సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రాహ్మణునకు నమ్మకము కుదురలేదు. తాను రేయింబవళ్లెవరినిమిత్తమై పడరాని పాట్లు పడుచుండెనో యటువంటి తన కుటుంబములోనివారు తన కవసరముపట్ల సాయము చేయదగిన యాప్తులు కారని యాతడెట్లు భావింపగల్గును? కావున నిట్లనెను: ‘‘స్వామీ నాకిసుమంత తలనొప్పి వచ్చెనా, నా తల్లి తహతహలాడిపోవునే! నా బాధ తొలగు నిమిత్తము తన ప్రాణమునైనను సంతోష పూర్వకముగా ధారపోయుటకు సంసిద్ధమగునే! అటువంటి నా తల్లిని నేను నమ్ముకొనలేని పక్షమున నేనింకెవరిపై నాధారపడగలనో యూహింపజాలను!’’ అందులకు సన్న్యాసి యిట్లనెను:
‘‘అటులనా! ఐనపక్షమున నామె నీకు పరమాప్తురాలగుటకు సందియము లేదు. కాని నిజము చెప్పవలసి వచ్చిన యెడల నీవు చాల పొరపడుచున్నావు. నీ తల్లిగాని, భార్య గాని, కొడుకు గాని నీ నిమిత్తము తన ప్రాణముల నర్పించునని యెన్నటికిని నమ్మబోకుము. కావలసినచో నా మాటల యొక్క సత్యమును ఋజువు చూడవచ్చును; ఇంటికిబోయి కడుపులో శూలచే మితిలేని బాధపడుచున్నటుల నటించుచు మూలుగు చుండుము. నేను వచ్చి నీకొక ‘తమాషా’ చూపెదను.’’
అంత నా బ్రాహ్మణుడాలాగుననే చేసెను. వైద్యులెందఱో రావింపబడిరి. గాని యెవరు నేమియు జేయజాలరైరి. రోగి తల్లి వెక్కివెక్కి యేడ్చుచుండెను, ఆలుబిడ్డలు రోదనము చేయుచుండిరి. ఆ తరుణమున సన్న్యాసి వచ్చెను.
‘‘ఈ వ్యాధి ప్రాణాపాయకరమైనది. ఎవరైనను ఈ రోగి నిమిత్తము తన ప్రాణము నర్పించువారుండిననేగాని యే మాత్రమును ఆశలేదు’’ అన్నాడు సన్న్యాసి. ఈ మాటలు వినియెల్లరును దెల్లబోయి నిలుచుండిరి. ఆ సన్న్యాసి రోగియొక్క ముదుసలి తల్లిని జూచి యిట్లు పలికెను: ‘‘మీ యందఱను బోషంచు నీ కుమారుడు మరణించిన వెనుక వృద్ధాప్యమున నీవున్నను లేకున్నను నొక్కటియే. వాని జీవనమునకు మాఱుగా నీ జీవము నర్పింతువేని, నీ కుమారుని రక్షింపగలను. నీవు వాని తల్లివై యుండియు నీపాటి త్యాగము చేయని పక్షమున లోకములో వానికిక దిక్కెవ్వరు?’’
ఆ వృద్ధస్ర్తి కండ్ల నీరు పెట్టుకొని దగ్గుచు, తడబడుచు నిట్లనియెను: ‘‘నిజమే, నాయనా! నా బిడ్డకోసము నన్ను మీరేమి చేయుమని సెలవిచ్చినను జేయుటకు సంసిద్ధురాలను. నా ప్రాణమా! వాని బ్రదుకుతో పోల్చిన పక్షమున నాదేపాటిది? కాని నాయనా!- నేను చచ్చిపోయిన తర్వాత, ఈ పసికూనలందఱు నేమైపోదురో యను తలపే నన్ను బిఱికిదానిని జేయుచున్నది. ఎంత పాపము చేసితినో కాని రుూ పసికూనలను విడువజాలకున్నాను!’’
సన్న్యాసికిని దన యత్తగారికిని జరిగిన రుూ ప్రసంగమును వినుచుండిన రోగి భార్య కండ్ల నీరొత్తుకొనుచు దన తల్లిదండ్రుల జూచి, ‘‘మీరేమగుదురో యను చింతచే నేనీ త్యాగమును జేయజాలకున్నాను. అయ్యయ్యో!’’ అని విలపింపసాగెను. ఆమె వైపు తిరిగి సన్న్యాసి, ‘అమ్మా! తల్లి వెనుక తీసినప్పుడు నీవైనను నీ ప్రాణనాథునికోసము ప్రాణమర్పింపరాదా?’’ అనియెను. అంత నామె, ‘‘అయ్యో! ఎంత పాపిష్ఠిదాననోకదా! నా నుదుట వైధవ్యము వ్రాయబడి యున్నది కాబోలును. తల్లిదండ్రులను దుఃఖసాగరమున విడిచిపోవుటకు బ్రాణమొప్పకున్నది!’’ అని వాపోయెను. ఈ రీతిగా బ్రతివారును తప్పించుకొనిరి.
- ఇంకాఉంది