సబ్ ఫీచర్

ఆమే నా ఆదర్శ మార్గదర్శకురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒక వ్యక్తి బాహ్య స్వరూపం, వక్తృత్వ పటిమ, వాగాడంబరం చూపే ప్రభావం తాత్కాలికమే.. బోధించే వారి వ్యక్తిత్వమే వినే వారిపై, కాలంపై చెరుపరాని ముద్రను వేస్తుంది. వారి జీవితం, నడవడికే కొన్ని తరాలపాటు కరదీపికగా నలుగురికి దారి చూపిస్తుంది, వారి ప్రాభవం సూర్యోదయం లాగా ప్రవర్థమానవౌతుంది’’ అంటారు స్వామి వివేకానంద.
ఒకరోజు మా అమ్మ స్నేహితురాలు సరస్వతిగారు నా గురించి, ‘‘మీ శ్యామల చదువు అల్లాటప్ప చదువుకాదు చూడామణి! మనస్తత్వ శాస్త్రం, అందులోనూ మన కర్నూలు కసిరెడ్డి వెంకటరెడ్డి కాలేజీలో అధ్యాపకురాలు లక్ష్మీకాంతమ్మ దగ్గర చదువుతున్నది సుమా!’’ అని అన్నారు.
‘‘గీత మనకు ఏమని బోధించింది? ఎదుటివారిని చదువు, మంచిని గ్రహించు, చెడును వీడు అని. అలా ఎదుటివాళ్ళ మనస్సును గ్రహించే ధీశక్తితో మీ అమ్మాయి అందరికీ స్నేహమయి తెలుసా?’’ అంటుంటే విని తన్మయినయ్యాను, మా లక్ష్మీకాంతమ్మ మేడమ్‌ను ప్రశంసిస్తుంటే, నా మనస్సు పులకించిపోయింది!
అది నేను డిగ్రీ చదివే రోజులు! అధ్యాపకులందరూ మెరికలే! అది ప్యూబర్టీ- బాల్యానికీ యవ్వనానికి నడుమ పరిణామ దశ! అనాటమీని వివరిస్తూ, ఆ మధ్య దశలో ఆడపిల్లలు, మగపిల్లల్లో కలిగే శారీరిక మార్పులు, హార్మోనుల ప్రభావం, వారిలో కలిగే అలజడులు, ఉద్విగ్నభావాలు, తల్లీదండ్రులకు చెప్పుకోలేక, తోటివారితో పంచుకోలేక, గురువుల ముందు బయటపడలేని భావావేశ సరిక్రొత్త స్థితి! అలాంటప్పుడు యువత ఎలా నడుచుకోవాలో ఈక్యూ - ఇమోషన్ కోషెన్ట్‌ను ఎలా మలుచుకోవాలో, మనోనిగ్రహానికి మార్గాలు, ఆ సహజ మార్పుల గురించి లక్ష్మీకాంతమ్మ మేడమ్ కూడా అప్పటికి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుండి వచ్చిన పోస్టుగ్రాడ్యుయేట్, ఆమె కూడా చిన్నదే! అంతటి విజ్ఞత, సమయస్ఫూర్తి ఆమెలో అంత చిగురుటాకులాగా సన్నగా ఉన్నా, దేహబలం కాదు, ఆత్మబలం మిన్న అని వారిలోని గాంభీర్యతతో, నలుబది ఐదు నిమిషాల తరగతిలో ఆమె బోధనాప్రమాణాలు ఊహించలేనివి! ముప్పది నిమిషాలు కేవలం, ఇమోషిగ్, ఇన్సైట్, ఇంట్రాస్పెక్షన్, ఇన్సిటింక్ట్స్, నిద్రలో నడక, నిద్రలేమి, స్కిజోఫ్రేనియా లాంటి అసాధారణ మానసిక రుగ్మతలు లాంటి కానె్సప్టులను వివరించి, ఐదు నిమిషాలు తరగతిలో చర్చ, అభిప్రాయాల వివరణ తెలుపడం, ఇక మేము మిగిలిన పది నిమిషాల్లో ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకున్నామో ఒక్క పారాగ్రాఫ్‌లో వ్రాసి చూపాం. అలా ఆమె బోధనా పద్ధతి బహు అమోఘం! బి.ఏ.లో మరి నా సబ్జక్ట్సు: అడ్వాన్స్ తెలుగు, సైకాలజీ, ఎకనామిక్స్. అందరూ మాతృకలైన అధ్యాపకురాండ్రే.
పరమాత్ముని లక్ష్మీకాంతంగారు నాకు స్ఫూర్తినిచ్చిన గొప్ప గురువు! అంతలా ‘గొప్ప’, ‘బహు’ ‘ఉన్నతి’ ‘శ్రేష్ఠ’-అన్న విశేషణాలు ఆమె బోధనకు అమరుస్తున్నాను అంటే బిఏ విద్యార్థులకు ఎమ్.ఎ., పిహెచ్‌డీ లెవెల్లో మనస్తత్వ శాస్త్రాన్ని, చైల్డ్ సైకాలజీ, సోషల్ సైకాలజీ, అబ్‌నార్మల్ సైకాలజీ- మూడు విభాగాలను క్షుణ్ణంగా బోధించడం, మాలో ఆ శాస్త్ర పరిజ్ఞానంవల్ల మా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, మానవతా విలువల పెంపుదలకు, మంచి గుణవంతులుగా, వినయం, విధేయత, ప్రేమ, దయ, క్షమ, కృషి, త్యాగనిరతి, సరియైన అవగాహన ఎదుటివారి గురించి మంచి ఆలోచనలు, జీవితంలో నిజాయితీగల జీవనశైలి మాలో రూపొందించారు. ఆమెకు నేనేమిచ్చి ఋణం తీర్చుకోగలను?! అందుకే ఈ నా కృతజ్ఞతా పూర్వక వ్యాసం ఈ గురుపూజోత్సవంనాడు ప్రచురణకు పంపాను. అదే మరి నావరకు చంద్రునికో నూలుపోగు!
నేను ఎమ్‌ఏ ఆంగ్లం, ఎమ్.ఎడ్. విద్యార్హతలతో ఉపాధ్యాయ వృత్తిలో ఆమె అడుగుజాడల్లో నడిచాను. పిల్లల మనస్తత్వం తెలుపుకుంటూ, వారిలో ‘ఆటిజం’ను గుర్తించడం, వారి తల్లిదండ్రులు, వారి ఆర్థిక పరిస్థితులు, వారి ఇండ్ల వాతావరణం, సమస్యలు, వారి తల్లిదండ్రుల అనుబంధం, అలవాట్లు తెలుసుకునే ప్రయత్నం, కొంత జ్ఞాపకశక్తి తక్కువ ఉన్నా వారిని పైస్థాయికి తేవడంలో ఓర్మితో, పట్టుదలతో, నమ్మి మనలకు వారి బిడ్డల బాధ్యతనప్పగిస్తున్న విచక్షణతో నేను కృషిచేసి మదనపల్లి ఆరోగ్యమాతా ఇంగ్లీషు మీడియమ్ సిస్టర్ల పాఠశాలలో 18 సం.లు విరామమెరుగని పరిశ్రమ (కొన్నిసార్లు ఇంటిని విస్మరించాను) చేసి ప్రభుత్వం వారినుండి ‘ఉత్తమ ఉపాధ్యాయిని’అవార్డు; ‘ఆదర్శ ఉపాధ్యాయిని’అవార్డును హైదరాబాదు వికాస్ ది కానె్సప్ట్ పాఠశాల యాజమాన్యం వారినుండి, రుక్మిణీదేవి అరుండేల్ బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టరు వాసుదేవ్, మహేశ్వరి, ఆర్‌కె లక్ష్మణ్‌గార్ల వరుసలో టీచర్ సపోర్టర్‌గా మన్ననలనంది, లయన్స్ క్లబ్‌వారిచే ‘‘జీవిత సాఫల్య పురస్కారాన్ని’’అందుకున్న ఉపాధ్యాయినిగా ఎంతోమంది విద్యార్థులకు విద్య, నైతిక విలువలతోబాటు, వారిలోని ‘ఇనే్నట్ టాలెంట్’ సహజ కౌశల్యాలను వెలికితెచ్చి, వారిని అసలైన మానవులుగా, భావిభారత పౌరులుగా తీర్చిదిద్దగలిగానన్న ఆనందం, తృప్తి అంతటి బోధనాపటిమను నాలో ప్రేరేపించిన శ్రీమతి లక్ష్మీకాంతమ్మ మాడమ్ ఎవరోకాదు, ఈనాడు, సుపరిచిత, ప్రఖ్యాత, ఎదురులేని ధీటైన పత్రికల్లో ప్రతి సోమవారం ఆమె మానసిక సమస్యలు, స్వీయ సమస్యలకు చక్కని కౌన్సిలింగ్ ఇస్తూ ఎంతో మంది పాఠకుల జీవితాల్ని సరిదిద్దిన శాంతి ప్రధాత, పరిష్కార దాత! ఆమె 80వ ఏట కూడ ఎన్నో పురస్కారాలందుకున్న మనస్తత్వ నిపుణురాలు. ‘‘సృష్టి’’సంస్థకు గౌరవ సభ్యురాలు, ‘‘్భవానీ విద్యాసంఘానికి’’ అధ్యక్షురాలు; 13-3-2016న ‘లలిత కళాసమాఖ్య సాంస్కృతిక సంఘం’వారిచే ‘మానసిక రత్న’ గౌరవ పురస్కారం అందుకున్న మహిళా అధ్యాపకురాండ్రకు మాతృక!
‘‘ఒక గురువు పాఠం బోధించడమేకాదు, శిష్యుల ప్రేమానురాగాలను చూరగొనడం విశేషం, ఉత్తమ గురువు లక్షణమనీ, సంకల్పశక్తి లక్ష్యాలు అందుకోడానికి అవసరం’’అని పి.జి ప్రమాణాలను సైకాలజీలో అందుకునేలా డిగ్రీలోనే మమ్ము చాకులను చేసిన ఘనత ఆమెకే! గ్రంథాలయంలోని పుస్తకాలను వరవడిగా చదివే మంచి అలవాటు, చక్కని అభిరుచులు, మానవ సంబంధాలు, నైతిక విలువలను సంస్కారాలను నేర్పి నన్ను సుగుణవతిగా, వ్యక్తిత్వ విశేషంతో ఘనంగా తర్ఫీదుచేశారు. మనం మనలో ఆత్మావలోకనంతో లోపాలను గ్రహించి చక్కదిద్దుకోవాలన్న ఆలోచన కలిగించిన ఆ గురువుకు కొండంత పత్రి కాదుగానీ, పాదాభివందనాలు! ఆమె నేర్పిన ఆత్మవిశ్వాసం, కార్యదక్షత, నిర్విరామ క్రియాశీలత, ప్రార్థన, యోగా, ధ్యానాలు ప్రశాంత జీవితానికి, సమాజంలో తోటివారి మనస్సులనెరిగి మసలుకోవడం అవసరమని ఉద్బోధించిన ఇలాంటి ఆణిముత్యాలు, అధ్యాపకులు మన భారతావనికి పసిడి కిరణాలు కాదా! అలాంటి మనస్తత్వశాస్త్రంలో హంస, ఉపాధ్యాయినిల్లో వజ్రం, జీవన మానసిక సమస్యలు దీర్చిన ఆమె నాకు మహోపాధ్యాయిని! గురుదేవోభవ!గా గురుపూజలందుకోండి మాడమ్! నేటి కల్లోల సమాజంలో యువత వనరులు నష్టపోకుండా మీవంటి గురువులు మానసిక సంక్షోభంతో తామెటుపోతున్నారో తెలియని మానసిక దౌర్భల్యంతో మాదకద్రవ్యాల సేవ, వావివరుసలు లేక మానభంగాలు, చిన్నారుల హత్యలు, ఆసిడ్ ప్రలోభాలు, వివాహ జీవితంలో మహిళలను రచ్చకీడ్చి అవమానపరచి అఘాయిత్యాలకు పాల్పడేలా హీన చరిత్రలు కాకుండా మీవంటి మనస్తత్వ శాస్తన్రిపుణులు ఆయా కళాశాలల్లో సరియైన సమయంలో కౌన్సిలింగ్ ఇచ్చే పని దైవకార్యంగా భావించి వివేకానందగారు భారతావనికి యువత శక్తికావాలని కాంక్షించిన వారి ఆకాంక్షను నెరవేర్చే గురువుగా మీరు సేవ చేయగలరని ఆశిస్తూ, మీకు ఆయురారోగ్యాలను దైవం అందించగలడని ప్రార్థిస్తూ మనస్సుమాంజలులు!

- పరిమి శ్యామలాదేవి 8328291389