకై తీసికొనిపోవ సిద్ధపడిరి. కాని వారికొక గొప్ప చిక్కు తటస్థించెను. ఆ కళేబరము మెలికలు తిరిగి యుండెను గాన ద్వారములో నుండి రాదయ్యెను. అది చూచి పొరుగు వాడొకడు గొడ్డలిని దెచ్చి ద్వారబంధమును దెగగొట్టనారంభించెను. అంతవఱకు నోదార్ప వీలులేకుండ వెక్కి వెక్కి యేడ్చుచున్న భార్య గొడ్డలి చప్పుడు వినబడగానే యక్కడికి బరుగిడిపోయి, కన్నులొత్తుకొనుచు, ‘ఏమి చేయుచున్నారు?’ అని యాదుర్దాతో నడిగెను.
‘‘నీ భర్తను ద్వారముగుండా తీసికొనిపోవ వీలులేనందున ద్వారబంధమును దెగగొట్టుచున్నా’’మని పొరుగువాడొకడు చెప్పెను. అంతట నామెయిట్లనెను: ‘‘వద్దు, వద్దు, ద్వార బంధమును దెగగొట్టవద్దు. నేనిపుడు వితంతువను, దిక్కులేని దానను. తండ్రి లేని రుూ బిడ్డలను బోషించుకొనవలసిన దానను. మీరివుడీద్వార బంధమును దెగగొట్టిన పక్షమున దీనిని మఱల మరమ్మత్తు చేయించుకొనుటెట్లు? నా భర్తకు సంభవించినదేమో సంభవించినది-చేతులను, కాళ్లను నఱికి యాయనను బయటికి దీసికొనిపొండు.’’ తాను సేవించిన మూలిక యొక్క ప్రభావమప్పటికి తగ్గిపోవుటచే హఠయోగి దిగ్గున లేచి యిట్లఱచెను:
‘ఓసీ! నా కాలుసేతులు నఱుకుమనుచుంటివా?’’అట్లనుచు నిల్లువాకిలిని విడిచిపెట్టి- సంసారమును త్యజించి-యాతడు గురుని వెంబడించెను.
మాయయొక్క స్వభావము
ముగ్గురు దొంగలు
1109. ఒక మనుష్యు డడవులగుండా ప్రయాణము చేయుచుండెను. త్రోవలో ముగ్గురు దొంగలు వానిని ముట్టడించి వానియొద్దనున్న సొమ్మంతయు దోచుకొనిరి. వారిలో నొకడు ‘‘వీనిని జీవముతో విడిచి ప్రయోజనమేమి?’’అనుచు వానిని నఱకుటకై కత్తినెత్తెను. ఇంతలో రెండవ దొంగ వానినాపి, ‘‘నామాట విను, ఈ నిర్భాగ్యుని జంపి యేమి ప్రయోజనము?

- ఇంకాఉంది