సబ్ ఫీచర్

తొలి ఆదివాసీ పైలట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23 సంవత్సరాల అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. కమర్షియల్ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్‌గా ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అనుప్రియ లక్రాకు అభినందనలు తెలియజేశారు. ‘అనుప్రియ నిబద్ధత, పట్టుదల చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు’ అని ముఖ్యమంత్రి అనుప్రియ లక్రాను ప్రశంసించారు. అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా ఒడిశా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుండి పైలట్ కావాలని కలలు గన్న అనుప్రియ 2012లో తన ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్ ప్రవేశ పరీక్షకై సన్నద్ధమైంది. అందులో పాసై భువనేశ్వర్‌లోని పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. ఒడిశా నుంచి పైలట్‌గా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళ అనుప్రియే కావడం విశేషం.