సబ్ ఫీచర్

లేటు వయసులో అమ్మ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మతనంతోనే అసలైన పరిపూర్ణత వస్తుందని భావిస్తుంది మహిళ. అందుకే మరణానికి కూడా సిద్ధబడి బిడ్డను కంటుంది అమ్మ. తన శరీరాన్ని చీల్చుకు పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకుని అప్పటివరకు పడిన కష్టాన్ని మరిచిపోయి మురిసిపోతుంది తల్లి. అందుకే పెళ్ళైంది మొదలు సంతానం కోసం ఎదురుచూస్తుంది. మహిళే కాదు ఆ ఇంట్లోని వారు కూడా పెళ్ళైంది మొదలు కొత్తతరం కోసం ఎదురుచూస్తారు. అమ్మాయి శుభవార్త ఎప్పుడు చెబుతుందా? అని అడుగుతూ ఉంటారు. మహిళకు సంతానభాగ్యం లేకపోతే అదో శాపంగా భావిస్తారు.
తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ కూడా తల్లి కావడానికి చాలా కష్టాలు పడింది. యరమాటి సీతారామరాజారావు, మంగాయమ్మలకు 1962, మార్చి 22న వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆ దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఆశ తీరలేదు. వారు తిరగని ఆసుపత్రి లేదు.. మొక్కని దేవుడు లేడు అయినా వారికి సంతానం కలగలేదు. పిల్లల కోసం కలలు కంటూనే ఆ దంపతులు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినా కూడా మంగాయమ్మకు తల్లి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందరూ మంగాయమ్మను ‘గొడ్రాలు’ అని చుట్టుపక్కల వాళ్లు నిందిస్తుంటే.. మంగాయమ్మ చాలా బాధపడేదట. అందుకే ఆమె పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నానని మంగాయమ్మ ఎప్పుడూ తన సన్నిహితులతో చెప్పేవారట. మంగాయమ్మ భర్త రాజారావును కూడా అందరూ ‘గొడ్రాజు’ అని పిలిచేవారట. వారు పిల్లల కోసం చాలారకాల ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారట. చివరికి తమ పక్కింటిలో ఉన్న మహిళ 55 ఏళ్ల వయస్సులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి కావడంతో, తానూ పిల్లల కోసం ఆ పద్ధతిని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది మంగాయమ్మ. అలా గత సంవత్సరం నవంబరులో గుంటూరులోని ఒక నర్సింగ్‌హోమ్‌కు మంగాయమ్మ దంపతులు వెళ్లి ఐవీ ఎఫ్ నిపుణులైన డాక్టర్ ఉమాశంకర్‌ను కలిశారు. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేమీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్సను ప్రారంభించారు. మంగాయమ్మ మెనోపాజ్ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని, మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించింది. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం ధరించినట్లు తేలింది. అప్పటినుంచి ఆమెను ఆసుపత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసింది. అలా మంగాయమ్మకు సిజేరియన్ ఆపరేషన్ చేసి ఇద్దరు కవల ఆడపిల్లలను బయటకు తీశారు వైద్యులు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు. పిల్లలు ఇద్దరూ ఒక్కొక్కరు 1.8 కిలోల చొప్పున బరువు ఉన్నారు. పిల్లలను ఆరు గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. తరువాత వీరిద్దరూ 21 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు.
తనకు పుట్టిన కవల ఆడపిల్లలను చూసి మురిసిపోతున్న మంగాయమ్మ ఎంతో సంతోషంతో ‘ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన సమయం. ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎందరో డాక్టర్లను కలిశాం. గొడ్రాలు అని అందరూ అంటుంటే చాలా బాధలు పడ్డాం. ఇద్దరు బిడ్డలు కలగడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇదంతా డాక్టర్‌గారి చలువ’ అంటూ ఎంతో సంతోషంగా పిల్లలను చూస్తూ మురిసిపోతోంది ఈ 73 సంవత్సరాల అమ్మ.
ప్రపంచ రికార్డు
73 సంవత్సరాల వయస్సులో మంగాయమ్మ కవలలకు జన్మనివ్వడం ప్రపంచ రికార్డు. ప్రస్తుతం గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం 67 సంవత్సరాల వయస్సులో ఒక మహిళ పిల్లలకు జన్మనిచ్చింది. మంగాయమ్మ 1947, జులై ఒకటో తేదీన జన్మించింది. ఇప్పుడు ఆమెకు 73 సంవత్సరాలు. ఈ వయసులో కవల పిల్లలకు జన్మనివ్వడం ప్రపంచ రికార్డు అని మంగాయమ్మకు వైద్యం చేసిన డాక్టర్ చెబుతున్నాడు.