సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఱునాటి యుదయమున ఫలాని పెద్దమనుష్యుని తోటలోని కొక సాధుపుంగవుడు వచ్చియున్నాడని ఊరెల్ల జెప్పుకొనసాగెను. అందుచే వందల కొలది జనులు ఫలపుష్పాదులతో సాధువును బూజించుటకై యచటికి రాసాగిరి. జనులాతనికి సాష్టాంగ పడుచుండిరి. వెండి బంగారు నాణెము లాసాధువుమ్రోల ధారాపాతముగా బడుచుండెను. అప్పుడాపల్లెవాడిట్లనుకొనసాగెను: ‘‘ఆహా. ఏమి విచిత్రము! నిజముగా నేను సాధువును కాను. ఐనను వీరందఱును నన్నింతగా బూజించు చున్నారు! నేను నిజమైన సాధువనే ఐనపక్షమున భగవంతుడే నాకు జిక్కగలడు!’’
ఈ విధముగా కృత్రిమమైన యనుకరణము సైతమాపల్లెవానికి జ్ఞానప్రబోధకమైనది.
సాధువు: యోగశక్తులు
1104. ఒక సాధువునకు గొప్ప మహిమ లలవడినవి; వానిచే నతడు గర్వియైనాడు. ఐనను మొత్తముమీద నాతడు చాల మంచివాడు, తపశ్శాలి. భగవానుడు వానికి బుద్ధిగఱపనెంచి, సన్న్యాసి వేషము దాల్చి, వానిని సమీపించి యిట్లు పలికెను: ‘‘అయ్యా, మీరు మహామహిమములను సంపాదించితిరని వినియున్నాను!’’ సాధువు సగౌరవముగ స్వాగతము దెలిపి యాతని గూర్చుండజేసెను. అప్పుడే యొక యేనుగావైపు పోవుచుండుట చూచి సన్న్యాసి సాధువుతో, ‘‘అయ్యా, మీరీ యేనుగును ఇచ్ఛామాత్రమున జంపకలరా?’’ అని యెను. సాధువు, ‘‘ఆహా! దానికేమి?’’ యని చేతితో కొంత మట్టిని దీసి మంత్రించి యేనుగుపై జల్లెను. ఆ యేనుగు గిజగిజ దన్నుకొనుచు బడి చచ్చినది. దానిని జూచి సన్న్యాసి, ‘‘ఓహో! మీ శక్తి యత్యద్భుతమైనది. ఎంత యవలీలగా నేనుగును జంపితిరి!’’ అని పొగడెను. సాధువు సంతృప్తిపడి చిఱునవ్వు నవ్వినాడు. అంతట సన్న్యాసి మఱల ‘‘స్వామీ, ఈ యేనుగును తిరిగి బ్రదికింపగలరా?’’ అనెను. సాధువు, ‘‘ఆహా! అదియు జేయవచ్చును’’ అని మఱల గొంత మట్టిని మంత్రించి యేనుగుకళేబరము మీద జల్లగా నేనుగు లేచి నిలుచుండెను. అంతట సన్న్యాసి యిట్లు విమర్శించి పలికెను: ‘‘నిజముగా నత్యద్భుతము మీ మహిమ! కాని మిమ్మొకవిషయమడుగదలచినాను. క్షణములో మీరొక యేనుగును జంపి తిరిగి బ్రతికించినారుగదా! దానివలన మీకేమి లాభము సిద్ధించినది? ఏమి యభివృద్ధి చేకూరినది? భగవంతుని బొందుటకు మీకిదియేమైన దోడ్పడినదా?’’ ఇట్లనుచు ఆ సన్న్యాసి యదృశ్యమయ్యెను.
కట్టెలు కొట్టువాడు: సన్న్యాసి
1105. కట్టెలు కొట్టువాడొకడు వనమునుండి తెచ్చిన కట్టెల మోపుల నమ్ముకొనుచు బహుకష్టజీవియై కాలము గడపుచుండెను. ఒకనాడతడు కట్టెలు కొట్టుచుండగా నొక సన్న్యాసి వనమునుండి పోవుచు వానిని జూచి, ‘‘వనమధ్యమునకు సాగిపొమ్ము. దానివలన నీకు విశేషలాభము కలుగును’’ అని హితోపదేశముచేసెను. మఱునాడాతడు చెప్పినట్లే వనములోనికి సాగిపోగా నచ్చట నొక మంచి గందపు జెట్టు గాన్పించెను. ఆతడమితానందభరితుడై తాను మోయగలిగినన్ని గందపు గట్టెలు గొట్టి యంగడిలోనికి దీసికొనిపోయి విక్రయించి విశేష లాభమును బొందెను. ‘‘నన్ను ముందునకు సాగిపొమ్మని యామహానుభావుడు చెప్పినాడుగదా! కాని రుూ గందపు జెట్టు మాట చెప్పలేదేమి? ఇంకను ముందునకు బోయిచూచెదను’’ అని మఱునాడాతడు మంచి గందపు జెట్లను దాటి మఱికొంతదూరము పోయెను.

- ఇంకాఉంది